Home /News /explained /

Mutual Funds Vs Stocks: మ్యూచువల్ ఫండ్స్ బెటరా? స్టాక్స్ కొనాలా? ఈ రెండింట్లో పెట్టుబడికి ఏది బెస్ట్ ఆప్షన్?

Mutual Funds Vs Stocks: మ్యూచువల్ ఫండ్స్ బెటరా? స్టాక్స్ కొనాలా? ఈ రెండింట్లో పెట్టుబడికి ఏది బెస్ట్ ఆప్షన్?

Mutual Funds Vs Stocks: మ్యూచువల్ ఫండ్స్ బెటరా? స్టాక్స్ కొనాలా? ఈ రెండింట్లో పెట్టుబడికి ఏది బెస్ట్ ఆప్షన్?
(ప్రతీకాత్మక చిత్రం)

Mutual Funds Vs Stocks: మ్యూచువల్ ఫండ్స్ బెటరా? స్టాక్స్ కొనాలా? ఈ రెండింట్లో పెట్టుబడికి ఏది బెస్ట్ ఆప్షన్? (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Funds Vs Stocks | ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఇటీవల చాలామందిలో పెరిగింది. మరి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? నేరుగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలా? అన్న సందేహం ఉంది.

    పెట్టుబడుల గురించి అవగాహన ఉండి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపే వారికి ముందు వినిపించే పేర్లు.. స్టాక్ మార్కెట్లు (Stock Markets), మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds). ఒక మాటలో చెప్పాలంటే ఈ రెండు మంచివే. అయితే రెండూ ఒకటేనని అపోహ పడే వారు కూడా చాలా మంది ఉంటారు. పెట్టుబడుల ప్రయాణంలో చాలా మందికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా? లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను ఆశ్రయించాలా? అనే ప్రశ్న ప్రధానంగా ఎదురవుతుంది. వాస్తవానికి వీటిలో దేనికి ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ దానికి ఉన్నాయి. రాబడి ఎక్కువ కోరుకుంటే అధిక రిస్కుకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిధ అంశాల్లో మ్యూచువల్ ఫండ్స్‌కు, స్టాక్స్‌కు మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయో తెలుసుకుందాం.

    పెట్టుబడిలో తేడా


    మీరు షేర్స్‌లో పెట్టుబడి పెట్టారు అంటే ఒక కంపెనీలో వాటా కొనుగోలు చేశారని అర్థం. అదే మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వైవిధ్యభరితమైన పెట్టుబడి సాధనం. ఇది అనేక కంపెనీల వాటాలను ఒక పెట్టుబడిగా అందిస్తుంది. అంటే ఒకే ఫండ్స్‌లో చాలా కంపెనీల షేర్లు ఉంటాయని అర్థం. షేర్స్లో మీరు సొంతంగా మీ పోర్టుఫోలియోను సృష్టించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మార్కెట్ను స్టడీ చేస్తూ.. కొన్ని స్పెసిఫిక్ కంపెనీల షేర్లు ఎంపిక చేసుకొని కొనాల్సి ఉంటుంది.

    మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడుల పోర్టుఫోలియోగా చెప్పుకోవచ్చు. వీటిని నిర్దిష్ట కంపెనీ వాటాలుగా కొనుగోలు చేయలేం. వీటిని నిపుణులు నిర్వహిస్తూ ఉంటారు. స్టాక్స్ కొనుగోలు చేసినా లేదా విక్రయించినా తగిన మొత్తంలో ట్రేడ్ కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో వార్షిక ఫీజు ఉంటుంది. అంతే కాదు సేల్స్ లోడ్స్ షార్ట్ టర్మ్ రిడమ్షన్ ఫీజు, ట్రాన్సాక్షన్ ఫీజులు వంటివి ఉంటాయి.

    Money Transfer: యూపీఐ పనిచేయట్లేదా? వెంటనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

    investment options, Mutual Funds or Stocks, mutual funds vs blue chip stocks, Mutual Funds vs Stocks, mutual funds vs stocks india, mutual funds vs stocks pros and cons, taxes on mutual funds vs stocks, పెట్టుబడి మార్గాలు, మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్
    ప్రతీకాత్మక చిత్రం

    రిస్క్ ఫ్యాక్టర్స్


    షేర్స్ కొనుగోలు చేసేటప్పుడు సరైన స్టాక్స్ ఎంపిక చేసి డబ్బు పెట్టుబడిగా పెట్టేందుకు విస్తృతంగా మార్కెట్ రిసెర్చ్ చేయాల్సి ఉంటుంది. షేర్స్లో నేరుగా పెట్టుబడి అన్నది కొంత రిస్క్ (నష్టభయం) ఎక్కువ ఉండే విషయమే. స్టాక్ మార్కెట్లో లిస్టైన వేలాది కంపెనీల నుంచి తగినది ఎంచుకోవడం చాలా పెద్ద పని. అంతే కాదు, ఒకసారి ఎంపిక చేసుకున్న తర్వాత ఆ స్టాక్ పనితీరు అనుక్షణం ట్రాక్ చేయాల్సి ఉంటుంది.

    మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే నిపుణులు, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్కు మీ పెట్టుబడులను మ్యానేజ్ చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన పరిశోధన అంతా వారు చూసుకుంటారు. ఇక్కడ షేర్ను కాకుండా ఫండ్ పనితీరును మీరు గమనించాల్సి ఉంటుంది. గ్రోత్/డివిడెంట్ ఆప్షన్స్, టాప్ అప్స్, సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్స్/ట్రాన్సఫర్ వంటి సౌలభ్యాలు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. అంతే కాదు చిన్న మొత్తంలో క్రమతప్పకుండా పెట్టుబడులు పెట్టేందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIP) ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే స్టాక్స్లో రిస్క్ ఎక్కువ అని చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి వైవిధ్యంగా.. వివిధ కంపెనీలు, రంగాలకు విస్తరించి ఉంటుంది కాబట్టి పెట్టుబడిలో ఒడిదొడుకులు తగ్గుతాయి. అంటే రిస్క్ ఫ్యాక్టర్ సైతం తగ్గుతుంది.

    PAN Card: పిల్లలకు కూడా పాన్ కార్డ్ తీసుకోవచ్చు... ఎలాగో తెలుసుకోండి

    investment options, Mutual Funds or Stocks, mutual funds vs blue chip stocks, Mutual Funds vs Stocks, mutual funds vs stocks india, mutual funds vs stocks pros and cons, taxes on mutual funds vs stocks, పెట్టుబడి మార్గాలు, మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్
    ప్రతీకాత్మక చిత్రం

    ఉత్తమ పెట్టుబడి సాధనం


    ELSS అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టం 1961 సెక్షన్ 80C, ELSS స్కీములల్లో రూ.1.5 లక్షల పెట్టుబడి వరకు పన్ను మినహాయింపులు అందిస్తుంది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ పెట్టుబడి ద్వారా ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. ELSS మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల ద్వారా రూ.46,800 వరకు పన్ను తగ్గించుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఈ వెసులుబాటు లేదు. అవన్నీ పన్ను పరిధిలోకి వస్తాయి.

    క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి


    మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే ఒక ప్రధానమైన ప్రయోజనం ఆర్థిక క్రమశిక్షణ. వీటిలో ఉండే SIP విధానం ద్వారా పెట్టుబడిదారు నిర్దేశిత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడిగా పెట్టవచ్చు. ఎంత మొత్తం పెట్టుబడి పెట్టగలం, ఏయే వ్యవధులు అనుకూలమో ముందుగానే పెట్టుబడిదారు నిర్ణయించుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఈ సౌకర్యం లేదు. ప్రతీ లావాదేవీకి ఒక కచ్చితమైన సమయం ఉంటుంది. అది కూడా పెట్టుబడిదారే సొంతంగా చూసుకోవాల్సి ఉంటుంది.

    Investment: రూ.20,000 పెట్టుబడి... కోటి రూపాయల రిటర్న్స్... ఎలాగంటే

    investment options, Mutual Funds or Stocks, mutual funds vs blue chip stocks, Mutual Funds vs Stocks, mutual funds vs stocks india, mutual funds vs stocks pros and cons, taxes on mutual funds vs stocks, పెట్టుబడి మార్గాలు, మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్
    ప్రతీకాత్మక చిత్రం

    పెట్టుబడి వ్యవధి


    మ్యూచువల్ ఫండ్స్‌లో తగిన రాబడి పొందాలంటే కనీసం 5-7 సంవత్సరాల కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వీటిని దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించాలి. స్టాక్స్‌లో పెట్టుబడి అయితే.. మీరు సరైన షేర్లు ఎంచుకొని తగిన సమయంలో కొనుగోలు చేసి, సరైన సమయంలో అమ్ముకోవచ్చు. దీని ద్వారా చాలా వేగంగా, పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించే సౌలభ్యం ఉంది.

    లిక్విడిటీ


    షేర్స్‌కు సర్క్యూట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఒక కంపెనీ షేర్ లోయర్ సర్క్యూట్ తాకినా లేదా అప్పర్ సర్క్యూట్ తాకినా ఆ స్టాక్స్‌ను మీరు ఆ రోజు అమ్మలేరు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ సమస్య ఉండదు. అవి నెట్ అసెట్ వ్యాల్యూ కలిగి ఉంటాయి. వాటిని ఏ రోజైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు.

    సౌలభ్యం


    మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు పెట్టుబడి పెట్టి మర్చిపోవచ్చు. నిపుణుల నిర్వహణలో ఫండ్ ఉంటుంది కాబట్టి దీర్ఘకాలంలో అవి కచ్చితంగా ఎదిగే స్కోప్ ఉంటుంది. స్టాక్స్ విషయంలో ఈ పరిస్థితి ఉండదు. మీరు అనుక్షణం మార్కెట్ పోకడలు గమనించాల్సి ఉంటుంది. మీరు విప్రో వంటి షేర్ ఎంచుకుంటే లాభాలు ఆర్జిస్తారు, అదే మీ ఎంపిక ఒకవేళ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వంటిది అయితే దురదృష్టాన్ని చూడాల్సి ఉంటుంది.

    Business Idea: రూ.10 వేల పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం... నెలకు రూ.30 వేల ఆదాయం

    investment options, Mutual Funds or Stocks, mutual funds vs blue chip stocks, Mutual Funds vs Stocks, mutual funds vs stocks india, mutual funds vs stocks pros and cons, taxes on mutual funds vs stocks, పెట్టుబడి మార్గాలు, మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్
    ప్రతీకాత్మక చిత్రం

    తుది నిర్ణయం


    మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలా లేదా స్టాక్స్ వైపు వెళ్లాలా అన్నది మార్కెట్కు సంబంధించి మీ పరిజ్ఞానం, అనుభవంతో పాటు మీరు వెచ్చించే సమయం, మీరు చేసే ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుంది. మీరు కొత్త ఇన్వెస్టర్ అయి ఉండి, స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి అనుభవం లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు ప్రారంభించడం మంచిది. స్థిరమైన రాబడి చూస్తున్నట్టు అయితే మ్యూచువల్ ఫండ్స్ మెరుగైనవని చెప్పవచ్చు. మీరు ఒక వేళ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అయి, మీ దగ్గర తగినంత సమయం ఉంటే స్టాక్స్‌లో పెట్టుబడి మంచి ఛాయిస్ అవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Investment Plans, Mutual Funds, Personal Loan, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు