Home /News /explained /

MOVIE TICKETS ISSUE TURNING OUT TO BE SERIAL AS BIG MOVIES LIKE RRR RADHE SYAM RELEASING FOR SANKRANTHI SEASON FULL DETAILS HERE PRN GNT

Explainer: ఏపీలో సినిమా టికెట్ల వివాదంతో ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..? పెద్ద సినిమాల పరిస్థితేంటి..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వివాదం (Movie Tickets Controversy) తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం చర్చనీయాంశమైంది. అసలు ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో ఎవరి ఆర్ధిక మూలాలు దెబ్బతింటాయి. ఎవరికి ఎక్కువ నష్టం అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వివాదం (Movie Tickets Controversy) తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం చర్చనీయాంశమైంది. అసలు ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో ఎవరి ఆర్ధిక మూలాలు దెబ్బతింటాయి. ఎవరికి ఎక్కువ నష్టం అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సినిమా డిస్ట్రిబ్యూష్ వ్యవస్థ కొంతమంది సినీ పెద్దల చేతుల్లోనే ఉండటంతో చిన్న సినిమాలు విడుదల కావాలంటే వారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేదంటే బొమ్మపడే ఛాన్స్ లేదనే వాదన బలంగా ఉంది. కొన్నిచోట్ల నిర్మాతలకు సొంత థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్టులు ఉండటంతో వారి సినిమాలను పెద్దఎత్తున విడుదల చేయుకోవడం, మిగిలిన వారివి పట్టించుకోవడం లేదనే టాక్ కూడా ఉంది.

  మారిన సీన్
  గతంలో సినిమా అంటే కథ సినిమా హీరో డైరెక్టర్ మీద ఆధారపడి ఉండేది. సినిమా రిలీజ్ అయితే శత దినోత్సవ వేడుకలు జరిగేవి. అప్పట్లో స్టోరీ, హీరో, మ్యూజిక్ ఇలా తమకు ఇష్టమైన అంశాలను ఆస్వాదిస్తూ ప్రేక్షకులు సినిమాలకు వెళ్లేవారు. అలా సినిమాలన్నీ వందరోజులు ఆడేవి. బొమ్మ వందరోజులు ఆడితే థియేటర్ల యజమానులకు కూడా భారీగా లాభాలు వచ్చేవి. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా వెనక్కి వచ్చేయాలన్న ఫార్ములాతోనే ముందుకు వస్తున్నాయి. అది ఎంతలా అంటే హిట్టా ఫట్టా అని తెలిసేలోపే బడ్జెట్ వసూలు కావాల్సిందే. అందుకోసం బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడమే కాకుండా.. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం, అధిక ధరలతో కలెక్షన్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

  ఇది చదవండి: ఆ హీరోలకు పేర్ని నాని కౌంటర్ సీఎంతో చిరంజీవి భేటీపై క్లారిటీ..RRR టికెట్లపై ఏమన్నారంటే..!


  పాతరోజుల్లో సినిమా విజయం అంటే ఎన్ని రోజులు ఆడింది అనే లెక్కలుండేవి.. ఆ తర్వాత వందరోజులు ఎన్ని ఎక్కువ థియేటర్లలో ఆడితే అదే సక్సెస్ అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు విడుదలైన వారంలో సినిమా ఎంత కలెక్ట్ చేస్తే అంత పెద్ద హిట్ అని భావిస్తున్నారు. అంతేకాదు రోజువారీ లెక్కలతో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లు ప్రకటనలిచ్చేస్తున్నారు.

  ఇది చదవండి: సినిమా థియేటర్ కు ఎలాంటి అనుమతులుండాలి..? వచ్చేదెంత..? మిగిలేది ఎంత..?


  సినిమా ఇండస్ట్రీ కలెక్షన్లను టార్గెట్ చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం సినిమా బడ్జెట్. గతంతో పోలిస్తే సినిమా ప్రొడక్షన్ ఖర్చులు, హీరోలు, ఇతర నటుల రెమ్యునరేషన్ బాగా పెరిగిపోయాయి. స్టార్ హీరోతో సినిమా అంటే కథతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ ఉండాల్సిందే. ఇందులో మెజారిటీ వాటా హీరో రెమ్యూనరేషన్ కే పోతుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ కి కూడా బాగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. షెడ్యూల్ లేట్ అయితే నిర్మాత అదనపు ఖర్చు భరించాల్సిందే..! దీంతో ఈ మొత్తాన్ని రాబట్టేందుకు భారీగా కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరముంది. దీంతో మొదటివారంలో వీలైనన్ని ఎక్కువ షోలు వేసి, ధరలు పెంచి పెట్టుబడిని తిరిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి.

  ఇది చదవండి: వైసీపీ ఎంపీ హత్యకు కుట్ర..? సొంతపార్టీ నేతలే స్కెచ్ వేశారా..? బాంబు పేల్చిన మరో ఎంపీ..!


  ఐతే కరోనా సమయం లో సినిమా హాళ్లు మూసివేయటంతో సినీ ప్రియులు ఓటిటి బాట పట్టారు. ఈ పరిణామంతో థియేటర్ల యాజమాన్యం తీవ్ర నష్టాలు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లవైపు అడుగులు వేస్తుండటంతో ఎగ్జిబిటర్ల ఆశలు చిగురించాయి. ఐతే మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లు రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్లను తగ్గిస్తూ జీవో జారీ చేసింది. దీంతో కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది.

  ఇది చదవండి: బీజేపీని గెలిపిస్తే మూడేళ్లలో రాజధాని.. రూ.70కే చీప్ లిక్కర్.. సోము వీర్రాజు బంపర్ ఆఫర్..


  కలెక్షన్ల టార్గెట్ కు కారణాలు ఇవేనా..?

  ప్రభుత్వం ప్రేక్షకులకు తక్కువ ధర లో వినోదాన్ని అందించడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను సక్రమంగా రాబట్టుకనేందుకు టికెట్ ధరలను తగ్గించడమే కాకుండా ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది. ఈ క్రమంలో టికెట్ ధరలను రూ.5 నుంచి రూ.250 మధ్యలో నిర్ణయించింది. ఐతే నగరాలు, పట్టణాల్లో మల్టీప్లెక్సులు, ఏసీ థియేటర్ల పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నా... గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సీ గ్రేడ్ థియేటర్ల పరిస్థితి మాత్రం పూర్తిగా దిగజారిపోయింది.

  ఇది చదవండి: ఆనందయ్యకు గ్రామస్తుల షాక్.. కరోనా మందు పంపిణీకి బ్రేక్.. అసలేం జరిగిందంటే..!


  కార్పొరేషన్ పరిధిలోని మల్టీప్లెక్సుల్లో గరిష్టంగా రూ.250 వరకు సింగిల్ ఏసీ సినిమా హాళ్ల లో వంద రూపాయల వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఏసీ లేకుండా రూ.60 వరకు గరిష్టం గా ధర ఉండాలని నిర్ణయించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని నాన్ ఎసీ థియేటర్లలో టికెట్ ధరలు కనిష్టంగా రూ.5, గరిష్టంగా రూ.20 గా నిర్ణయిచింది. ఐతే ఈ జీ.ఓపై కొన్ని థియేటర్ యాజమాన్యాలు కోర్టు మెట్లు ఎక్కటంతో.. పిటిషన్ వేసిన వారికే మినహాయించడంతో ప్రభుత్వం నిబంధనలపేరుతో తనిఖీలు చేయిస్తోంది. లైసెన్స్ రెన్యువల్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఫారమ్-బి వంటి పత్రాల పేరుతో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని థియేటర్లను సీజ్ చేయగా.. మరికొందరు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు.

  ఇది చదవండి: కరోనా టైమ్ లో కన్నింగ్ ఐడియా.. ఏకంగా రూ.200 కోట్లకు టోకరా.. ఏలా చేశారంటే..!


  ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్ధించుకుంటోంది. ప్రజలకు తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే ఈ గోల ఉండదని పలువురు మంత్రులు చెబుతున్నారు. అంతేకాదు రూల్స్ అంటే అందరికీ ఒకటేనని స్పష్టం చేస్తున్నారు. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరోలు నాని, సిద్ధార్థ్, నిఖిల్ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై బహిరంగంగా, సోషల్ మీడియాలోనూ స్పందించారు.

  ఇది చదవండి: నగల దుకాణంలో దెయ్యాల గొడవ.. హడలిపోయిన యజమాని.. సీసీ ఫుటేజ్ వైరల్..


  ఇక మంగళవారం డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీ చర్చించిన ఇచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్ని నాని స్పష్టం చేశారు. కమిటీ పేరుతో కాలయాపన చేసే అవకాశం లేదని.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామన్నారు మంత్రి. నిబంధనలు పాటించాలని చెప్పినా రెన్యువల్ చేయించుకోనందుకే తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్ని నాని వివరించారు. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి జోలికి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరి మీదో కక్షతో ఇలా చేయలేదన్నారు.

  మరి ప్రభుత్వం నియమించిన కమిటీ చేసే సిఫార్సులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోతున్న RRR, రాధేశ్యామ్ తో పాటు ఫిబ్రవరిలో విడుదల కానున్న ఆచార్య, భీమ్లా నాయక్ వంటి సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Theatres

  తదుపరి వార్తలు