హోమ్ /వార్తలు /Explained /

Mission Paani: నీరే సంపద...దాన్ని సంరక్షించుకోవాలి.. వృథా చేస్తే కన్నీరే..

Mission Paani: నీరే సంపద...దాన్ని సంరక్షించుకోవాలి.. వృథా చేస్తే కన్నీరే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mission Paani: గాలి తర్వాత జీవకోటికి నీరు అత్యంత అవసరమైన ప్రకృతి వనరు. పంచ భూతాల్లో ప్రధానమైనది. మానవ మనుగడ, భూగోళంపై ప్రాణకోటి వృద్ధికి జలమే ఆధారం. ఇప్పుడు మనం చేస్తున్న తప్పులే మనకు నీటి వనరులను దూరం చేస్తున్నాయి.

గాలి తర్వాత జీవకోటికి నీరు అత్యంత అవసరమైన ప్రకృతి వనరు. పంచ భూతాల్లో ప్రధానమైనది. మానవ మనుగడ, భూగోళంపై ప్రాణకోటి వృద్ధికి జలమే ఆధారం. ఇప్పుడు మనం చేస్తున్న తప్పులే మనకు నీటి వనరులను దూరం చేస్తున్నాయి. ప్రతిబొట్టునూ ఒడిసిపట్టి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరమున్నది. లేదంటే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. నీరు ప్రతి ప్రాణికి అవసరమైన అతి ముఖ్యమైన జీవనాధారం. భూమిపై మాత్రమే దొరికే అతి అమూల్యమైన వనరు. అయితే భారత్ లో సుమారు 50 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని యూనిసెఫ్ చేసిన అధ్యయనంలో తేలింది. అందుకే ప్రతి ఏడాది ఈ రోజు అంటే మార్చి 22న అంతర్జాతీయ జల దినోత్సవం జరుపుకుంటున్నామ్.1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే దీని ప్రధాన లక్ష్యం. నీటి యొక్క విలువ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ భూ గ్రహం 71 శాతం నీటితో నిండి ఉంది. ప్రతి మానవుడు తన జీవిత కాలంలో 48 బిలియన్ గ్యాలన్ల నీటిని వాడుతున్నాడు. కానీ, ఇంతవరుకు ఆ నీటి యొక్క విలువను మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఇలాగే కొనసాగితే..భవిష్యత్తులో పెద్ద ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా పాండమిక్ వల్ల నీటి కొరత ఇంకా ఎక్కువ పెరిగిపోతోంది. కరోనా నుంచి వచ్చిన మెడికల్ వేస్టేజ్ ను ఎక్కడిక్కడ నీటి వనరుల్లో డంప్ చేయడం నీరు కలుషితమవుతోంది. విలువైన నీటిని తెలిసే కొందరు. తెలియక మరికొందరు వృథా చేస్తుంటారు.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు,కుంటల్లో నీరు ఇంకిపోతోంది. ప్రాజెక్టులు అడుగంటాయి. భూగర్భ జలాలు పాతాలానికి పడిపోతున్నాయి.అసలే వేసవి కావడంతో మండుతున్న ఎండలతో బోరుబావులు, ఎండిపోతున్నాయి. దీంతో తాగు నీటి సమస్య రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నపుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.ఇప్పటికీ మేలుకోక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారే గాని, సమస్య పునరావృతం కాకుండా చూసుకోవడం లేదు. మానవాళికి మనుగడనిస్తున్న నీటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

పెరుగుతున్న జనాభాకు, అందుబాటులో ఉన్న జలవనరులకు మధ్య రోజు రోజుకు అంతరం పెరిగిపోతున్నది. మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుంటే మున్ముందు నీటి ముప్పు పొంచి ఉన్నది. వృథాను అరికట్టకపోవడం, కాలుష్యం పెరిగిపోవడం, చట్టాలను అమలు చేయకపోవడంతో అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోలేకపోతున్నాం. చేజేతులా మనమే సమస్యను జఠిలం చేసుకుంటున్నాం. ప్రతీ రంగంలో నీరు ప్రధానమైనది. వ్యవసాయం, పరిశ్రమల్లో నీటిని పొదుపుగా వాడుకుంటేనే శ్రేయస్కరమని, భవిష్యత్‌ తరాలకు అందేలా కృషి చేయాలని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు.

First published:

Tags: Mission paani

ఉత్తమ కథలు