World Water Day: నీటి కాలుష్యంతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. దీన్ని ఎలా తగ్గించాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో నీటి కాలుష్యం కూడా ఒకటి. దీని వల్ల తాగునీటి లభ్యత తగ్గిపోతోంది. దీనికి పరిష్కారాల కోసం ఎన్నో కోట్లు డబ్బు ఖర్చు చేసి పరిశోధనలు చేస్తున్నారు. మనం కూడా ఇంట్లో నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.

  • Share this:
నీరు ప్రతి ప్రాణికి అవసరమైన అతి ముఖ్యమైన జీవనాధారం. భూమిపై మాత్రమే దొరికే అతి అమూల్యమైన వనరు. అయితే భారత్ లో సుమారు 50 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని యూనిసెఫ్ చేసిన అధ్యయనంలో తేలింది. ఫలితంగా పలురకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. వాటి వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 600 మిలియన్ డాలర్ల(రూ.4342.3 కోట్ల) ఆర్థిక భారం పడుతుందని అంచనా వేసింది. క్లిష్టమైన సమస్యలుగా మారిన నీటి కాలుష్యం, వ్యాధి కారక రసాయన కాలుష్యం రెండూ ప్రజల ఆరోగ్యానికి ప్రధాన సవాళ్లుగా మారాయని తెలిపింది.

నీటి కాలుష్యం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందంటే..
ప్రోటోజోవా, వైరస్, బ్యాక్టీరియా లాంటి వ్యాధికారక సూక్ష్మజీవులతో కలుషితమైన తాగు నీటి ద్వారా కలరా, టైఫాయిడ్, డయేరియా, హెపటైటిస్-ఏ వంటి పలు రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా సవాలుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు వ్యక్తిగత పరిశుభ్రతా విధానాలు కూడా ఈ కలుషితానికి దారితీస్తాయి. ఈ కాలుష్యం మూలం వద్ద లేదా మురుగునీటి మార్గాలకు దగ్గరగా ఉండే నీటి పైపుల ద్వారా కూడా జరుగుతుంది. ఇలా రెండు పైపులు పక్కపక్కనే ఉండడం వల్ల మురుగు నీరు మంచినీటితో కలిసే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా వ్యాధికారక సూక్ష్మజీవులతో ఆ నీరు కలుషితమవుతుంది.

నీటి సంబంధిత వ్యాధుల నుంచి నివారణ మార్గాలు..
- నీటి సరఫరా సురక్షితమైన మార్గాల నుంచి వచ్చేలా చూసుకోవడం ముఖ్యం. అంతేకాకుండా కాచి వడకట్టిన నీరు తాగడం లాంటి నీటి శుద్ధీకరణ చర్యలను చేపట్టాలి. వేడి చేసిన నీరు తాగడం అన్ని రకాల వ్యాధికారక కణాలను నశింపజేసే ఉత్తమ పద్ధతిగా చెప్పవచ్చు.
- తినడానికి ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా జబ్బులను దూరం చేసుకోవచ్చు.
- కలుషితం కాకుండా ఉండటానికి నీటిపై మూతలు పెట్టడం లేదా కప్పి ఉంచడం చేయాలి. నీటిని కప్పుల సాయంతోనే ముంచడం వల్ల అందులో మీ చేతులు పెట్టకుండా ఉండొచ్చు.
- అనేక వ్యాధులను నివారించడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉండాలి.
మనం తాగేనీరు ఎక్కువగా భూగర్భ జలం కావడం వల్ల తాగునీటి భద్రత, పరిశుభ్రతను నిర్ధారించేందుకు తీసుకోవాల్సిన మొదటి చర్య సహజ నీటి వనరులను శుభ్రంగా ఉంచుకోవడం.

పెరుగుతున్న నీటి కాలుష్యం నివారణకు ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి
టాయ్ లెట్లను చెత్త డబ్బాలుగా వినియోగించకూడదు..
చాలా మంది టాయ్ లెట్లలో బేబీ వైప్స్, ప్లాస్టిక్ వస్తువులను ఫ్లష్ చేస్తారు. అయితే ఇది మంచి పని కాదు. ఈ వస్తువులు మురుగునీటి శుద్ధిచేసే ప్రక్రియను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా చెత్తచెదారం తీరప్రాంతాల్లో నీటి కాలుష్యానికి దోహదపడతాయి. రసాయన కాలుష్యం కాకుండా ఉండటానికి టాయ్ లెట్లలో పాత మాత్రలు, మందులను వేయకూడదు.

సింక్ కింద చాలా జాగ్రత్తగా ఉండాలి..
ఉపయోగించిన ఆయిల్ తో పెయింట్ వేయకూడదు. రసాయన క్లీనర్లు లేదా ఇతర గృహోపకరణాల్లో సోడియం హైపోక్లోరైడ్, అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్ వంటి విషపూరిత పదార్థాలు ఉండటం వల్ల వాటిని సింక్ లో ఉంచకూడదు.

బయోడీ గ్రేడబుల్ క్లీనింగ్ వస్తువులు ఉపయోగించడం..
క్లీనింగ్ ఉత్పత్తుల నుంచి వేలాది రసాయనాలు నదుల్లో, కాలువల్లో కలుస్తాయి. అక్కడి నుంచి ఇవి మొక్కలకు, జంతువులకు, మనుషులు తాగడానికి అందుతాయి. వీటి వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు బయో డీగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలి.

Video: జైపూర్ జూలో చేరిన బెంగాల్ టైగ్రెస్

భాస్వరం ఉండే ఎరువులు మానుకోండి..
పంటల్లో వాడే భాస్వరం వర్షం ద్వారా సమీపంలోని నీటిలోకి చేరుతుంది. ఇది తీవ్రమైన పర్యావరణ సమస్యలను కలిగిస్తుంది. ఫలితంగా తాగునీరు కాలుష్యానికి గురై పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే మీ ఇల్లు, ఇంటికి చుట్టుపక్కల భాస్వరంతో తయారుచేసిన ఎరువులు ఉపయోగించకపోవడం మంచిది.
First published: