Mission Paani: నీటి సంరక్షణతోనే మెరుగైన పరిశుభ్రత..శుభ్రమైన నీటి కోసం ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

Mission Paani: ప్రపంచంలోని మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే, కొన్నేళ్లుగా నీటి కొరత అధికం అవుతోంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృథా అని చెప్పక తప్పదు.

  • Share this:
ప్రపంచంలోని మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే, కొన్నేళ్లుగా నీటి కొరత అధికం అవుతోంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృథా అని చెప్పక తప్పదు. నీరు ఉన్న వారు ఇష్టారీతిగా వృథా చేస్తుంటూ పోతుంటే.. లేని వారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ దేశంలోని చాలా మారుమూల గ్రామాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. అయితే, నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిలో వృథా చేసుకుంటూ పోతే భవిష్యత్​లో ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే త్రాగడానికి పనికొస్తుంది. కాబట్టి, నీటి పరిరక్షణ ఎంతో అవసరం. నీటిని మనం త్రాగటానికే కాకుండా అనేక కార్యకలాపాలకు ఉపయోగిస్తుంటాం. కాబట్టి ఈ సహజ వనరులను వృథా కాకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సురక్షితమైన నీరు త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం చేయడంతో పాటు మెరుగైన పారిశుద్యం, పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుధ్యం లేకపోవడం, అపరిశుభ్రత, అసురక్షిత నీరు త్రాగడం వల్ల ఏటా అనేక మంది వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు.

ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఎదుర్కొంటున్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా సురక్షిత నీరు తాగడం లేదని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంచి నీటి కొరత వేధిస్తోంది. తద్వారా, ఆయా దేశాల్లో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారు. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచి నీటి కొరత ఏర్పడుతుంది. అందువల్ల, నీటిని వీలైనంత సంరక్షించుకోవాలి.

నీటి సంరక్షణ కోసం పాటించాల్సిన పద్దతులు
1. మంచి నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన నీటి వనరులను అభివృద్ధి చేయడం అవసరం.
2. దీని కోసం కొత్త బావులు, బోర్‌వెల్స్‌ తోడాలి. స్థానిక సంఘాలతో చేతులు కలిపి ఈ కార్యక్రమం చేపట్టాలి.
3. ఇప్పటికే ఉన్న బోర్​వెల్స్​ను మరమ్మతులు చేయాలి. పశువుల కోసం నీటి టవర్లను నిర్మించడం, వాటికి మరమ్మతులు చేయడం చాలా అవసరం. తద్వారా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయవచ్చు.
4. ఇళ్ళు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి స్థానికంగా సంఘాలను ఏర్పర్చుకోవాలి.
5. ప్రభుత్వాలు నీటి వనరుల ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే.. అది త్రాగునీటి ఎద్దడి తీర్చడంతో పాటు, పరిశుభ్రతకు సహాయపడుతుంది.
6. బిందు సేద్యం, వర్షపు నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను చేపట్టడం వంటి నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయగలిగితే, అది ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్మాణానికి సహాయపడుతుంది. తద్వారా, భవిష్యత్తులో నీటి ఎద్దడిని సులభంగా ఎదుర్కోవచ్చు.
7. పరిశుభ్రతను ప్రతి ఒక్కరు ప్రాధమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో, ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

నీటి పెంపకం, వనరుల పరిరక్షణ గురించి అవగాహన పెంచడానికి న్యూస్ 18, హార్పిక్‌తో కలిసి మిషన్ పానీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరికీ సహజ వనరులను పరిరక్షించడమే మా లక్ష్యం.
Published by:Sridhar Reddy
First published: