ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ నేపథ్యంలో మిత్రదేశాల మధ్య రాజకీయ సంక్షోభాలు బయటపడుతున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా యూఎస్‌తో మిడిల్ఈస్ట్ మిత్రదేశాలు గొంతు కలపలేదు. యూఎన్ఎస్సీ(UNSC)లో రష్యాపై అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాలకు రెండు సార్లు యూఏఈ మద్ధతివ్వలేదు. వివాదాల్లో న్యూట్రల్‌గా ఉండటానికే యూఏఈ(USA) మొగ్గు చూపింది. చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్(Ukraine) యుద్ధంతో యూఏఈ వైఖరి బయటపడిందని, కొత్త భాగస్వాముల కోసం ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. హౌతీపై మిసైల్, డ్రోన్ దాడులు చేసే అంశంలో యూఎస్, యూఏఈ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ మద్దతిస్తున్న హౌతీ రెబల్స్‌ను ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి యూఎస్ తొలగించడంతో అబుదాబి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉక్రెయిన్‌పై నిషేధిత క్లస్టర్ బాంబ్స్ ప్రయోగిస్తున్న రష్యా.. వెల్లువెత్తుతున్న విమర్శలు..
యూఏఈ రక్షణ రంగ బలోపేతానికి యూఎస్ అభయమిచ్చినా, హౌతిని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని అబుదాబి పట్టుబట్టింది. యూఎస్‌తో 23 బిలియన్ డాలర్ల విలువైన 50F- 35 ఫైటర్ జెట్స్, ఆయుధాల తయారీ డీల్‌ను రద్దు చేసింది. యూఎస్‌తో చెడిన క్రమంలో మాస్కోతో అబుదాబి సంబంధాలు బలపడ్డాయి. Su-75 ఫైటర్ జెట్స్ కోసం రష్యాతో యూఏఈ డీల్ చేసుకొన్నట్లు సమాచారం. 2019 యూఏఈ పర్యటనలో 1.3 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ, టెక్నాలజీ డీల్స్‌పై పుతిన్ సంతకం చేశారు. ఒపెక్ కూటమిలో క్రూడ్ ఆయిల్‌తో మాత్రమే కాకుండా 1997 నుంచి రష్యా, యూఏఈ మధ్య 10 రెట్లు వాణిజ్యం పెరిగింది. 2021లో యూఏఈ దిగుమతుల్లో దాదాపు 50 శాతం గోధుమలు వచ్చించి రష్యా నుంచే కావడం గమనార్హం. ఉక్రెయిన్ ప్రజలకు వీసా రద్దు చేసినా, 5 మిలియన్ పరిహారం ఇస్తామని యూఏఈ హామీ ఇచ్చింది.
సౌదీ అరేబియా
ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను ఖండించడానికి ఆచితూచి వ్యవహరిస్తున్న మరో అరబ్ కంట్రీ సౌదీ అరేబియా. ఓపెక్ కూటమిలో రష్యా ప్రధాన భాగస్వామిగా సౌదీ అరేబియా భావిస్తోంది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడటానికి ప్రపంచ దేశాలు తీసుకొనే చర్యలకు సహకరిస్తామని సౌదీ హామీ ఇచ్చింది. రష్యాపై సౌదీ అరేబియా ఆంక్షలు విధించాలన్న యూఎస్ ఆదేశాలను తిరస్కరించింది. సౌదీ అరేబియా ప్రత్యర్థి ఇరాన్, సిరియా కూడా రష్యా చర్యలకు బహిరంగంగా మద్దతు పలికాయి.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థిపై కాల్పులు.. కీవ్‌లో అల్లకల్లోలం
టర్కీ
రష్యా, ఉక్రెయిన్‌తో ఉన్న సంబంధాలతో వారి సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేస్తామని టర్కీ ప్రకటించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో పుతిన్‌తో వైరం వద్దని అంకారా భావిస్తోంది. రష్యాతో వైరం పెట్టుకొంటే ఇంధన దిగుమతులు, వాణిజ్యం, పర్యాటకం దెబ్బతింటాయని నాటో సభ్యదేశమైన టర్కీ ఈ నిర్ణయం తీసుకొంది. ఇటు నాటో అటు రష్యాతో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే టర్కీ హెచ్చరికలు చేసింది. అధ్యక్షుడు ఎర్డోగాన్ అభ్యర్థన మేరకు 4 యుద్ధనౌకలను టర్కీ జలాల ద్వారా బ్లాక్సీలోకి పంపే ప్రణాళికను రష్యా విరమించుకొంది. టర్కీ ఫిలాంథరొపిస్ట్ ఒస్మాన్ కవాలాను విడుదల చేయాలనే డిమాండ్‌తో యూఎస్, పశ్చిమ దేశాలతో టర్కీ సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇజ్రాయెల్
UNGA వద్ద ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించినా.. మాస్కో, కీవ్‌కు మద్దతిస్తున్న పశ్చిమ దేశాలకు దూరం కాకూడదనే ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. అమెరికా, రష్యా, ఉక్రెయిన్లతో సంబంధాలు సంక్లిష్టంగా చేసుకోకూడదనే తాపత్రయంలో ఉంది. అవసరమైతే ఇజ్రాయెల్ విమానాలకు దీటైన జవాబు ఇచ్చేలా సిరియాలో వైమానిక రక్షణ ఆస్తులను రష్యా నిర్వహిస్తోంది. ఇరాన్‌కు చెక్ పెట్టాలంటే సిరియాలో స్వేచ్ఛ అవసరం కనుక రష్యాను ఇజ్రాయెల్ ఎదిరించేందుకు సాహసించడం లేదు.
తమ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఉక్రెయిన్‌కు తరలించకుండా యూఎస్‌ను కూడా అడ్డుకొంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సరఫరా చేసి పుతిన్‌ను వవ్యతిరేకించడానికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు టెల్ అవీవ్ ఇష్టపడలేదు. బాల్టిక్ దేశాలైన ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా తమ ఆయుధాలను ఉక్రెయిన్‌కు తరలించకుండా కూడా యూఎస్ మిత్ర దేశం ఇజ్రాయెల్ అడ్డుపడింది.
ఉక్రెయిన్ సంక్షోభంపై వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య వివాదం తతలెత్తిందని సమాచారం. రష్యా చర్యలకు వ్యతిరేకంగా UNSCలో చేసిన తీర్మానానికి యూఎస్‌కు మద్దతు ఇవ్వడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. రష్యా, ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో యూదుల జనాభా ఉన్నందున క్లిష్ట పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉంది. 1941లో కీవ్‌ను నాజీ ఆక్రమించినప్పుడు రెండు రోజుల్లో దాదాపు 34,000 మంది యూదులు హత్యకు గురయ్యారు. 1943లో కీవ్‌ను సోవియట్ తిరిగి స్వాధీనం చేసుకునే వరకు యూదులు,రోమా,ఉక్రేనియన్లు,సోవియట్ యుద్ధ ఖైదీలను నాజి కాల్చి చంపింది. మార్చి 1న కీవ్‌లోని బేబిన్ యార్ మెమోరియల్ కాంప్లెక్స్ సమీపంలో రష్యా దాడిలో కనీసం 5 మంది మృతి చెందారు. హోలోకాస్ట్ ఊచకోతకు గుర్తుగా భావించే బేబిన్ యార్ మెమోరియల్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు జెలెన్స్కీ పిలుపు నిచ్చారు. ఈ క్రమంలోనే పుతిన్‌ను ఫోన్ చేసి దాడులను ఆపాలని ఇజ్రాయెల్ పీఎం బెన్నెట్ కోరారు.
Vladimir Putin | పుతిన్‌కు ఆస్తి అన్ని లక్షల కోట్లా ? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడా ?
ఉక్రెయిన్ సంక్షోభంతో మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ ప్రభావానికి పరీక్ష
రష్యాకు వ్యతిరేకంగా గొంతు వినిపించడంలో పశ్చిమ దేశాలకు మిత్రదేశాల మద్దతు దక్కలేదు. యూఎస్‌తో సంబంధాలను పరిశీలించుకొనే పనిలో యూఏఈ, అరబ్ దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్దాన్ని మరో యూరోపియన్ క్రైసిస్గా మమాత్రమే మిడిల్ ఈస్ట్ భావిస్తోంది. మిడిల్ ఈస్ట్‌పై నుంచి దృష్టి మరల్చడంతో అరబ్ దేశాలు యూఎస్‌పై ఆగ్రహంగా ఉన్నాయి. దశాబ్దకాలంలో యూఎస్ వ్యూహాలతోనే అరబ్ దేశాలలో యూరోపియన్ దేశాలు అడుగుపెట్టాయని నిపుణులు చెబుతున్నారు. యూరోపియన్ దేశాల్లో ముస్లిం శరణార్థులను వేరుగా చూడటం కూడా మిడిల్ ఈస్ట్ తప్పుబడుతోంది. సిరియా, ఆఫ్టాన్ శరణార్థులకంటే ఉక్రెయిన్ శరణార్థులకు యూరప్‌లో రక్షణ ఎక్కువ ఉందని భావిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే భాగస్వాములు కాక తప్పదని తెలిసినా న్యూట్రల్‌గా ఉండటానికే అరబ్ కంట్రీస్ ఆసక్తి చూపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine