'Mera Ration' app: వన్ నేషన్... వన్ రేషన్ కార్డ్ విధానం తెచ్చిన కేంద్రం... శుక్రవారం మేరా రేషన్ మొబైల్ యాప్‌ని ప్రారంభించింది. దీని ద్వారా చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా వినియోగదారులు... తమకు దగ్గర్లో ఎక్కడ రేషన్ షాపు ఉందో గుర్తించగలరు. జనరల్‌గా తమ చుట్టుపక్కల రేషన్ షాప్ ఎక్కడుందో స్థానికులకు తెలుస్తుంది. అలా కాకుండా కొంత మంది తరచూ కొత్త ప్రదేశాలకు వెళ్లి పనులు చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఈ యాప్ బాగా పనికొస్తుంది. NICతో కలిసి... కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్దిదారులకు రకరకాల ONORC సేవలు అందించవచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, FPS డీలర్స్, ఇతర సంబంధిత వ్యక్తులకు ప్రయోజనం కల్పించవచ్చని కేంద్రం తెలిపింది.
"వన్ నేషన్ వన్ రేషన్ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం... జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ఇతర సంక్షేమ పథకాలు... లబ్దిదారులందరికీ చేరవేస్తోంది. ముఖ్యంగా వలస కూలీలు, వారి కుటుంబీకులకు... రేషన్ షాపుల ద్వారా... సరుకులు లభించేలా చెయ్యాలన్నది కేంద్రం ఆలోచన. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2020 డిసెంబర్ నాటికి 32 రాష్ట్రాలకు విస్తరించారు. ఇంకా అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, బెంగాల్ మాత్రమే మిగిలివున్నాయి. కొన్ని నెలల్లోనే వాటికీ విస్తరిస్తాం" అని ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.
ప్రస్తుతం వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా... మొత్తం లబ్దిదారుల్లో 69 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. అంటే NFSAలో 86 శాతం మందికి లబ్ది చేకూరుతోంది. ONORC కింద నెలకు సగటున 1.5 కోట్ల నుంచి 1.6 కోట్ల వరకూ ట్రాన్సాక్షన్లు పోర్టబులిటీ అవుతున్నాయి. అలా అయ్యేవారికి ఈ యాప్ ఉపయోగపడనుంది.
"ఈ యాప్‌ని 14 భాషల్లోకి తేవాలనుకుంటున్నాం. ఎక్కువ మంది వలస కూలీలు ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో... అక్కడి లాంగ్వేజీల్లోకి తేవాలనుకుంటున్నాం" అని సుధాన్షు పాండే తెలిపారు.
'Mera Ration'యాప్ వల్ల ప్రయోజనాలు:
- లబ్దిదారులు రేషన్ షాపు ఎక్కడుందో తెలుసుకోగలరు.
- లబ్దిదారులు తమకు రావాల్సిన ఆహార ధాన్యాలు, ఇటీవల జరిగిన ట్రాన్సాక్షన్లు, ఆధార్ సీడింగ్ వంటివి తెలుసుకోగలరు.
- లబ్దిదారులైన వలస కూలీలు... తాము ఏయే ప్రాంతాలకు వలస వెళ్తున్నదీ వివరాలు ఇవ్వొచ్చు.
- సలహాలు,సూచనలు కూడా ఇవ్వొచ్చు.
ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లీష్, హందీలో లభిస్తోంది. యాప్ వాడే లబ్దిదారుల సంఖ్య పెరిగేకొద్దీ అందులోని సదుపాయాలను కూడా పెంచుతామని అధికారులు తెలిపారు. వన్ నేషన్ - వన్ రేషన్ విధానాన్ని అమలు చేసే రాష్ట్రాలు.. తమ డీఎస్డీపీ (GSDP - రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి)లో 0.25 శాతం అదనంగా రుణం పొందేందుకు వీలవుతుంది. అంటే అదనంగా రూ.37,600 కోట్ల రుణాలు పొందగలవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Ration card