• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • MEET THE INDIAN JUMPING ANTS CAN ALTER THE SIZE OF THEIR BRAIN HERES WHY GH SRD

Indian Jumping Ants: మెదడు పరిమాణాన్ని తగ్గించుకొని రాణిగా మారే చీమలు.. ఎందుకో తెలుసా?

Indian Jumping Ants: మెదడు పరిమాణాన్ని తగ్గించుకొని రాణిగా మారే చీమలు.. ఎందుకో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం (Photo Source AFP)

Indian Jumping Ants: వర్కర్ గా ఉండే చీమ బాధ్యత ఏంటంటే పుట్టను శుభ్రంగా ఉంచడం, సంతానంపై శ్రద్ధ వహించడం, ఆహారం కోసం వేట తదితర పనులు చేయడం.. అయితే జంపింగ్ యాంట్స్ మాత్రం రాణి మరణించిన తర్వాత కూడా ఈ సముహాలు చాలా కాలం పాటు జీవిస్తాయి.

  • Share this:
సమస్త జీవరాశుల్లో మెదడు అనేది క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ మెదడు పరిమాణాన్ని మార్చుకోవచ్చా.. అంటే కొన్ని జీవజాతులకు ఇది సాధ్యమే. అయితే తాజా పరిశోధనా ప్రకారం కొన్ని జాతులు తమ మెదడు ఆకృతిని మార్చుకోవడమే కాకుండా తిరిగి ఒరిజనల్ స్థాయికి చేరే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తేలింది. భారత్ లో కనిపించే జంపింగ్ యాంట్స్(ఎగిరే చీమలు) ఈ కోవకు చెందినవే. ఈ ప్రత్యేకమైన చీమలు సమూహాలుగా ఉండి రాణి మరణించిన తర్వాత కూడా ఆ స్థానాన్ని వేరొక చీమ భర్తీ చేస్తుంది. అయితే రాణి స్థానాన్ని భర్తీ చేసి ఆ బాధ్యతలు స్వీకరించే సమయంలో అవి మెదడు పరిమాణాన్ని తగ్గించుకుంటాయని, సంతానానికి జన్మనిచ్చే సమయంలో మెదడు పరిమాణాన్ని విస్తరించి యథాస్థితికి చేరుకుంటాయని ఈ అధ్యయనంలో తేలింది.

మెదడు పరిమాణాన్ని ఎందుకు తగ్గిస్తాయంటే..
ఆ విధంగా మెదడును పూర్వస్థితికి తీసుకురావడం ఇతర కీటక జాతుల్లో చాలా అరుదుగా ఉంటుందని, కానీ ఇండియన్ జంపింగ్ యాంట్స్ విషయంలో ఈ స్థితి భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఎంతో ప్రత్యేకమైనవని క్లైంట్ ప్యాట్రిక్ అనే బయాలజీ ప్రొఫెసర్ తెలిపారు. శక్తిని ఆదా చేయడానికి, పునరుత్పత్తి కోసం మెదడు నుంచి అండాశయాలకు వనరులు అందించేందుకు తమ మెదడు ద్రవ్యరాశిలో కొంత భాగాన్ని ఆయన తగ్గిస్తాయని పేర్కొన్నారు. చీమలు గుంపులుగా తిరుగుతాయి. ప్రతి సమూహానికి ఓ రాణి ఉంటుంది, మిగతావి వర్కర్లుగా పనిచేస్తాయి. అయితే రాణి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఇవి తమ శరీరాలను సాధారణ స్థితికి మార్చుకుంటాయి. చీమలు వర్కర్లుగా పనిచేస్తాయా లేదా రాణిగా పనిచేస్తాయా అనేది లార్వా దిశ నుంచి నిర్ణయించబడుతుంది. సరైన హార్మోన్లు, చక్కటి పోషకాలతో నిండిన శరీరాన్ని కలిగిన చీమను తమ సమూహానికి రాణిగా ఎన్నుకుంటాయి. మిగిలినవి వర్కర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తాయి. అయితే జంపింగ్ యాంట్స్(ఎగిరే) విషయానికొస్తే ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది.

రాణి మాత్రమే పునరుత్పత్తిలో పాల్గొంటుంది..
వర్కర్ గా ఉండే చీమ బాధ్యత ఏంటంటే పుట్టను శుభ్రంగా ఉంచడం, సంతానంపై శ్రద్ధ వహించడం, ఆహారం కోసం వేట తదితర పనులు చేయడం.. అయితే జంపింగ్ యాంట్స్ మాత్రం రాణి మరణించిన తర్వాత కూడా ఈ సముహాలు చాలా కాలం పాటు జీవిస్తాయి. చీమలు, ఇతర కీటకాల్లో రాణికుండే ఏకైక బాధ్యత ఫేరోమోన్లను విడుదల చేయడం ద్వారా పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం. రాణికి మినహా ఇతర ఫీమేల్ యాంట్ వర్కర్లకు గుడ్లుపెట్టడానికి అనుమతి లేదు. కానీ జంపింగ్ యాంట్స్ లో మాత్రం రాణి చనిపోయిన తర్వాత కూడా మిగిలిన చీమలు చాలా కాలం జీవించి ఉన్నాయి. సమూహంలో మరో చీమను రాణిగా ఎంచుకుంటున్నాయి.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు