Home /News /explained /

MEET DR RUHA SHADAB WHO IS HELPING THOUSANDS OF INDIAN MUSLIM WOMEN WRITE THEIR SUCCESS STORIES BA GH

Exclusive: రూహా షాదాబ్.. చదువుకునే ముస్లిం యువతులకు ‘సలహాదారు’.. ఏం సలహాలంటే..

రూహా షాదాబ్ (File)

రూహా షాదాబ్ (File)

హార్వర్డ్ యూనివర్సిటీ లో చదువుకోవడానికి వెళ్లే ముందు తన తోటి ముస్లిం యువతుల నుంచి సలహాలు తీసుకొని వాటిని పాటించాలని భావించింది రుహా షదాబ్. కానీ ఆమెకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేకపోవడం ఆమెను నిరాశపర్చింది.

హార్వర్డ్ యూనివర్సిటీ లో చదువుకోవడానికి వెళ్లే ముందు తన తోటి ముస్లిం యువతుల నుంచి సలహాలు తీసుకొని వాటిని పాటించాలని భావించింది రుహా షదాబ్. కానీ ఆమెకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేకపోవడం ఆమెను నిరాశపర్చింది. ఆ నిరాశ నుంచే తన తోటి వారికి సాయం చేయాలనే ఆశయం ప్రారంభమైంది. ఓ డాక్టర్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్, సోషల్ ఎంట్రప్రెన్యూర్ అయిన షాదాబ్ లెడ్ బై ఫౌండేషన్ ని ప్రారంభించి దాని ద్వారా ముస్లిం యువతులకు మెంటార్ షిప్, గైడెన్స్ అందిస్తోంది. మైనార్టీ వర్గాలకు చెందిన మహిళల అభ్యున్నతికి తోడ్పడుతూ వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న షాదాబ్ తో న్యూస్ 18 ముచ్చటించింది. ఆమె వెల్లడించిన విశేషాలు మీకోసం..

లెడ్ బై ఫౌండేషన్ ని ప్రారంభించేందుకు మిమ్మల్ని ప్రోత్సహించిన అంశం ఏంటి? ఈ ఫౌండేషన్ ఎప్పుడు ప్రారంభించారు? దీన్ని లక్ష్యం ఏంటి?

లెడ్ బై ఫౌండేషన్ ఓ సామాజిక సంస్థ. దీని ద్వారా కాలేజీలకు వెళ్లే ముస్లిం యువతులు ప్రొఫెషనల్ గా ఎదిగేందుకు మేం సహాయం చేస్తాం. చదువుకునే ముస్లిం యువతుల సంఖ్యను పెంచేందుకు దీన్ని ప్రారంభించాం. హార్వర్డ్ లో ఇది ప్రారంభమైంది. నేను స్కాలర్ షిప్ పై అక్కడ మాస్టర్స్ చదువుతుండగా ఇది ప్రారంభమైంది. అక్కడ నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అనే కోర్సు చేశాను. హార్వర్డ్ కి చెందిన కెన్నడీ స్కూల్ లో దీన్ని పూర్తి చేశాను. నా ఎంబీబీఎస్ పూర్తయ్యాక జనరల్ ఫిజీషియన్ గా పని చేశాను. క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనిషియేటివ్ లో పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్ గా పనిచేశాను. ఆ తర్వాత నీతి ఆయోగ్ లోనూ చేశాను. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను. హార్వర్డ్ యూనివర్సిటీ అప్లికేషన్ కోసం మేం రెండు వ్యాసాలు రాయాల్సి వచ్చింది. అందులో ఒకటి పబ్లిక్ హెల్త్ కేర్ గురించి మరొకటి ముస్లిం యువతుల గురించి రాశాను. అప్పుడు నా ఫోకస్ ముస్లిం మహిళలకు పబ్లిక్ హెల్త్ కేర్ ని అందించడమే. అయితే నా మెంటర్స్ దగ్గరి నుంచి రికమండేషన్ లెటర్స్ తీసుకోవడంలో ముస్లిం మహిళల్లో సీనియర్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ మంది ఉన్నారని నేను గమనించాను. హార్వర్డ్ లో ఉండగా రెండో సంవత్సరం చదువుతుండగా సోషల్ ఎంటర్ ప్రైజ్ ఇంక్యుబేటర్ కి అప్లై చేసే అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఏప్రిల్ 2019 లో ఎంపికయ్యాను. ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసే అవసరం లేకుండా అయిపోయింది. యేల్ యూనివర్సిటీలో చదువుతూ పార్ట్ టైం వర్క్ కూడా చేశాను. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ కాన్ఫరెన్స్ కి కో ఛైర్ పర్సన్ గా వ్యవహరించాను. అంతే కాదు.. లెడ్ బై సంస్థను ప్రారంభించేందుకు ముందడుగు వేశాను. 2020 లో మా మొదటి సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రాం ప్రారంభమైంది. నాలుగు నెలల పాటు చాలా ఇంటెన్సివ్ గా జరిగిన ప్రోగ్రాం సక్సెస్ అయింది. హార్వర్డ్ లో పని చేసే వారి దగ్గరినుంచి ముస్లిం యువతులు చాలా నేర్చుకున్నారు. లెడ్ బై ద్వారా దాదాపు పది దేశాలకు చెందిన 150 కి పైగా మహిళా ఎగ్జిక్యూటివ్స్ ముస్లిం యువతులకు కోచింగ్ అందించడం, మెంటారింగ్, గైడెన్స్ అందించడం వంటివి చేస్తున్నారు. ఈ సంవత్సరం వారి కోసం ఎగ్జిక్యూటివ్ కోచింగ్ కూడా ఏర్పాటు చేయనున్నాం. లెడ్ బై మూడు విధాలుగా పనిచేస్తుంది. వర్క్ షాప్స్, 360 డిగ్రీ అడ్వైసరీ ఇందులో ఎగ్జిక్యూటివ్స్ మెంటారింగ్ చేస్తారు. లేదా మీ తోటివారి నుంచి కూడా మెంటారింగ్ సహాయం తీసుకోవచ్చు. వీటితో పాటు ఎగ్జిక్యూటివ్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ ఫౌండేషన్ ప్రారంభించేందుకు మీకు ఎవరు స్పూర్తిని అందించారు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత దీన్ని ప్రారంభించాలనుకున్నారు?

నేను హార్వర్డ్ కోసం అప్లై చేసినప్పుడు ఈ ఆలోచన ప్రారంభమైంది. మా అప్లికేషన్ లో మూడు భాగాలున్నాయి. ఒకటి GMAT స్కోర్, రెండోది మీరు తప్పనిసరిగా రాయాల్సిన వ్యాసాలు, రికమండేషన్ కోరుతూ ముగ్గురు పెద్దలు రాసే లెటర్స్. నాకు జీ మ్యాట్ లో 98 పర్సంటైల్ స్కోర్ ఉంది. వ్యాసాలు కూడా రాసి సిద్ధం చేసుకున్నాను. రికమండేషన్ లెటర్స్ మాత్రమే కావాల్సి ఉండింది. క్లినికల్ హెల్త్ నుంచి పబ్లిక్ హెల్త్, పబ్లిక్ పాలసీకి నేను మారడానికి ముఖ్యమైన మెంటార్స్ దగ్గరికి వెళ్లి లెటర్స్ తీసుకున్నాను. వారి లేఖల ద్వారా నాకు హార్వర్డ్ లో సీట్ వచ్చింది. కానీ ఆ సమయంలో నాకు అనిపించిన విషయం నా లెటర్స్ అన్నీ మగవారే రాశారు. ఒక్కటి కూడా ఆడవారితో రాయించలేకపోయాను. ఎందుకంటే ఆ స్థానాల్లో ముస్లిం మహిళలు లేరు. దాదాపు వంద మిలియన్ల ముస్లిం స్త్రీలున్న మన దేశంలో తమ కెరీర్ లో అత్యున్నత స్థానాలకు చేరిన స్త్రీలు ఎవరూ లేరా? ముస్లిం యువతులకు రోల్ మోడల్ గా నిలిచే స్త్రీలే లేరా అనిపించింది. మరో కారణం సౌదీలో మెజారిటీగా ఉన్న ముస్లిం యువతులు మన దేశంలో మైనారిటీగా ఎదుర్కొన్న పరిస్థితులు నాకు లెడ్ బైని ప్రారంభించేందుకు ప్రోత్సాహాన్ని అందించాయి. సౌదీకి వెళ్లిన నాన్ ముస్లిం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ స్వేచ్ఛగా తమ పండగలు జరుపుకోలేకపోయామని చెబుతుంటే మెజార్టీ వర్గాల్లోని చాలామందికి మైనార్టీల ఇబ్బందులు పూర్తిగా తెలియవు అనిపించింది. అందుకే ముస్లిం మైనార్టీ మహిళలు ఎదుర్కొనే చదువు, ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలని భావించాను. దీనికోసం ఇతరులతో మాట్లాడడం ఎంతో అవసరం అని నాకు అనిపించింది. లెడ్ బై సంస్థ ద్వారా కేవలం సంస్థలు మాత్రమే కాదు.. వివిధ రాష్ట్రాలు కూడా మాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. మన దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం వాటికి దూరంగా ఉన్న ముస్లిం మహిళలను సాధికారత దిశగా నడిపించాలని, దేశ ప్రగతిలో వారినీ భాగం చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం.

ఇలాంటి సంస్థ అవసరం ఉందంటారా?

మన దేశంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రగతి సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. కొన్ని కమ్యునిటీలకు చెందిన వారు వీటిని అందుకోలేకపోవడానికి కారణాలేంటో కనుక్కోవడం వల్లే ఈ అవకాశాలు అందరికీ ఎందుకు దక్కట్లేదు, ప్రతి ఒక్కరూ వీటిని పొందడంలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అన్న విషయం అర్థమవుతుంది. వారికోసం ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తూ వారు అభివృద్ధి చెందేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మన దేశంలోని ముస్లిం మహిళల జీవితాలను మార్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇది దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని నా ఫీలింగ్. అందుకే మా సంస్థలో ఉన్న నిపుణులు, మెంటార్స్, అమ్మాయిలు అందరూ దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి ఉన్నారు. దీని ద్వారా కేవలం ముస్లిం మహిళలకు మాత్రమే మెంటార్ షిప్ అవసరం అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అయితే మన దగ్గర ఒక రొట్టె ఉంటే అందులో ఎక్కువ భాగం ముస్లిం మహిళలకు ఇవ్వాలని నేను పోరాడట్లేదు. కానీ ముస్లిం మహిళల శక్తిని గుర్తించి వారు జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించేలా చేయడం నా ఉద్దేశం. దీని ద్వారా రొట్టె సైజును పెంచడం, ప్రతి ఒక్కరికీ పెద్ద పెద్ద సమానమైన భాగాలు వచ్చేలా చేయడం నా లక్ష్యం. ప్రతి ఒక్కరికీ మెంటార్ షిప్ అవసరం. కానీ నేను కేవలం ముస్లిం మహిళలకు మాత్రమే ఎందుకు అందిస్తున్నానంటే ఇప్పటివరకూ వారికి ఇలాంటివి ఎప్పుడూ లభించలేదు. వారు స్ఫూర్తి పొందేందుకు ముస్లిం మహిళా రోల్ మోడల్స్ ఎవరూ లేరు. వారు తక్కువగా చూడబడుతున్నారు. ఇప్పటివరకూ ముస్లిం మహిళల కోసం ఇలాంటి పద్ధతులు ఎవరూ ప్రారంభించలేదు. ముస్లిం మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పేందుకు చాలా డేటా అందుబాటులో ఉంది. మనం వారి అభ్యున్నతి కోసం ఇలాంటి పద్ధతులు పెట్టి వాటిని పాటించడం చేయకపోతే వారు ఎప్పటికీ వెనుకబడే ఉంటారు. వారు ముందడుగు వేసి దేశ సగటుతో సమానంగా మారేందుకు ఇలాంటివి ఎంతో అవసరం.

ఇప్పటివరకూ మీరు ఎంతమందికి సహాయం చేయగలిగారు? మీ భవిష్యత్ లక్ష్యాలేంటి?

ఫెలోషిప్ ద్వారా మేం గతేడాది 24 మంది మహిళలకు సహాయం చేయగలిగాం. ఈ సంవత్సరం 1200 అప్లికేషన్ల నుంచి 36 మందిని ఎంపిక చేయనున్నాం. ఇక మా మెంటార్ షిప్ ప్రోగ్రాంల ద్వారా మేం ఐదు వేల మందికి పైగా సహాయం అందించగలిగాం. భారత్ లోని ప్రతి కాలేజీకి వెళ్లే ముస్లిం యువతికి మేం సహాయం చేయాలనుకుంటున్నాం. వారు తమ తమ రంగాల్లో మంచి మెంటార్ షిప్ పొంది స్పాన్సర్ షిప్స్, స్కాలర్ షిప్స్ పొందేందుకు సహాయం చేయడం మా మొదటి లక్ష్యం. మా ప్లాట్ ఫాంల ద్వారా వారు కొత్త విషయాలు నేర్చుకొని ప్రొఫెషనల్ గా, వ్యక్తిగతంగా ఎదగడం మా రెండో లక్ష్యం. ముస్లిం మహిళల్లో తాము ఏదైనా సాధించగలం, సక్సెస్ ని సాధించడం కష్టమేమీ కాదన్న ఫీలింగ్ ని నింపడం మా మూడో లక్ష్యం. వారు తమ లక్ష్యాలను, తమ ఆశయాలను చేరుకోగలగడమే మేం కోరుకునేది. అంతేకాదు.. వేరే కమ్యునిటీలు కూడా లెడ్ బై సంస్థను చూసి వారి కమ్యునిటీకి చెందిన స్త్రీలు, పురుషుల కోసం ఇలాంటి ఓ సంస్థను ప్రారంభించాలని భావించడం కూడా మేం కోరుకుంటున్నాం. ఒకవేళ అలా వేరే కమ్యునిటీలు మా సహాయం కోరితే వారికోసం కూడా మాడ్యూల్స్, ప్రోగ్రాంస్ క్రియేట్ చేసి ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా అంతిమ లక్ష్యం దేశంలోని ప్రతి స్త్రీ ఆర్థిక స్వాతంత్రం పొందడం.. తద్వారా దేశం ఉన్నతిని సాధించడం. దీనికోసం నా జీవితంలోని ప్రతి రోజూ పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Muslim Minorities, Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు