Medical masks or Fabric masks: WHO లెక్క ప్రకారం ఎవరు ఎలాంటి మాస్క్ ధరించాలో తెలుసా..

ప్రతీకాత్మకచిత్రం

కరోనా కట్టడికి మనం వాడుతున్న మాస్క్​ల విషయంలో చాలా గందరగోళం నెలకొంది. మార్కెట్​లో అనేక రకాల మాస్క్​లు అందుబాటులో ఉండటంతో.. వాటిలో ఏ రకమైన మాస్క్​లు కరోనా కట్టడికి బాగా పనిచేస్తాయనే విషయంపై స్పష్టత కొరవడింది.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తోంది. ఎన్నడూ లేనంతగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. దీంతో, అనేక రాష్ట్రాలు లాక్​డౌన్లు, నైట్​ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. అయితే, ప్రజలు వ్యక్తిగతంగా కరోనా నియమ నిబంధలను పాటించినప్పుడే ఉపయోగం ఉంటుందని లేదంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించడం, సోషల్​ డిస్టన్స్ పాటించడం, శానిటైజర్​తో చేతులను శుభ్రం చేసుకోవడం పాటించాలని చెబతున్నారు. అయితే, కరోనా కట్టడికి మనం వాడుతున్న మాస్క్​ల విషయంలో చాలా గందరగోళం నెలకొంది. మార్కెట్​లో అనేక రకాల మాస్క్​లు అందుబాటులో ఉండటంతో.. వాటిలో ఏ రకమైన మాస్క్​లు కరోనా కట్టడికి బాగా పనిచేస్తాయనే విషయంపై స్పష్టత కొరవడింది. దీంతో,​ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా ట్విట్టర్​ వేదికగా కొన్ని మార్గదర్శకాలను నెటిజన్లతో పంచుకుంది. సర్జికల్​ లేదా ఫాబ్రిక్ మాస్క్‌ల విషయంలో ఎవరు ఏ మాస్క్​ను ధరించాలనే విషయంపై స్పష్టతనిచ్చింది.

మెడికల్​ లేదా సర్జికల్​ మాస్కులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా విడుదల చేసిన వీడియోలో ఎవరు ఏ రకమైన మాస్క్​ వాడాలో వివరించింది. మెడికల్​ లేదా సర్జికల్​ మాస్కలను ఆరోగ్య కార్యకర్తలు, కరోనా లక్షణాలున్న వ్యక్తులు, కరోనా పాజిటివ్​ వ్యక్తులను కలిసిన వారు ధరించాలని కోరింది. అదేవిధంగా, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కనీసం మీటర్​ సోషల్​ డిస్టన్స్​ కూడా పాటించలేని పరిస్థితిలో ఉన్న 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మెడికల్​ మాస్క్​ను ధరించాలని కోరింది. ఇక వీరితో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం మెడికల్​ లేదా సర్జికల్​ మాస్క్​లను వాడాలని సూచించింది.

ఫాబ్రిక్ మాస్క్‌లు
ప్రపంచ వ్యాప్తంగా మెడికల్​ మాస్కుల కొరత ఏర్పడటంతో ప్రజలు ఫ్యాబ్రిక్​, కాటన్​ క్లాత్​లతో మస్క్​లను తయారు చేసుకుంటున్నారు. ఇవి మార్కెట్​లో విస్తృతంగా లభిస్తున్నాయి. కరోనా లక్షణాలు లేనప్పటికీ సోషల్​ వర్కర్స్​, క్యాషియర్స్, సర్వర్స్​తో దగ్గర కాంటాక్ట్​ ఉన్న వారు ఈ మస్క్​లను తప్పకుండా ధరించాలని డబ్ల్యూహెచ్‌ఓ కోరింది. అంతేకాక, ఈ కాటన్​ క్లాత్​ మాస్క్​లను పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్, పని ప్రదేశాలు, కిరాణ దుకాణాలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న రద్దీ ప్రదేశాల్లో కూడా వాడాలని సూచించింది. కాగా, దేశంలో నిన్న అర్ధరాత్రి (ఏప్రిల్ 19) వరకు మొత్తం 1,50,61,919 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో, ప్రస్తుతం 19,29,329 కేసులు యాక్టివ్​లో ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published: