Face Masks: బయట ఎక్సర్​సైజ్ చేస్తున్నప్పుడు ఫే​స్ మాస్క్ ధరించవచ్చా..? తాజా పరిశోధన ఏం చెప్పిందంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

వేడి వాతావరణంలో వ్యాయామం చేసే సమయంలో ఫే​స్ మాస్కులు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగదని ఈ అధ్యయనం తేల్చింది. దీనివల్ల హార్ట్​బీట్​ కూడా అసాధరణంగా మారదని స్పష్టం చేసింది. కనెస్కట్స్ కోరీ స్ట్రింగర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ సేఫ్టీ డైరెక్టర్ అయామీ యోషిహరా తమ అధ్యయన ఫలితాలను వెల్లడించారు.

  • Share this:
కరోనా వైరస్​ వల్ల అందరూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో నుంచి బయటికి వస్తే.. ఎవరైనా మాస్క్ తప్పకుండా ధరించాలని కోవిడ్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే ఇదే తరుణంలో మాస్కులపై ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా బయటి ప్రదేశాల్లో ఎక్సర్​సైజ్ (వ్యాయామం) చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవచ్చా అన్న డౌట్ చాలా రోజుల నుంచి ప్రజలను వేధిస్తోంది. ఎక్సర్​సైజ్ చేసే సమయంలో ముఖానికి మాస్కు ధరిస్తే శరీరం ఉష్ణోగ్రత పెరిగిపోతుందనే వాదనలు వినిపించాయి. అయితే ఇలాంటి వాదనలన్నీ నిజం కావని తేల్చింది ఓ అధ్యయనం.

వేడి వాతావరణంలో వ్యాయామం చేసే సమయంలో ఫే​స్ మాస్కులు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగదని ఈ అధ్యయనం తేల్చింది. దీనివల్ల హార్ట్​బీట్​ కూడా అసాధరణంగా మారదని స్పష్టం చేసింది. కనెస్కట్స్ కోరీ స్ట్రింగర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ సేఫ్టీ డైరెక్టర్ అయామీ యోషిహరా తమ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. నాలుగు రకాల మాస్కులతో పరిశోధన చేసినట్టు తెలిపారు. సర్జికల్ మాస్కు, ఎన్​ 95 మాస్క్, గైటర్, స్పోర్ట్​ మాస్కులతో టెస్టులు చేసినట్టు చెప్పారు. ఈ నాలుగింట్లో ఏ మాస్కు ధరించి ఎక్సర్​సైజ్ చేసినా శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగినట్టు తేలలేదని వెల్లడించారు.

90 డిగ్రీల ఫారిన్​ హీట్​ (32 డిగ్రీల సెల్సియస్​) ఉష్ణోగ్రత వద్ద మొత్తం 60 మంది పార్టిసిపెంట్లు వాకింగ్​, జాగింగ్ చేసి అధ్యయనంలో పాల్గొన్నారు. అలాగే తక్కువ నుంచి ఎక్కువ స్థాయి ఎక్సర్​సైజ్​లు చేశారు. ఆ సమయంలో ఫేస్ మాస్కు లోపల, బయట ఉష్ణోగ్రతను, హ్యుమిడిటీని యోషిహరా బృందం చెక్ చేసింది. అలాగే పార్టిసిపెంట్ల మాస్కు లోపల, బయట సెన్సార్లను ఏర్పాటు చేశారు. స్పోర్ట్స్​ మాస్కు, గైటర్​ ఎక్కువ హ్యుమిడిటీ కి కారణమయ్యాయని వారు గుర్తించారు. వాటిని ధరించి ఎక్సర్​సైజ్ చేయడం వల్ల ఎక్కువ చెమట వస్తుందని గమనించారు.

ఎక్సర్​సైజ్ చేసే సమయంలో ఫేస్ మాస్కు లోపల ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ పెరుగుతున్న కారణంగా శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది కలిగినట్టు గుర్తించారు. అయితే వ్యాయామం చేస్తున్న సమయంలో ఫేస్ మాస్కు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత, హార్ట్​రేట్​పై ప్రభావం ఉండదని తేల్చారు.

ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా అథ్లెట్లు బయటి ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు మార్గదర్శకాల రూపకల్పన కోసం తమ పరిశోధన ఉపయోగపడుతుందని యోషిహరా పేర్కొన్నారు. ఎక్సర్​సైజ్ చేసే సమయంలో మాస్కు ధరించడం పూర్తి సురక్షితమని, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా మాస్కుల వల్ల శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం ఉండదని తెలిపారు.
Published by:Krishna Adithya
First published: