హోమ్ /వార్తలు /Explained /

Explained: కుదుపులకు లోనైన మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం.. కారణం ఏంటి.. ఆ రోజు ఏం జరిగింది..?

Explained: కుదుపులకు లోనైన మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం.. కారణం ఏంటి.. ఆ రోజు ఏం జరిగింది..?

పశ్చిమ బెంగాల్ సీఎం

పశ్చిమ బెంగాల్ సీఎం

పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు గురవడంతో గతవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై విచారణకు ఆదేశించింది.

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి(Chief Minister) మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు గురవడంతో గతవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై విచారణకు ఆదేశించింది. మమత ప్రయాణిస్తున్న విమానం డీప్‌ ఎయిర్‌ ప్యాకెట్‌(Deep Air-Pocket)ను ఢీకొట్టడంతో విమానం కుదుపులకు(Turbulence) లోనైందని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) ఓ నివేదికలో తెలిపింది. అయితే డీజీసీఏ నివేదికను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్పుబట్టాయి. పైలట్‌(Pilot) చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని సురక్షితంగా బయటపడినట్లు పేర్కొన్నాయి. మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానాలు తరచూ ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Application Invited: వాళ్లు ఏడాదికి రూ.60 వేలు పొందే అవకాశం.. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15.. వివరాలివే..


మార్చి 4న ఏం జరిగింది?

లఖ్‌నవూలో ఎన్నికల ప్రచారం తర్వాత మార్చి 4వ తేదీన మమతా బెనర్జీ తిరిగి కోల్‌కతాకు బయలుదేరారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్ది సేపట్లో ఆమె ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం ల్యాండ్‌ అవుతుందనగా విమానం భారీ కుదుపులకు లోనైంది. దీంతో మమతా బెనర్జీకి వెన్నునొప్పి తలెత్తింది. వైద్యులు ఆమెను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎవరూ ఘటనలో గాయపడలేదని, పైలట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్‌ చేశారని కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. శనివారం రోజు విమానం కుదుపులకు లోనవడంపై DGCA నుంచి పశ్చిమబెంగాల్‌ హోం సెక్రటరీ బీజీ గోపలిక వివరణ కోరారు. విమానయానంపై పశ్చిమబెంగాల్‌కు సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్‌ నేతృత్వంలో పపలువురు విమానయాన నిపుణులతో ఘటనపై దర్యాప్తును పశ్చిమబెంగాల్‌ ఆదేశించిందని సమాచారం.

ఇదే సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్ధతిచ్చే జాగో బంగ్లా పత్రికలో విమానం కుదుపులకు లోనైన ఘటనపై ఎడిటోరియల్‌ ప్రచురించింది. తరచూ విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు ఇలాంటి ప్రమాదాలకు గురువుతోందని ప్రశ్నించింది. ఘటనకు సంబంధించి మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ..‘పైలట్‌ నైపుణ్యంతోనే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డాం. ల్యాండింగ్‌కు ముందు 8000 అడుగుల కింద మా విమానం ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా మరో విమానం ఎదురైంది. దీనికి సంబంధించిన ఎలాంటి నివేదిక కూడా ATC, DGCA నుంచి అందలేదు’ అని వివరించారు.

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్​లో వాటికి దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే ప్రతినెలా రూ. 60 వేల స్టైఫండ్


గతంలో జరిగిన ఘటనలు..

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కుదుపులకు లోనవడం ఇది మొదటిసారి కాదు. 2016 నవంబరులో పాట్నా నుంచి తిరిగి వస్తుండగా విమానంలో ఇంధనం తక్కువగా ఉన్నట్లు నివేదించినప్పటికీ.. మమత బెనర్జీ విమానం ల్యాండింగ్‌కు ముందు అరగంటకు పైగా కోల్‌కతా విమానాశ్రయంపై ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం మమతా బెనర్జీ కోల్‌కతా నుంచి దిల్లీకి ప్రయాణించాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం దాదాపు నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరింది. 2018 ఫిబ్రవరిలో బాగ్‌దొగ్రా నుంచి కోల్‌కతాకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిరిగి వస్తుండగా రన్‌వే ఖాళీగా ఉన్నా సరే ఆమె విమానం 30 నిమిషాల్లో గాల్లోనే ఎగరాల్సి వచ్చింది.

Published by:Veera Babu
First published:

Tags: West Bengal

ఉత్తమ కథలు