HOME »NEWS » »life style people who wear glasses are less likely to get to covid19 sk gh

Health: మీకు కళ్లద్దాలున్నాయా? ఐతే మీకో శుభవార్త.. ఆ ముప్పు లేనట్లే..

Health: మీకు కళ్లద్దాలున్నాయా? ఐతే మీకో శుభవార్త.. ఆ ముప్పు లేనట్లే..
ప్రతీకాత్మక చిత్రం

డైలీ మెయిల్ కథనం ప్రకారం చైనాకి చెందిన రీసర్చర్లు కూడా ఈ తరహా అధ్యయనాన్ని నిర్వహించారట. వీరు కూడా కరోనా బారిన పడిన వారిలో చాలామందికి కళ్లద్దాలు లేవని.. కళ్లద్దాలు ఉన్నవారికి కరోనా వచ్చే అవకాశాలు ఐదు రెట్లు తక్కువగా ఉంటాయని నిర్ధారించారట.

  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం ప్రారంభించి దాదాపు సంవత్సరం అయింది. ఇప్పటికీ ఈ వైరస్ ని తట్టుకోవడానికి మాస్క్ లు పెట్టుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ ఉండాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే అన్ని దేశాల్లో కొవిడ్ 19 టీకాలు ప్రారంభించినా అవి అందరికీ అంది కరోనా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి కొన్ని సంవత్సరాలైనా పడుతుందట. అయితే తాజాగా నిపుణులు ఓ కొత్త విషయాన్ని కనుక్కున్నారు. అదేంటనుకుంటున్నారా? కళ్లద్దాలు పెట్టుకునే వారికి కరోనా వచ్చే అవకాశం తక్కువట. దీనికి ముఖ్య కారణం వారు తరచూ కళ్లను నలుపుకోకుండా ఉండడమే అంటున్నారు నిపుణులు.

medRxiv వెబ్ సైట్లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని 304 మంది పై నిర్వహించారు. వీరిలో 223 మంది పురుషులు కాగా.. 81 మంది స్త్రీలు. వీరు పది నుంచి ఎనభై సంవత్సరాల వయసుకు చెందినవారు. ఉత్తరాదికి చెందిన ఓ హాస్పిటల్ లో కొవిడ్ లక్షణాలతో వచ్చిన వారందరిపై ఈ అధ్యయనం నిర్వహించి ఫలితాలను తేల్చారు.



ఈ అధ్యయనంలో భాగంగా కేవలం 19 శాతం మంది మాత్రమే తాము ఎల్లప్పుడూ కళ్లద్దాలు ధరించి ఉంటామని వెల్లడించారు. అధ్యయనంలో పాల్గొన్న అందరినీ గమనించగా గంటలో కనీసం 23 సార్లు వారు తమ ముఖాన్ని ముట్టుకోవడం చేశారట. కనీసం గంటకు మూడు సార్లైనా కళ్లను ముట్టుకున్నారట. ఇండిపెండెంట్ సంస్థ కథనం ప్రకారం కళ్లద్దాలు ఉన్నవారికి కరోనా వచ్చే అవకాశాలు మిగిలిన వారితో పోల్చితే మూడు రెట్లు తక్కువగా ఉంటుందట.

దీనికి గల కారణాలను కూడా వెల్లడించారు ఈ అధ్యయనం నిర్వహించిన వైద్యులు. వివిధ ప్రదేశాలను తాకినప్పుడు వైరస్ మన చేతులకు అంటుకునే అవకాశాలుంటాయి. అవే చేతులతో కళ్లు నలుపుకోవడం, ముక్కు, నోరు ముట్టుకోవడం వంటివి చేయడం వల్ల వైరస్ శరీరం లోపలికి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అదే కళ్లద్దాలు పెట్టుకునే వారు కళ్లను ముక్కును చాలా తక్కువగా ముట్టుకుంటారట. అందుకే వీటి ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు కూడా తక్కువని వారు చెబుతున్నారు. అయితే దీనికోసం ఎప్పుడో ఒకసారి కళ్లద్దాలు పెట్టుకోవడం కాదు.. రోజుకి కనీసం ఎనిమిది గంటల పాటు కళ్లద్దాలు పెట్టుకునే వారిలోనే ఇది గమనించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలోనూ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకునే వారు కొన్ని నెలల పాటు వాటికి దూరంగా ఉండి కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల కొవిడ్ ముప్పును తప్పించుకోవచ్చని వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

డైలీ మెయిల్ కథనం ప్రకారం చైనాకి చెందిన రీసర్చర్లు కూడా ఈ తరహా అధ్యయనాన్ని నిర్వహించారట. వీరు కూడా కరోనా బారిన పడిన వారిలో చాలామందికి కళ్లద్దాలు లేవని.. కళ్లద్దాలు ఉన్నవారికి కరోనా వచ్చే అవకాశాలు ఐదు రెట్లు తక్కువగా ఉంటాయని నిర్ధారించారట. నాంచాంగ్ యూనివర్సిటీ సెకండ్ అఫ్లియేటెడ్ హాస్పిటల్ కి చెందిన ఈ రీసర్చర్లు మనుషుల కళ్లలో ఉండే రిసెప్టర్ల ద్వారా కరోనా వైరస్ తొందరగా శరీరంలోకి అడుగుపెడుతుందని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా మాస్క్, గ్లవ్స్ వంటివి ఉపయోగించినట్లే కళ్లద్దాలు కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్‌గా కళ్లద్దాలు పని చేస్తాయని ఈ రెండు పరిశోధనల్లోనూ తేలింది.
Published by:Shiva Kumar Addula
First published:February 23, 2021, 16:12 IST