Explained: ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద కంటెయినర్ల కొరత.. సమస్య పరిష్కారానికి భారత్ చర్యలు

ప్రతీకాత్మక చిత్రం

రవాణాకు సంబంధించిన అంతరాయాలు సైతం ధరల పెరుగుదలకు కారణమవుతాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా కంటెయినర్ల కొరత ఏర్పడింది.

  • Share this:
నిత్యావసరాలు, ఇతర వస్తుసేవల ధరల పెరుగుదలకు సరకు రవాణా ఛార్జీలతో సంబంధం ఉంటుంది. రవాణాకు సంబంధించిన అంతరాయాలు సైతం ధరల పెరుగుదలకు కారణమవుతాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా కంటెయినర్ల కొరత ఏర్పడింది. దీంతో కొన్ని కీలక షిప్పింగ్ మార్గాల్లో రవాణా రేట్లు 300 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఈ కంటెయినర్ల కొరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎగుమతిదారులతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అసలు పెద్ద కంటెయినర్ల కొరత ఎందుకు ఏర్పడింది, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి.. వంటి వివరాలు తెలుసుకుందాం.

* అంతర్జాతీయంగా కంటెయినర్ల కొరత ఎందుకు ఏర్పడింది?
కోవిడ్-19 కారణంగా గతంలో పనిచేసిన షిప్పింగ్ నౌకల (operating shipping vessels) సంఖ్య తగ్గింది. దీంతో తక్కువ సంఖ్యలో కంటెయినర్లు బయటకు తీస్తున్నారు. దీనికి తోడు కరోనా వల్ల చాలా కంటెయినర్లు పోర్ట్‌లలో ఎక్కువ కాలం నిలిచిపోయాయి. రద్దీ కారణంగా యూఎస్‌లోని కీలక పోర్టులలో కంటెయినర్లు వేచి ఉండే సమయం పెరిగింది. దీంతో ఖాళీ కంటెయినర్లు తిరిగి రావడానికి సమయం పడుతోంది.

కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణ కొనసాగుతోంది. దీంతో వాణిజ్యం క్రమంగా పెరిగింది. కానీ కంటెయినర్ల కొరత, అంతర్జాతీయ వాణిజ్యం ఊహించిన దాని కంటే వేగంగా కోలుకోవడం వల్ల గత ఏడాదిలో సరకు రవాణా రేట్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే.. కొన్ని కీలక అంతర్జాతీయ మార్గాల్లో సరకు రవాణా రేట్లు 500 శాతానికి పైగా పెరగడం గమనార్హం.

* కంటెయినర్ల కొరత భారత ఎగుమతిదారులను ఎలా ప్రభావితం చేస్తుంది?
ఈ సమస్య వల్ల భారత ఎగుమతిదారులు, తాము ఎగుమతి చేసిన వస్తువుల పేమెంట్లను పొందడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఇది వారి షిప్‌మెంట్, లిక్విడిటీని ప్రభావితం చేస్తోంది. గతంలో ఎగుమతుల షిప్‌మెంట్‌ కోసం 45 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఇందుకు 75-90 రోజులు పడుతోంది. దీనివల్ల వారికి రావాల్సిన పేమెంట్స్ 2-3 నెలల పాటు ఆలస్యమవుతోంది. ముఖ్యంగా కంటెయినర్ల కొరత కారణంగా చిన్న ఎగుమతిదారులు లిక్విడిటీ కొరత ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి తోడు భారత నౌకలు తిరిగి వచ్చే టర్న్ అరౌండ్ సమయం పెరుగుతోంది. ఇది మొత్తం ఎగుమతుల వ్యవస్థను దెబ్బతీస్తోంది.

* ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది?
ఈ సమస్యను పరిష్కరించడానికి ఖాళీ కంటెయినర్ల ఎగుమతిని నియంత్రించాలని షిప్‌మెంట్ ఎక్స్‌పోర్టర్లు (ఎగుమతిదారులు) ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఖాళీ కంటెయినర్ల కోసం కొన్ని దేశాలు ఎక్కువ ధరలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది కంటెయినర్ల కొరతను మరింత పెంచుతోందని నిపుణులు గుర్తించారు. అందువల్ల ప్రతి పోర్టులో ఖాళీ కంటెయినర్ల ఎగుమతులను ప్రభుత్వం పరిమితం చేయాలని కోరుతున్నారు. మూడు నెలల వ్యవధిలో ఒక నౌక ద్వారా ఎగుమతి చేయగలిగే ఖాళీ కంటెయినర్ల సంఖ్యను 100కి పరిమితం చేయాలని నివేదిస్తున్నారు. ప్రభుత్వం గతంలో పక్కన పెట్టిన లేదా అదుపులోకి తీసుకున్న 20,000 కంటైనర్లను విడుదల చేసి, సప్లై పెంచాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

EPF-Aadhar link: ఈపీఎఫ్‌-ఆధార్ లింక్ గ‌డువు పొడ‌గింపు.. డిసెంబ‌ర్ వ‌ర‌కు అవ‌కాశం

Money Transfer to Wrong Account: పొరపాటుగా వేరే అకౌంట్‌కు వెళ్లిన డబ్బును తిరిగి పొందవచ్చా ?.. అందుకు ఏం చేయాలి ?

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ సైతం దీనిపై దృష్టి సారించింది. సరకు రవాణా ధరలు సాధారణ స్థాయికి చేరుకునే వరకు ఎగుమతులకు మద్దతు ఇచ్చే పథకాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రాధాన్యత ప్రకారం బుకింగ్‌లను అనుమతించే ప్రస్తుత విధానాన్ని మార్చి, ముందు వచ్చిన వారికే బుకింగ్స్ ఇవ్వాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. భారతదేశంలో కంటెయినర్ల తయారీని పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: