Home /News /explained /

Recurring Deposits: రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలేంటీ?

Recurring Deposits: రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలేంటీ?

Recurring Deposits: రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలేంటీ?
(ప్రతీకాత్మక చిత్రం)

Recurring Deposits: రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలేంటీ? (ప్రతీకాత్మక చిత్రం)

Recurring Deposits | రికరింగ్ డిపాజిట్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు (Monthly Savings) చేసుకుంటూ పోతే దీర్ఘకాలంలో సంపద కూడబెట్టుకోవచ్చు. అసలుతో పాటు వడ్డీ కూడా వస్తుంది. రికరింగ్ డిపాజిట్‌తో లాభాలేంటో తెలుసుకోండి.

    సాధారణ డిపాజిట్లతో ఎక్కువ రాబడిని పొందగలిగే లో-రిస్క్ పెట్టుబడి ఆప్షన్ కోసం చూస్తున్న వారికి రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit) మంచి ఎంపిక. పెట్టుబడులపై ఆసక్తి ఉండి పెద్ద మొత్తంలో డబ్బు లేని వారు RDలను ఎంచుకోవచ్చు. అందరు భారత నివాసితులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFలు) బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లను తెరవడానికి అర్హులు. కొన్ని బ్యాంకులు మైనర్లకు సైతం రికరింగ్ డిపాజిట్లను అనుమతిస్తున్నాయి. తద్వారా వారికి చిన్నతనం నుంచి పొదుపు అలవాటు అలవడుతుంది. అయితే మైనర్ల ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడానికి సంరక్షకులు ఉండాలి. చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు 100 గుణకాలలో సమానమైన అమౌంట్‌తో రికరింగ్ డిపాజిట్ తీసుకోవాలని అడుగుతాయి.

    సాధారణంగా బ్యాంకులు, NBFCలు లేదా పోస్టాఫీసు వంటి ఆర్థిక సంస్థలు రికరింగ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. అవసరాలు, లక్ష్యాలు, వడ్డీ రేట్ల ఆధారంగా ఖాతాదారులు RDలను ఎంచుకోవచ్చు. అయితే పెట్టుబడి కనీస మొత్తం అనేది వివిధ సంస్థల్లో భిన్నంగా ఉండవచ్చు. చాలా తక్కువ మొత్తంతో రికరింగ్ డిపాజిట్ ప్రారంభించవచ్చు. మీ సామర్థ్యాన్ని బట్టి సరైన RDలో తగిన పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు స్వల్ప లేదా దీర్ఘకాలిక నిధుల ప్రణాళికలకు సరిపోయే మెచూరిటీ ఆప్షన్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఆర్డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక సంస్థను ఎంచుకున్నప్పుడే.. ఆ పథకాలు అందించే భిన్న రకాల సౌలభ్యాలను కస్టమర్లు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు వివిధ రకాల అంశాలు ఆర్డీ పథకాల వడ్డీ రేట్లను ప్రభావితం చేస్తాయి. వీటిపై కూడా కస్టమర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలు ఇవే.

    Money Transfer: యూపీఐ పనిచేయట్లేదా? వెంటనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

    fixed deposit vs recurring deposit, post office recurring deposit, recurring deposit account, recurring deposit calculator, recurring deposit in sbi bank, recurring deposit in telugu, recurring deposit interest calculation, పర్సనల్ ఫైనాన్స్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటీ, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్ స్కీమ్
    ప్రతీకాత్మక చిత్రం

    ఖాతా రకం


    ఖాతాదారులు ఎంచుకున్న రికరింగ్ అకౌంట్ రకాన్ని బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. అంటే అన్ని RD డిపాజిట్లకు ఒకే రకమైన వడ్డీ రేటు వర్తించకపోవచ్చు. సాధారణంగా రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా NRE/NRO ఖాతాల కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు. కొన్ని బ్యాంకులు ఇలాంటి రెండు రకాల అకౌంట్లకు ఒకే వడ్డీ రేట్లను అందించవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే RD అకౌంట్ల రకాన్ని బట్టి వాటిపై అందే వడ్డీ రేటు మారుతూ ఉంటుంది.

    మెచూరిటీ పీరియడ్ లేదా డిపాజిట్ కాల వ్యవధి


    RD వడ్డీ రేటును నిర్ణయించడంలో డిపాజిట్ మెచూరిటీ గడువు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్డీలను ప్రభావితం చేసే ముఖ్యమైన కారకాల్లో మెచూరిటీ ఒకటి. మీడియం టర్మ్ డిపాజిట్లు సాధారణంగా ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. కొన్ని బ్యాంకులు 10 సంవత్సరాల దీర్ఘకాలిక డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తాయి. కానీ కొన్ని బ్యాంకులు ఒక సంవత్సరం డిపాజిట్, 10 సంవత్సరాల డిపాజిట్పై కూడా అదే వడ్డీ రేటును అందిస్తాయి.

    SBI ATM: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

    fixed deposit vs recurring deposit, post office recurring deposit, recurring deposit account, recurring deposit calculator, recurring deposit in sbi bank, recurring deposit in telugu, recurring deposit interest calculation, పర్సనల్ ఫైనాన్స్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటీ, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్ స్కీమ్
    ప్రతీకాత్మక చిత్రం

    వయసు


    దాదాపు అన్ని బ్యాంకులు RDలపై సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. సాధారణంగా ఈ రేటు మామూలు వడ్డీ రేట్ల కంటే సంవత్సరానికి 0.5 శాతం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంస్థలు అందించే జూనియర్ RD అకౌంట్లు కూడా అధిక వడ్డీ రేటును అందించగలవు. ఇది మైనర్ అకౌంట్లపై సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అందించే ఆఫర్పై ఆధారపడి ఉంటుంది.

    బ్యాంకు ఎంపిక


    వివిధ బ్యాంకులు రికరింగ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. వడ్డీ రేట్లపై పూర్తి అధికారం సంబంధిత సంస్థలకే ఉంటుంది. ఫలితంగా వివిధ బ్యాంకుల ఆర్డీ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అగ్రశ్రేణి బ్యాంకులు రికరింగ్ డిపాజిట్లను ఏడాదికి 7 శాతం వడ్డీతో అందిస్తున్నాయి. జాతీయ బ్యాంకులు సంవత్సరానికి 8 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తాయి.

    UPI App: గుడ్ న్యూస్... ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు

    fixed deposit vs recurring deposit, post office recurring deposit, recurring deposit account, recurring deposit calculator, recurring deposit in sbi bank, recurring deposit in telugu, recurring deposit interest calculation, పర్సనల్ ఫైనాన్స్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటీ, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్ స్కీమ్
    ప్రతీకాత్మక చిత్రం

    పథకాలపై ఆఫర్లు


    బ్యాంకులు వివిధ రికరింగ్ డిపాజిట్ పథకాలను అమలు చేస్తున్నాయి. కార్పొరేషన్ బ్యాంక్ ఆఫర్లో భాగంగా ఒక మిలియనీర్ స్కీమ్ను (Millionaire Scheme) అందిస్తోంది. ఇందులో భాగంగా పథకం ముగింపు నాటికి ఖాతాదారులు రూ.1 మిలియన్ అంటే రూ.10 లక్షలు అందుకుంటారు. ఈ డిపాజిట్ సంవత్సరానికి 9.25 శాతం అధిక వడ్డీ రేటును కలిగి ఉంటుంది. కాబట్టి మీ డిపాజిట్ స్కీమ్ ఎంపిక కూడా వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. RD పథకం అందించే ప్రయోజనాల ఆధారంగా కూడా వడ్డీ రేటు మారవచ్చు.

    ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు


    మారుతున్న ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రికరింగ్ డిపాజిట్లను అందించే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను అప్డేట్ చేస్తూనే ఉంటాయి. దీనికి ఆర్బీఐ రెపో రేటులో మార్పు, ద్రవ్యోల్బణం మొదలైన అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి RD రేట్లను నిర్ధారించడంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తాయి.

    బ్యాంకులు, ఆర్థిక సంస్థలు


    డిపాజిటర్లు పొందే మెచూరిటీ మొత్తాన్ని ప్రభావితం చేసే కారకాల్లో ఇది ఒకటి. సాధారణంగా RDలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తాయి. బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్. అయితే కస్టమర్లు వివిధ కంపెనీలు అందించే రికరింగ్ డిపాజిట్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ వారు కంపెనీ రికరింగ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడానికి ముందు.. సంస్థ అందిస్తున్న డిపాజిట్లపై క్రెడిట్ రేటింగ్ను తనిఖీ చేయాలి. FAAA, FAA వంటి అధిక/మెరుగైన క్రెడిట్ రేటింగ్ ఉన్న రికరింగ్ డిపాజిట్లను ఇతర కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే సురక్షితమైనవిగా పరిగణిస్తారు.

    రికరింగ్ డిపాజిట్లను ఎంచుకోవాలనుకునే ఖాతాదారులు ముందుగానే ఈ అంశాల గురించి తెలుసుకోవాలి. వివిధ సంస్థల డిపాజిట్లలో మెరుగైన రాబడిని అందించే RDల గురించి ఆరా తీయాలి. దీంతో పాటు డిపాజిట్లపై ఏవైనా ఆఫర్లు ఉన్నాయేమో చూడాలి. అన్ని కారకాలను పరిశీలించి లక్ష్యాలకు తగ్గట్లు అత్యత్తమ రాబడిని అందించే డిపాజిట్లను ఎంచుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Investment Plans, Personal Finance, Recurring Deposits, Save Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు