Home /News /explained /

RD Interest Rates: రికరింగ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే

RD Interest Rates: రికరింగ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే

RD Interest Rates: రికరింగ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

RD Interest Rates: రికరింగ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Recurring Deposit Interest Rates | మీరు రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో (RD Scheme) డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నారా? పోస్ట్ ఆఫీస్‌తో పాటు బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల (Interest Rates) వివరాలు తెలుసుకోండి.

    భారతదేశంలోని వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రికరింగ్ డిపాజిట్లను (Recurring Deposits) అందిస్తున్నాయి. అయితే ఈ వడ్డీ రేట్లు (Interest Rates) బ్యాంకులను బట్టి మారుతాయి. ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు గడువుతో అందుబాటులో ఉన్న ఆర్‌డీ స్కీమ్స్‌పై (RD Schemes) వివిధ రకాల వడ్డీ రేట్లు వర్తిస్తున్నాయి. కొన్ని చిన్న బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తుండగా, మరికొన్ని పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం తక్కువ వడ్డీతోనే ఈ డిపాజిట్లను అందుబాటులో ఉంచాయి. నిర్ణీత కాల వ్యవధికి వివిధ బ్యాంకులు అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పరిశీలిద్దాం.

    ఆంధ్రా బ్యాంక్


    ఒక ఏడాది గడువుతో చేసే RDలపై ఆంధ్రా బ్యాంక్ 5 శాతం వడ్డీ అందిస్తోంది. రెండేళ్లకు 5.4 శాతం.. మూడు, నాలుగేళ్ల RDపై 5.5 శాతం, ఐదేళ్లు, అంతకు మించిన RDలపై 5.6 శాతం వడ్డీని అందిస్తోంది.

    అలహాబాద్ బ్యాంక్


    ఈ బ్యాంకు ఏడాది గడువుతో చేసే RDపై 5 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్లకు 5.10 శాతం, మూడు నుంచి పదేళ్ల గడువుతో చేసే ఆర్డీలపై 5.15 శాతం వడ్డీని అందిస్తోంది.

    Post Office Franchise: పోస్ట్ ఆఫీస్ ఫ్లాంఛైజ్ తీసుకోవాలా? కేవలం రూ.5,000 చాలు

    recurring deposit interest rates, recurring deposit meaning in telugu, recurring deposit post office, recurring deposit rates, recurring deposit sbi, recurring deposit sbi interest rate, sbi recurring deposit calculator, what is recurring deposit in hdfc, ఆర్‌డీ స్కీమ్ వడ్డీ రేట్లు, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వివరాలు
    ప్రతీకాత్మక చిత్రం

    యాక్సిస్ బ్యాంక్


    ఒక ఏడాది గడువుతో చేసే RDపై యాక్సిస్ బ్యాంక్ 4.4 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్లకు 5.25 శాతం, మూడు నుంచి నాలుగేళ్లకు 5.5 శాతం.. ఐదేళ్లు, అంతకు మించిన డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని అందిస్తోంది.

    బంధన్ బ్యాంక్


    ఏడాది నుంచి రెండేళ్ల గడువుతో చేసే RDలపై బంధన్ బ్యాంక్ 5.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మూడు నుంచి నాలుగేళ్లకు 5.25 శాతం.. ఐదేళ్లు, అంతకు మించిన గడువుతో చేసే డిపాజిట్లకు 5 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది.

    బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర


    ఏడాది నుంచి ఐదేళ్లకు పైబడిన గడువుతో చేసే రికరింగ్ డిపాజిట్పై ఈ బ్యాంకు 4.9 శాతం వడ్డీ రేటును మాత్రమే అందిస్తోంది.

    బ్యాంక్ ఆఫ్ బరోడా


    ఏడాది గడువుతో చేసే RDపై బ్యాంక్ ఆఫ్ బరోడా 4.9 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్లకు 5.10 శాతం, మూడు నుంచి ఐదేళ్లకు పైబడిన RDపై 5.25 శాతం వడ్డీ అందిస్తోంది.

    IPO Profits: ఐపీఓ ద్వారా లాభాలు వచ్చాయా? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసుకోండి

    recurring deposit interest rates, recurring deposit meaning in telugu, recurring deposit post office, recurring deposit rates, recurring deposit sbi, recurring deposit sbi interest rate, sbi recurring deposit calculator, what is recurring deposit in hdfc, ఆర్‌డీ స్కీమ్ వడ్డీ రేట్లు, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వివరాలు
    ప్రతీకాత్మక చిత్రం

    బ్యాంక్ ఆఫ్ ఇండియా


    ఏడాది గడువుతో చేసే RDపై ఈ బ్యాంకు 5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రెండేళ్ల నుంచి ఐదేళ్లకు పైబడిన గడువు ఉండే RDలకు 5.05 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది.

    కెనరా బ్యాంక్


    ఏడాది గడువుతో చేసే రికరింగ్ డాపాజిట్కు కెనరా బ్యాంక్ 5.10 శాతం వడ్డీ అందిస్తోంది. రెండేళ్ల నుంచి ఐదేళ్లకు మించిన గడువుతో చేసే RDలపై 5.25 శాతం వడ్డీరేటు అమల్లో ఉంది.

    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


    ఈ బ్యాంకు ఏడాది గడువు ఉండే RDపై 4.9శాతం వడ్డీ అందిస్తోంది. రెండేళ్ల నుంచి ఐదేళ్లు పైబడిన డిపాజిట్లపై 5 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

    కార్పొరేషన్ బ్యాంక్


    ఏడాది గడువుతో చేసే RDపై ఈ బ్యాంకు 5 శాతం, రెండేళ్లకు 5.4 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల RDలపై 5.5 శాతం, ఐదేళ్లకు మించిన గడువుతో చేసే RDలపై 5.6 శాతం వడ్డీ అందిస్తోంది.

    UPI App: గుడ్ న్యూస్... ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు

    recurring deposit interest rates, recurring deposit meaning in telugu, recurring deposit post office, recurring deposit rates, recurring deposit sbi, recurring deposit sbi interest rate, sbi recurring deposit calculator, what is recurring deposit in hdfc, ఆర్‌డీ స్కీమ్ వడ్డీ రేట్లు, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వివరాలు
    ప్రతీకాత్మక చిత్రం

    డచ్ (Deutsche) బ్యాంక్


    ఈ బ్యాంకు ఏడాది గడువుతో చేసే RDపై కేవలం 4.25 శాతమే వడ్డీని అందిస్తోంది. అయితే రెండేళ్ల RDపై 4.5 శాతం, మూడేళ్లకు 5 శాతం, నాలుగేళ్లకు 5.25 శాతం, ఐదేళ్లకు అత్యధికంగా 6.25 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది.

    ఫెడరల్ బ్యాంక్


    ఏడాది గడువుతో చేసే RDపై ఫెడరల్ బ్యాంక్ 5.10 శాతం వడ్డీ అందిస్తోంది. రెండు నుంచి నాలుగేళ్లకు 5.35 శాతం.. ఐదేళ్లు, అంతకు మించిన గడువుతో చేసే RDలకు 5.60 శాతం వడ్డీ రేటు అమలు చేస్తోంది.

    HDFC బ్యాంక్


    ఏడాది గడువుతో చేసే RDలపై HDFC బ్యాంక్ 4.9 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్లకు 5.15 శాతం, మూడు నుంచి ఐదేళ్ల గడువుకు 5.30 శాతం, ఐదేళ్లకు పైబడిన RDపై 5.50 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది.

    ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్


    ఏడాది గడువుతో చేసే RDపై ఈ బ్యాంకు 5.20 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్ల నుంచి ఐదేళ్లు మించిన గడువుతో చేసే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ అందిస్తోంది.

    Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో ఈ స్కీమ్‌తో నెలనెలా ఆదాయం

    recurring deposit interest rates, recurring deposit meaning in telugu, recurring deposit post office, recurring deposit rates, recurring deposit sbi, recurring deposit sbi interest rate, sbi recurring deposit calculator, what is recurring deposit in hdfc, ఆర్‌డీ స్కీమ్ వడ్డీ రేట్లు, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వివరాలు
    ప్రతీకాత్మక చిత్రం

    ICICI బ్యాంక్


    ఏడాది గడువుతో చేసే RDపై ICICI బ్యాంక్ అత్యల్పంగా 3.75 శాతం మాత్రమే వడ్డీ అందిస్తోంది. రెండు నుంచి ఐదేళ్లకు పైబడిన RDలపై కూడా ఈ బ్యాంకు కేవలం 4.40 శాతం వడ్డీని మాత్రమే అందిస్తోంది.

    IDBI


    ఒక సంవత్సరం గడువుతో చేసే RDపై ఈ బ్యాంకు 5.05 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్లకు 5.20 శాతం, మూడు నుంచి నాలుగేళ్లకు 5.40 శాతం, ఐదేళ్లకు 5.25 శాతం, ఐదేళ్లు పైబడిన RDపై 4.80 నుంచి 5.25 శాతం వడ్డీని అందిస్తోంది.

    ఇండియన్ బ్యాంక్


    ఏడాది గడువు ఉండే RDపై ఇండియన్ బ్యాంక్ 5.10 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్ల నుంచి ఐదేళ్లు పైబడిన డిపాజిట్లపై 5.15 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది.

    ఇండస్ ఇండ్ బ్యాంక్


    ఏడాది నుంచి నాలుగేళ్ల గడువుతో చేసే RDలపై ఈ బ్యాంకు అత్యధికంగా 6 శాతం వడ్డీని అందిస్తోంది. ఐదేళ్లు, అంతకు మించిన గడువు ఉండే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

    SBI ATM: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

    recurring deposit interest rates, recurring deposit meaning in telugu, recurring deposit post office, recurring deposit rates, recurring deposit sbi, recurring deposit sbi interest rate, sbi recurring deposit calculator, what is recurring deposit in hdfc, ఆర్‌డీ స్కీమ్ వడ్డీ రేట్లు, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వివరాలు
    ప్రతీకాత్మక చిత్రం

    కరూర్ వైశ్యా బ్యాంక్


    ఒక సంవత్సరం గడువు ఉండే RDపై ఈ బ్యాంకు 5.25 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు 5.50 శాతం, ఐదేళ్లు, అంతకు మించిన గడువుకు 5.75 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది.

    కొటక్ మహీంద్రా బ్యాంక్


    ఏడాది RDపై ఈ బ్యాంకు 4.50 శాతం మాత్రమే వడ్డీని అందిస్తోంది. రెండేళ్లకు 5 శాతం, మూడేళ్లకు 5.10 శాతం, నాలుగేళ్లకు 5.20 శాతం, ఐదేళ్లు, అంతకు పైబడిన డిపాజిట్లకు 5.25 శాతం వడ్డీని అందిస్తోంది.

    లక్ష్మీ విలాస్ బ్యాంక్


    ఈ బ్యాంకు ఏడాది గడువుతో అందుబాటులో ఉంచిన RDలపై 5 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. రెండేళ్లకు 4.75 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లు పైబడిన డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీని అమలు చేస్తోంది.

    ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్


    ఏడాది గడువు ఉండే RDలపై ఈ బ్యాంకు 5 శాతం, రెండేళ్లకు 5.10 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లు పైబడిన డిపాజిట్లకు 5.25 శాతం వడ్డీని అందిస్తోంది.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్


    ఏడాది గడువు ఉండే RDలపై ఈ బ్యాంకు 5 శాతం వడ్డీ అందిస్తోంది. రెండేళ్లకు 5.10 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లు పైబడిన RDలపై 5.25 శాతం వడ్డీని అందిస్తోంది.

    ఎస్బీఐ


    ఒక సంవత్సరం గడువుతో అందిస్తున్న RDలపై స్టేట్ బ్యాంక్ కేవలం 4.90 శాతం వడ్డీ మాత్రమే అందిస్తోంది. రెండేళ్లకు 5.10 శాతం, మూడు నుంచి నాలుగేళ్లకు 5.30 శాతం, ఐదేళ్లు అంతకు మించిన RDలపై 5.40 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది.

    సిండికేట్ బ్యాంక్


    ఏడాది నుంచి రెండేళ్ల గడువు ఉండే RDలపై ఈ బ్యాంకు 5.10 శాతం.. మూడేళ్ల నుంచి ఐదేళ్లు పైబడి గడువు ఉండే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీని అందిస్తోంది.

    Money Transfer: యూపీఐ పనిచేయట్లేదా? వెంటనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

    యూనియన్ బ్యాంక్


    ఏడాది గడువుతో అందుబాటులో ఉంచిన RDలపై యూనియన్ బ్యాంక్ 5 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్లకు 5.40 శాతం, మూడు నుంచి నాలుగేళ్లకు 5.50 శాతం, ఐదేళ్లు, అంతకు మించిన గడువు ఉండే RDలకు 5.60 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది.

    యస్ బ్యాంక్


    ఏడాది గడువు ఉండే RDలపై యస్ బ్యాంకు 5.75 శాతంతో మెరుగైన వడ్డీని అందిస్తోంది. రెండేళ్లకు 6 శాతం, మూడు నుంచి నాలుగేళ్లకు 6.25 శాతం, ఐదేళ్లు, అంతకు మించిన గడువుకు 6.50 శాతం వడ్డీ అందిస్తోంది.

    పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లు


    ఏడాది నుంచి ఐదేళ్ల గడువుతో అందుబాటులో ఉంచిన రికరింగ్ డిపాజిట్లపై పోస్టాఫీసులు 5.5 శాతం నుంచి 6.7 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి.

    వీటితో పాటు కొన్ని చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆర్డీలపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. అయితే ఈ వడ్డీ రేట్లు కేవలం అవగాహన కోసమేనని గుర్తించాలి. ఏదైనా బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ను కస్టమర్లు ఎంచుకునే ముందు.. సంబంధిత బ్యాంకు వెబ్సైట్లో అందుబాటులో ఉండే అధికారిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Banks, Interest rates, Investment Plans, Personal Finance, Post office, Post office scheme, Recurring Deposits, Save Money

    తదుపరి వార్తలు