• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • KNOW ABOUT THIS THINGS IS ABORTION LEGAL IN INDIA AND HERE THE FULL DETAILS GH SRD

Abortion: మన దేశంలో అబార్షన్‌ చేయించుకోవడం నేరమా? ఎలాంటి సందర్భాల్లో చట్టం అనుమతిస్తుంది? పూర్తి వివరాలు..

Abortion: మన దేశంలో అబార్షన్‌ చేయించుకోవడం నేరమా? ఎలాంటి సందర్భాల్లో చట్టం అనుమతిస్తుంది? పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

Abortion: ఉద్దేశపూర్వకంగా గర్భస్రావం చేయడాన్ని ప్రేరేపిత గర్భస్రావం (induced abortion or miscarriage) అంటారు. అబార్షన్‌ అనే పదానికి ఇదే అసలైన అర్థంగా భావిస్తారు. ఆకస్మిక గర్భస్రావాన్ని న్యాయపరమైన, వైద్య పరిభాషలో అబార్షన్‌గా పరిగణించరు. చట్టంలో గర్బస్రావానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయో తెలుసుకుందాం.

  • Share this:
మహిళ కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించడం లేదా బయటకు వెళ్లిపోయేలా చేయడాన్ని గర్భస్రావం అంటారు. ఈ ప్రక్రియ గర్భానికి ముగింపు పలుకుతుంది. మనుషుల ప్రమేయం లేకుండా జరిగే అబార్షన్‌ను మిస్ క్యారేజ్ లేదా ఆకస్మిక గర్భస్రావం (spontaneous abortion) అంటారు. 30 నుంచి 40 శాతం గర్భిణులకు ఇలా జరిగే ప్రమాదం ఉంది. ఉద్దేశపూర్వకంగా గర్భస్రావం చేయడాన్ని ప్రేరేపిత గర్భస్రావం (induced abortion or miscarriage) అంటారు. అబార్షన్‌ అనే పదానికి ఇదే అసలైన అర్థంగా భావిస్తారు. ఆకస్మిక గర్భస్రావాన్ని న్యాయపరమైన, వైద్య పరిభాషలో అబార్షన్‌గా పరిగణించరు. చట్టంలో గర్బస్రావానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయో తెలుసుకుందాం.

* గర్భస్రావం అంటే ఏంటి?
గర్భాన్ని (ప్రెగ్నెన్సీని) ఆపేసే ప్రక్రియను గర్భస్రావం అంటారు. మందులు లేదా సర్జరీ ద్వారా గర్భాశయం నుంచి పిండాన్ని, మావిని తొలగించడాన్ని అబార్షన్ అంటారు.

* భారతదేశంలో గర్భస్రావం చట్టబద్ధమేనా?
భారత్‌లో గర్భస్రావం కొన్నిసందర్భాల్లో చట్టబద్ధమైనదిగా పరిగణిస్తారు. వైద్యపరంగా తప్పని పరిస్థితుల్లో పిండాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అబార్షన్‌ను చట్టపరంగా అనుమతిస్తారు. కానీ ఇందుకు కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది.

* గర్భస్రావం ఎవరు చేయవచ్చు?
సాధారణంగా రెండు దశల్లో గర్భాన్ని ఆపేయవచ్చు. 20 వారాల లోపు ఉండే గర్భాన్ని సింగిల్ మెడికల్ ప్రాక్టీషనర్లు తొలగించవచ్చు. పిండం వయసు 20 వారాలకు మించి, 24 వారాలకు తక్కువగా ఉంటే.. గర్భస్రావం చేయడానికి కనీసం ఇద్దరు వైద్య నిపుణులు అవసరం.

* అబార్షన్ ఎక్కడ చేయాలి?
ప్రభుత్వం స్థాపించిన లేదా నిర్వహిస్తున్న ఆసుపత్రిలో గర్బస్రావం చేయవచ్చు. అబార్షన్ చేయడానికి ప్రభుత్వం ఆమోదించిన ప్రదేశంలో కూడా గర్భాన్ని తొలగించవచ్చు.

* 18 ఏళ్ల లోపు ఉన్నవారు గర్భస్రావం చేయించుకోవచ్చా?
మన దేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువతులు గర్భస్రావం చేయించుకోవచ్చు. కానీ ఇందుకు సంరక్షకుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.

* పెళ్లికాని మహిళలకు అబార్షన్ చేయవచ్చా?
గర్భస్రావంపై నిర్ణయం సంబంధిత మహిళ ఆరోగ్యం, ఆమె కడుపులో పెరుగుతున్న పిండం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. గర్భాన్ని కొనసాగిస్తే.. ఆ మహిళ జీవితానికి లేదా ఆమె శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉందని భావించినప్పుడు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది.

* గర్భస్రావం కోసం ఎవరి అనుమతి అవసరం?
గర్భస్రావం చేయడానికి గర్భిణీ స్త్రీ సమ్మతి మాత్రమే అవసరం. చట్టప్రకారం.. మహిళ తల్లిదండ్రులు లేదా భర్తకు ఈ నిర్ణయంతో సంబంధం ఉండదు. అబార్షన్ చేయించుకునే వారి వయసు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు.. లేదా వారి మతిస్థిమితం సరిగా లేనప్పుడు మాత్రమే సంరక్షకుల సమ్మతి తప్పనిసరిగా ఉండాలి.

* పిండం వయసు 24 వారాలు దాటిన తర్వాత గర్భస్రావం చేయించుకునే అవకాశం లేదా?

మహిళల ప్రాణానికి ప్రమాదం ఎక్కువగా ఉన్నా.. కడుపులో పెరుగుతున్న పిండానికి వైకల్యాలు ఉన్నట్టు గుర్తించినా.. 24 వారాల పరిమితి తర్వాత కూడా గర్భస్రావం చేయించుకునే అవకాశం ఉంది.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు