Home /News /explained /

KNOW ABOUT CO PAY AND DEDUCTIBLES IN INSURANCE POLICIES AK GH

Insurance Clauses: ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారా? ఈ రెండు నిబంధనలు కచ్చితంగా తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

చాలా మందికి బీమా పాలసీల్లో ఉండే షరతులు, క్లాజుల గురించి సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా కొన్ని నిబంధనల గురించి నామమాత్రంగానే ఐడియా ఉంటుంది.

ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేవారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ప్రమాద బీమా, విదేశీయానంపై ఇన్సూరెన్స్ తదితర పాలసీలను సైతం ప్రజలు ఎంచుకుంటున్నారు. అయితే చాలా మందికి బీమా పాలసీల్లో ఉండే షరతులు, క్లాజుల గురించి సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా కొన్ని నిబంధనల గురించి నామమాత్రంగానే ఐడియా ఉంటుంది. అలాంటి వాటిలో సహ చెల్లింపు (Co-Pay) క్లాజులు, మినహాయింపులు (deductibles) కీలకమైనవి. బీమా కంపెనీలు ఎక్కువగా వీటిపైనే ఆధారపడతాయి. కాబట్టి కొనుగోలుదారులు ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండాలి.

* సహా-చెల్లింపు అంటే ?
పాలసీదారులు క్లెయిమ్ చేసుకున్న మొత్తంలో కొంత భాగాన్ని సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కో-పే(Co-Pay) అంటారు. ఇది సాధారణంగా శాతంలో ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా ఆసుపత్రి పాలైనప్పుడు క్లెయిమ్ చేసుకోవాల్సిన మొత్తం లక్ష రూపాయలు అయితే.. కో-పే క్లాజు ప్రకారం 10 శాతాన్ని, ఉంటే రూ.10 వేలు పాలసీదారుడు చెల్లించాలి. మిగిలిన 90 శాతం బీమా కంపెనీ చెల్లిస్తుంది. భారత్‌లో ఈ విధానాన్ని కో-ఇన్సూరెన్స్ అని కూడా అంటారు.

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ వృద్ధులకు మెడిక్లెయిమ్ పాలసీలో 10 శాతం కో-పే క్లాజు నిబంధనను పొందుపరిచింది. ఎలాంటి ఆసుపత్రి ఖర్చులకైనా ఈ సహా-చెల్లింపు నిబంధన వర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో బీమా సంస్థ నెట్వర్క్ కాని ఆసుపత్రులకు.. అంటే హోం టౌన్ లేదా సిటీకి దూరంగా ఉన్న ఆసుపత్రులకు లేదా ఇంతకుముందే ఉన్న వ్యాధుల చికిత్సలకు వర్తింపజేయడాన్ని ఎంచుకోవచ్చు.

ఉదాహరణకు బజాజ్ అలయన్స్ హెల్త్ గార్డ్ పాలసీ 8 ప్రధాన నగరాలను జోన్-ఏగా, భారత్ లో మిగిలిన నగరాలను జోన్-బీగా వర్గీకరించి ప్రీమియం రేట్లు జారీ చేస్తుంది. జోన్-ఏ నగరాల్లో చికిత్స పొందితే క్లెయిమ్ మొత్తంలో 20 శాతం సహా-చెల్లింపు నిబంధన వర్తిస్తుంది. ప్రమాదంలో ఆసుపత్రి పాలయితే ఇది వర్తించదు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆరోగ్య బీమా (నాన్-నెట్వర్క్ ఆసుపత్రుల్లో) క్లెయిమ్ మొత్తంలో 10 శాతం షేర్ పాలసీదారుడు చెల్లించాలి. కో-పే నిబంధన లేని పాలసీతో పోలిస్తే ఈ నిబంధన ఉన్న పాలసీకి ప్రీమియం తక్కువగా ఉంటుంది.

* మినహాయింపులు (deductibles)..
బీమా కంపెనీ చెల్లించాల్సిన క్లెయిమ్‌లో కొంత మొత్తాన్ని పాలసీదారుడు సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే డిడక్టబుల్ క్లాజ్ అంటారు. ఒకవేళ పాలసీలో రూ.5 వేలు మినహాయింపుగా (డిడక్టబుల్ అమౌంట్‌) పేర్కొని ఉంటే.. లక్ష రూపాయల క్లెయిమ్ లో 95 వేలు బీమా కంపెనీ, 5 వేలు సదరు వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. డిడక్టబుల్ అమౌంట్ ఎక్కువగా ఉంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా మిగిలిన నిబంధనల్లో పెద్ద మార్పేమి ఉండదు.

సాధారణంగా మోటార్ బీమా, విదేశీ ప్రయాణ బీమా పాలసీలు మినహాయింపులతో వస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్ ప్లాన్స్ కూడా మినహాయింపులతో వస్తాయి. ప్రాథమిక బీమా మొత్తం పూర్తయిన తర్వాత టాప్-అప్ పాలసీ ప్రారంభమవుతుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ బూస్టర్ ప్లాన్ కింద 3 లక్షలకు పైగా క్లెయిమ్ చెల్లించవచ్చు. అంతేకాకుండా దీని కింద 5 లక్షల నుంచి 50 లక్షల వరకు హామీ ఇస్తుంది.

Telangana Congress: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ?.. స్పందించిన సీనియర్ నేత.. ఆ తరువాతే ప్రకటన

Remove Spiders From Home: ఇంట్లో సాలీడు సమస్య ఉందా ? ఇలా చేయండి.. వెంటనే బయటకు వెళ్లిపోతాయి..

రెండింటి మధ్య వత్యాసం..
సహా-చెల్లింపు, మినహాయింపుల మధ్య వ్యత్యాసం ఏంటంటే.. మినహాయింపులో మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని ముందుగానే డిడక్ట్ చేస్తుంది. కో-పే విషయంలో ముందుగా నిర్ణయించిన క్లాజు ప్రకారం క్లెయిమ్ ను రెండు భాగాలుగా విభజిస్తుంది. ఈ రెండు నిబంధనలు కొద్ది మొత్తంలో క్లెయిమ్ చేసుకోవాలనుకునేవారిని నిరుత్సాహపరుస్తాయి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు