Home /News /explained /

KERALA GOVERNOR ARIF MOHAMMAD KHAN SAYS NEHRUVIAN SECULARISM PLACES MUSLIMS NOT AS EQUALS BUT AS A PERMANENT MINORITY TO HINDUS BA GH

Exclusive: ముస్లింలను శాశ్వత మైనారిటీలుగా మార్చిన నెహ్రూవియన్ సెక్యులరిజం.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్

ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (File)

ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (File)

తాజాగా నెలకొన్న హిజాబ్ వివాదంతో పాటు పలు అంశాలపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఫస్ట్ పోస్ట్ వెబ్ సైట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భిన్న కోణాలను ఆయన తెలియజేశారు. మతం, సంస్కృతికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.

ఇంకా చదవండి ...
(Firstpostకి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని హైలైట్స్)

సెక్యూలరిజం నుంచి హిజబ్ వివాదం వరకు.. అనేక విషయాలపై అభిప్రాయాలు వెల్లడించారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. 1980 ప్రారంభం నుంచి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ దేశంలోని ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాజీవ్ గాంధీ హయాంలో షా బానో కేసు అయినా, నరేంద్ర మోదీ కాలంలో ఉడిపి హిజాబ్ వివాదాలను కూడా ఆయన ప్రశ్నించారు. భారతదేశంలోని లౌకికవాదం వక్ర రూపానికి సాక్ష్యమనే రీతిలో లిబరల్స్‌ ఆయన్ను ద్వేషిస్తారు, ఇస్లామోఫోబిక్ ఖాన్‌ అని ఆరోపణలు చేస్తారు. అయితే ఖాన్ తన మార్గాన్ని వీడలేదు. ఫస్ట్‌పోస్ట్‌ మీడియాతో ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రత్యేకంగా ఆలయ సందర్శనలు, హిజాబ్‌ ఘటనతోపాటు అనేక అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం.

మీపై మత చాంధసవాదుల దాడులు ఆగలేదు. శబరిమల, ఉజ్జయిని మహాకాల్ సందర్శనల నేపథ్యంలో ఇస్లాం వీడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ముస్లిం గవర్నర్ హిందూ దేవాలయానికి ఎందుకు వెళ్లకూడదు? అనే అంశాన్ని ఎలా వివరిస్తారు?

మత చాందసవాదులు హింసాత్మకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. నేను ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. నేను పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు 1980 ప్రారంభంలో అనేక దేవాలయాలను సందర్శించాను. కొన్నింటి నిర్మాణానికి కూడా సహకరించాను. 1986లో షా బానో కేసు సందర్భంగా నాకు వరుస ఫత్వాలు వచ్చాయి. నా దేవుడు దేవాలయాలు లేదా మసీదులతో సహా ఏ ప్రార్థనాస్థలానికి పరిమితం కాదు. అనారోగ్యంతో, ఆకలితో, బాధలో ఉన్నవారిలో దేవుడు కనిపిస్తాడని చెప్పే ప్రసిద్ధ ప్రవక్త సంప్రదాయం ఉంది.

ఒక ముల్లా మిమ్మల్ని ద్వేషించడం సహజం. కానీ మీ మతానికి చెందినవారు, లిబరల్స్‌ కూడా మిమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు?

సెక్యులరిజంపై వారి ఉన్న అభిప్రాయాల మేరకు హిందూ లిబరల్స్‌కు నేను వ్యతిరేకం అయ్యాను. ముస్లిం లిబరల్స్‌లో ఎక్కువ మంది వ్యక్తిగత జీవితంలో లిబరల్స్‌, లౌకికవాదులు అని నమ్ముతాను. కానీ దురదృష్టవశాత్తు వారు తమను తాము పాలక వర్గానికి చెందినవారమని భావిస్తుంటారు. ప్రవక్త స్వయంగా "హింద్ నుండి చల్లగాలి వీస్తున్నట్లు" చెప్పారని గ్రహించరు. అరబ్ చరిత్రకారులు భారతదేశం గురించి ఏం రాశారో కూడా వారికి తెలియదు. ప్రపంచంలోని ఐదు నాగరికతలలో భారతదేశం మాత్రమే జ్ఞానం పెంపొందించిందని ప్రముఖులు చెప్పారు. సంస్కృతి , మతం మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. చాలా మంది భారతీయ ముస్లింలు భారతీయ పేర్లను పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు.. కానీ రుస్తోమ్, సోహ్రాబ్ , పర్వేజ్ వంటి ఇరానియన్ పేర్లను సంతోషంగా స్వీకరిస్తారు. బాలిలో కృష్ణుడు, అర్జునుడు విగ్రహాన్ని చూపిస్తూ.. ఇస్లాం మా మతం, ఇది మన సంస్కృతి అని ఓ ఇండోనేషియాకు చెందిన వ్యక్తి అనడం ఇంకా గుర్తు ఉంది. భారతీయ ముస్లింలు ఇరానియన్లు, ఇండోనేషియన్ల నుంచి చాలా నేర్చుకోవాలి. సంస్కృతి, మతాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి.

మైనారిటీలను రెచ్చగొడుతున్నారని తరచూ మిమ్మల్ని ఆరోపిస్తున్నారు. ఇస్లామోఫోబిక్ అని కూడా నిందించారు. మీ అభిప్రాయాలు?

నేను ఇస్లామోఫోబిక్ కాదు. నేను ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను. కానీ బాధితుల కథనాలతో నాకు సమస్యలు ఉన్నాయి. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఎవరూ చావకూడదని నేను నమ్ముతున్నాను. కానీ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉరి తీయడాలను, కథనాలు సృష్టించడాన్ని వ్యతిరేకిస్తాను. నన్ను కొట్టడానికి ఐదుసార్లు ప్రయత్నాలు జరిగాయి. చివరిది జామియా మిలియాలో జరిగింది. అక్కడ ముషీరుల్ హసన్ సమాధి ఊరేగింపులో పాల్గొనడానికి వెళ్ళాను, నేను తృటిలో ప్రాణాలతో బయటపడ్డాను. దాద్రీ ఘటనకు చాలా ముందు నుంచే హత్యలు జరిగాయి.

లౌకికవాదం పేరుతో మైనారిటీ దోపిడిని చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ వంటి వారు కూడా భారతదేశ వనరులపై మైనారిటీలకు మొదటి హక్కు కలిగి ఉన్నారని నిర్వచించారు. మీరు దానిని ఎలా చూస్తారు?

సెక్యులరిజం పేరిట ఇచ్చిన ఈ వివరణపై నేను బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశాను. ఇలాంటివి హిందువులు, ముస్లింలలో అపనమ్మకాన్ని సృష్టిస్తాయి. ఒక వర్గానికి మరో వర్గానికి ఘర్షణలు పెట్టడం బ్రిటీష్ పాలకుల పద్ధతి. స్వాతంత్య్రానికి ముందు ఆంగ్లేయులు విభజించు, పాలించు అమలు చేస్తే.. స్వాతంత్య్రం తర్వాత ఆ పద్ధతిని మన నాయకులే భుజానికెత్తుకున్నారు. అంతకు ముందు ముస్లిం వర్సెస్‌ హిందువులు అయితే.. ఆ తర్వాత మెజారిటీ వర్సెస్‌ మైనారిటీ అయింది. వారు ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా మరొక కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఆడతారు. 1947 తర్వాత, మన స్వంత రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ విధానాన్ని తీసుకున్నారు. స్వాతంత్య్రానికి ముందు హిందువులు వర్సెస్ ముస్లింలు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మెజారిటీ వర్సెస్ మైనారిటీ అనే అంశంగా మారింది. "మైనారిటీ" అనే పదాన్ని ఉపయోగించడం నాకు అసహ్యంగా ఉంటుంది. నెహ్రూవియన్ సెక్యులరిజం అత్యంత ప్రాథమిక మూర్ఖత్వం ఏంటంటే ముస్లింలు సమానులు కాదు.. ఎప్పటికీ హిందువులకు మైనారిటీలే అని పేర్కొనడం.

షా బానో నుంచి ట్రిపుల్ తలాక్ వరకు మీరు రాజీవ్ గాంధీతో, ఇప్పుడు నరేంద్ర మోదీతో కలిసి పనిచేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వేర్వేరు హోదాల్లో ఉన్న ఇద్దరు నాయకులు రామాలయంతో సంబంధం కలిగి ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించిన సమస్యలపై వారి విధానాన్ని ఎలా చూస్తారు?

నేను పోలికలను నమ్మను. రాజీవ్ జీ గొప్ప వ్యక్తి అని చెప్పగలను. అతను షా బానో కేసులో అలా చేయాల్సింది కాదు.. అది అతని తప్పుడు సలహాదారుల వళ్ల జరిగింది. నరేంద్ర మోదీ విషయానికొస్తే.. గుజరాత్ హింస తర్వాత నేను అతన్ని విమర్శించాను. గుజరాత్‌లో ఆరు నెలలు గడపకపోతే నేను ఆయన్ను సరిగా అంచనా వేయలేకపోయేవాడిని. కేరళ గవర్నర్ కాకముందు.. ఆయన్ను కేవలం మూడు సార్లు కలిశాను. అది కూడా ట్రిపుల్ తలాక్ సందర్భంలో. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ విఫలమైతే, 1986 షా బానో కేసులో రాజీవ్ గాంధీ చేసిన తప్పిదం రిపీట్‌ అవుతుందని ఆరు పేజీల లేఖ రాశాను. మరుసటి రోజు మోదీ ఫోన్‌ చేసి.. 45 నిమిషాలు మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ బిల్లు పార్లమెంటు ఉభయ సభల నుంచి ఆమోదం పొందినప్పుడు, అభినందించేందుకు నేను మోదీని కలిశాను.

ఉడిపి హిజాబ్ వివాదాన్ని కుట్ర అని ఎందుకంటున్నారు?

హిజాబ్ వివాదం నిజానికి ఒక కుట్ర అని నేను ఎప్పుడూ నమ్ముతున్నాను. మీరు విద్యాసంస్థకు వెళ్లినప్పుడు డ్రెస్‌ కోడ్‌ను అనుసరిస్తారు. కొద్దిమంది కోసం సంస్థ తన నియమాన్ని మార్చదు. యువతులపై నాకు బాధగా ఉంది. సాంప్రదాయకంగా కూడా హిజాబ్ ఇస్లాంలో అంతర్భాగం కాదు. ప్రవక్త కాలంలో మహిళలు హిజాబ్ ధరించలేదని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం భార్య మేనకోడలు వంటి సన్నిహితులు హిజాబ్‌ ధరించడానికి నిరాకరించారు. మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో యువత పావులవుతున్నారు.

హిజాబ్ తప్పనిసరి అని చెప్పే చాలా మంది ముల్లాలు ఉన్నారు కదా?
ఇస్లాంకు ఐదు స్తంభాలు ఉన్నాయని ఖురాన్ స్పష్టంగా పేర్కొంది. ఇస్లాం మతంలోనే ఈ ఐదు స్తంభాలు ఉంటే.. దానికి ఆరో స్తంభాన్ని ఎందుకు జోడించాలి? నాకు ఈ అధికారం ఉందా? ఐదు స్తంభాలలో హిజాబ్ ఉందా? వాస్తవానికి ఖురాన్‌లో 'హిజాబ్' అనే పదం ఏడు సార్లు మాత్రమే కకనిపిస్తుంది.

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాల్సిన సమయం ఇది అని మీరు అనుకుంటున్నారా?

నిజానికి యూనిఫాం సివిల్ కోడ్ అనే పదం సరైన పదం కాదు. సరైన పదం కామన్ సివిల్ కోడ్. కామన్ సివిల్ కోడ్ అనేది మన రాజ్యాంగ సభ నిర్ణయించిన రాజ్యాంగపరమైన బాధ్యత అని మనం అర్థం చేసుకోవాలి. అసలు సమస్య సమయమే.. ఇది ఇప్పుడే చేయాలా, లేదా మరికొంత సమయం వేచి ఉండాలా?. అనేది నిర్ణయించాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Hijab, Kerala

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు