రూ. లక్ష కోట్ల సంపద.. అయినా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న అనంత పద్మనాభస్వామి ఆలయం.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సంక్షోభంలో భక్తులనుంచి వచ్చే ఆదాయం సరిపోక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఆడిట్‌ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆలయ ట్రస్టు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది.

  • Share this:
కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగల్లో రూ. లక్షల కోట్ల విలువైన సంపద బయటపడిన విషయం తెలిసిందే. అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న ఈ దేవాలయం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈ ధనిక ఆలయం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని కథనాలు వస్తున్నాయి.గతేడాది సుప్రీంకోర్టు.. ఆలయంతో పాటు ట్రస్టుకు సంబంధించి గడిచిన 25ఏళ్లలో జరిగిన ఖర్చులు, ఆదాయాలపై ఆడిట్‌ చేపట్టాల్సిందిగా ట్రావెన్‌కోర్ రాజవంశం నేతృత్వంలోని ట్రస్టును ఆదేశించింది. అయితే కరోనా సంక్షోభంలో భక్తులనుంచి వచ్చే ఆదాయం సరిపోక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఆడిట్‌ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆలయ ట్రస్టు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆడిట్‌ను కచ్చితంగా చేపట్టాల్సిందేనని.. వీటిని మూడు నెలల్లోనే పూర్తిచేయాలని ఆదేశించింది.

* సుప్రీం కోర్టు ఏమని ఆదేశించింది?
ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి మారుపేరుగా ఉన్న పద్మనాభస్వామి దేవాలయాన్ని దశాబ్దాలుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. అయితే కేరళ హైకోర్టు 2011లో తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ 2020లో ఆలయ వివాదానికి ముగింపు పలికింది సుప్రీంకోర్టు. ఆలయ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఈ కేసు దేవాలయం ఆర్ధిక, సంపద గురించి కూడా వివాదాలు లేవనెత్తింది. దాంతో అత్యున్నత న్యాయస్థానం ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో ఆలయ నిర్వాహక కమిటీ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కానీ, ట్రస్ట్ కూడా 25 ఏళ్లకు ఆడిట్ చేయాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

* ఆలయం ఆర్థిక సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కొంటుంది?
తిరువనంతపురం జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలోని దేవాలయ పరిపాలన బోర్డు ప్రకారం.. కరోనా దృష్ట్యా ఆలయాన్ని సాధారణ ప్రజలకు మూసివేశారు. దాంతో కరోనా ముందునాటి సమయంలో వచ్చినట్లుగా దేవుడికి ప్రజల నుంచి కానుకలు రావడం లేదు. ఫలితంగా ఆలయ ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇదే విషయాన్ని సదరు బోర్డు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆలయ నిర్వహణకు ప్రతి నెలా రూ. 1.25 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోండగా.. మహమ్మారి సమయంలో కేవలం రూ.50-60 లక్షల వరకు మాత్రమే ఆదాయం వస్తున్నట్లు ఆలయ యాజమాన్యం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఇది చెల్లించడానికి ఆలయం సేవింగ్స్ నుంచి నగదు సేకరించాల్సి వస్తోందని తెలిపింది.

సాధారణ సమయాల్లో దేవాలయం నెలకు రూ. 1.5-2 కోట్ల వరకు సంపాదించిందని బోర్డు తెలిపింది. ఆ డబ్బుతోనే టెంపరరీ, పర్మినెంటు సిబ్బంది జీతాలు చెల్లించడంతో పాటు మిగతా ఆలయ నిర్వహణ, స్వామివారి ధూపదీప నైవేద్యాలు, కైంకర్యాలు, సేవలను నిర్వహించామని వెల్లడించారు. కానీ కరోనా సమయంలో జీతాలు చెల్లించడానికి ఆలయ ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు సేకరించవల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొంది. ప్రభుత్వం, ట్రస్ట్ సహాయం చేయకపోతే ఆలయం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ఆలయ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది.

* ఆలయం ఎంత ధనికమైనది?
గతంలో ట్రావెన్‌కోర్ చివరి పాలకుడి తమ్ముడు ఉత్రాదం తిరునాల్ మార్తాండ వర్మ దేవాలయంతో పాటు అందులోని ఆస్తి కూడా తమ రాజవంశం సొంతమని బహిరంగంగా ప్రకటించారు. ఆ తరువాత దేవాలయం సంపద గురించి దర్యాప్తు ప్రారంభమైంది. కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి దేవాలయ నిర్వాహణ అప్పజెప్పాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ట్రావెన్‌కోర్ రాయల్స్ అప్పీల్ చేయగా.. సుప్రీంకోర్టు 2014లో జడ్జి నేతృత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ద్వారా దేవాలయాన్ని నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించింది.

ఆలయంలో మొత్తం ఆరు నేలమాళిగలు ఉండగా.. ఇప్పటికే ఐదు తెరిచారు. సుప్రీంకోర్టు మిగిలిన బీ నేలమాళిగను తెరవాలని కూడా ఆదేశించింది. కానీ కొన్ని కారణాల వల్ల బీ వాల్ట్ తలుపులు తెరవలేదు. 5 నేలమాళిగల్లో బంగారు విగ్రహాలు, బంగారు నాణేల సంచులు, ఆభరణాలు, ఆలయంలో నిర్వహించే పూజా సామాగ్రి, తదితర విలువైన వస్తువులు దొరకగా.. వాటి విలువ రూ. 1 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. దేవాలయానికి చెందిన కొందరు పండితులు బీ నేలమాళిగ ముఖద్వారంపై నాగపడగలు ఉన్నాయని.. అది తెరిస్తే పెద్ద ప్రళయం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆలయ జ్యోతిష్యులు, పూజారి కూడా దాన్ని తెరవద్దని అధికారులకు, దేవాలయ యాజమాన్యానికి సూచించారు.

Weight Loss: బరువు తగ్గించుకుంటున్నారా ? లేక కొవ్వు తగ్గించుకుంటున్నారా ?.. రెండింటి మధ్య తేడా ఇదే..

Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘టీడీపీ’ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా ?

* ఆలయం ఎప్పుడు నిర్మించారు?
భారతదేశంలోని 108 పవిత్రమైన విష్ణు దేవాలయాలలో ఒకటైన శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఎప్పుడు నిర్మించారనేది చెప్పడానికి కచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవని ఆలయ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. కేరళ టూరిజం ప్రకారం.. దేవాలయం క్రీ.శ 8 వ శతాబ్దానికి చెందినది. 8 మంది ట్రావెన్‌కోర్‌ నాయర్ సామంత రాజుల్లో ఒకరైన మహారాజు శ్రీ మార్తాండ వర్మ అనిజామ్ తిరునాళ్ల నుంచి దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని కేరళ టూరిజం పేర్కొంది.
Published by:Kishore Akkaladevi
First published: