Home /News /explained /

JHANSI RAILWAY STATION RENAMED AS VEERANGANA RANI LAXMIBAI STATION BY YOGI ADITYANATH GOVERNMENT GH VB

Explained: మారిన ఝాన్సీ రైల్వేస్టేషన్ పేరు.. ఈ విధానం ఎలా జరుగుతుంది..?ఇంకా ఏ రైల్వే స్టేషన్ పేర్లు మారాయి.. వివరాలివే..

రైల్వే స్టేషన్

రైల్వే స్టేషన్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం(Uttarapradesh Government) ఝాన్సీ రైల్వేస్టేషన్(Railway Station) పేరును వీరాంగన లక్ష్మీ బాయి రైల్వే స్టేషన్‌గా మార్చేసింది. రైల్వే స్టేషన్ పేరు మార్చినట్లుగా డిసెంబర్ 29న ఒక ట్వీట్ ద్వారా యూపీ సీఎం ఆదిత్యనాథ్ చెప్పాడు. ఉత్తర భారతదేశంలో(North India) ఝాన్సీ రాజ్యాన్ని పరిపాలించిన లక్ష్మీబాయి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడారు.

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం(Uttarapradesh Government) ఝాన్సీ రైల్వేస్టేషన్(Railway Station) పేరును వీరాంగన లక్ష్మీ బాయి రైల్వే స్టేషన్‌గా మార్చేసింది. రైల్వే స్టేషన్ పేరు మార్చినట్లుగా డిసెంబర్ 29న ఒక ట్వీట్ ద్వారా యూపీ సీఎం ఆదిత్యనాథ్ చెప్పాడు. ఉత్తర భారతదేశంలో(North India) ఝాన్సీ రాజ్యాన్ని పరిపాలించిన లక్ష్మీబాయి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడారు. బ్రిటిష్ సైన్యాన్ని(British) గడగడలాడించిన జోన్ ఆఫ్ ఆర్క్(Zone Of Arc) తో ఆమెను పోలుస్తుంటారు. అయితే ఈమె పేరును తాజాగా రైల్వే స్టేషన్‌కు పెట్టారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆమె పాత్ర గురించి భావితరాలకు తెలియజేసేలా ఉత్తరప్రదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ "నో అబ్జెక్షన్" సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ పేరు మార్చినట్టుగా తాజా నోటిఫికేషన్ వెల్లడించింది.

వాస్తవానికి భారతదేశంలో రైల్వే స్టేషన్లు, నగరాలు, ప్రదేశాలు, రోడ్ల పేర్లను మార్చడం కొత్తేం కాదు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా లేదా చరిత్రను ప్రతిబింబించేలా ప్రదేశాల పేర్లు మార్చే కార్యక్రమం ఎప్పట్నుంచో వస్తోంది. కేవలం ఎనిమిది సంవత్సరాల్లో అంటే 2014 నుంచి భారతదేశంలో చాలా రైల్వే స్టేషన్ల పేర్లు మారాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 4 రైల్వేస్టేషన్ల పేర్లు మారిపోయాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అలహాబాద్ నగరం పేరు ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన విషయం తెలిసిందే. రాష్ట్రాల పేర్లు మారటం 1956లో మొదలయ్యింది.మొట్టమొదటిగా అంటే 1 నవంబర్ 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చిన్ కేరళ మారగా.. చిట్టచివరగా 4 నవంబర్ 2011లో ఒరిస్సా ఒడిశాగా చేంజ్ అయ్యింది. వెస్ట్ బెంగాల్ ను బంగ్లా గా మార్చాలని ప్రస్తుతానికైతే ఒక ప్రతిపాదన ఉంది. కేరళ నుంచి కేరళంగా, నాగాలాండ్ నుంచి నాగాంచిగా మార్చాలంటూ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఒకవేళ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ "నో అబ్జెక్షన్"(No Objection) సర్టిఫికెట్ ఇస్తే పేర్లన్నీ మారిపోతాయి.

IRCTC Goa Tour: ఏడు వేలకే గోవా టూర్... విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచి ప్యాకేజీ

ఇక పాట్నా పాటలీపుత్రగా.. అహ్మదాబాద్ కర్ణావతిగా... సిమ్లా శ్యామలగా... తిరువనంతపురం అనంతపురిగా... భోపాల్ భోజ్‌పాల్ గా... ఔరంగాబాద్ శంభాజీ నగర్ గా... ఉస్మానాబాద్ ధారశివ్ గా.. ఇస్లాంపూర్ ఈశ్వర్పూర్ గా.. హైదరాబాద్ భాగ్యనగర్ గా.. నిజామాబాద్ ఇందూరు గా ముజఫర్‌నగర్ లక్ష్మి నగర్ గా మార్చాలనే ప్రతిపాదనలు ఇప్పుడు మంత్రిత్వ శాఖ ముందున్నాయి.

Explained: 2021లో అత్యధిక పులుల మరణాలు.. దశాబ్దంలోనే ఎక్కువ.. ఎందుకు ఇలా జరుగుతోంది..?


స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో నగర వీధులు, ప్రావిన్సుల పేరు మార్చే పని మొదలైంది. న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ జరిగే కింగ్స్‌వే వంటి రోడ్ల పేరును రాజ్‌పాత్‌గా, క్వీన్స్‌వే పేరును జనపథ్‌గా మార్చారు. నగరం ప్రధాన రహదారి కర్జన్ రోడ్‌కి కస్తూర్బా గాంధీ మార్గ్ అని పేరు పెట్టారు. అయితే అనేక వలసరాజ్యాల పేర్లు 1990ల వరకు భారతీయ నగరాల్లో కొనసాగాయి. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ సిఫార్సు ఫలితంగా ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భాషాప్రయుక్త రాష్ట్రాల స్థాపన, అలాగే ఇప్పటికే ఉన్న వాటికి పేరు మార్చడం జరిగింది.

1969లో మద్రాసు రాష్ట్రానికి తమిళనాడుగా.. మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్చారు. స్వాతంత్య్రం తర్వాత తొలి సంవత్సరాల్లో కాన్‌పూర్ కాన్పూర్‌గా మారింది. బ్రిటీష్ నగరాల స్పెల్లింగ్‌లను మార్చేసి వాటిని మరింత భారతీయంగా చేంజ్ చేయగా జుబుల్‌పూర్ జబల్‌పూర్‌గా మారింది. 2021లో హోషంగాబాద్ సిటీ పేరు నర్మదాపురంగా మార్చడం జరిగింది. 1980-1990 కాలంలో వీధి, నగరాల పేరు మార్చడం మళ్లీ మొదలైంది. స్థానిక సంప్రదాయాలు, భాషలలో కామన్ గా ఉన్న ముఖ్యమైన నగర పేర్లను పునరుద్ధరించడమే లక్ష్యంగా పేరు మార్పు చేయడం జరిగింది.

Explained: భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు.. డోసుల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..


మహారాష్ట్ర శాసనసభలో బీజేపీ - శివసేన ప్రభుత్వం బొంబాయిని ముంబైగా మార్చింది. తమిళనాడులో ద్రావిడ పార్టీలు మద్రాసుకు బదులు రాజధాని నగరాన్ని చెన్నైగా పిలిచారు. అలాగే, కలకత్తా పేరు కోల్‌కతాగా మారింది. బరోడా పేరు వడోదర, త్రివేండ్రం పేరు తిరువనంతపురం, కాలికట్ పేరు కోజికోడ్, టుటికోరిన్ పేరు తూత్తుకుడి, ఊటకమండ్ ఉదగమండలం అని పేరు మార్చారు.

పేర్లు మార్చడం వరకు ఓకే గానీ అసలు ఒక నగరం, ప్రదేశం లేదా రైల్వే స్టేషన్ పేరును ఎలా మారుస్తారు? దానికి అయ్యే ఖర్చు ఎంత? పేరు మార్చాలంటే ఎలాంటి విధానాన్ని అనుసరించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

పేరు మార్చే విధానం..
సాధారణంగా ఒక వీధి పేరు మార్చే అధికారం సంబంధిత సివిక్ అథారిటీ లేదా పంచాయతీలకు ఉంటుంది. ఇవి స్ట్రీట్ పేరు మార్చాలంటూ విజ్ఞప్తి చేసే దరఖాస్తులను ఆమోదిస్తాయి లేదా తిరస్కరిస్తాయి. అలాగే ఒక నగరం పేరు మార్చాలంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రం పేరు మార్చాలనుకుంటే రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. తరువాత అది కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు.

పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాలా లేదా తిరస్కరించాలా వద్దా అని కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తుంది. ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తర్వాత పేరు మారుతుంది. ప్రదేశం పేరు మార్చడానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను సెప్టెంబర్ 11, 1953న అప్పటి హోం మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ సర్దార్ ఫతే సింగ్ రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఎలాంటి సూత్రాల ఆధారంగా పేర్లను మార్చాల్సి ఉంటుంది..?

సర్దార్ ఫతే సింగ్ లేఖ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు కింద పేర్కొన్న ఐదు జనరల్ కాన్సెప్టులను దృష్టిలో పెట్టుకుని పేరు మార్పుల కోసం అభ్యర్థనలను ప్రతిపాదించాలి.

1. ఏదో ఒక బలమైన కారణం ఉంటే తప్ప ప్రజలకు అలవాటు పడిన ఊరు పేరు మార్చరాదు.

2. గ్రామాల పేర్లు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఇతర పేర్లను వీలైనంత వరకు మార్చకూడదు.

3. స్థానిక దేశభక్తి లేదా భాషాపరమైన కారణాల కోసం మాత్రమే పేరును మార్పు చేయరాదు.

4. కొత్త పేర్లను ఎంచుకునేటప్పుడు రాష్ట్రంలో లేదా సమీపంలో అదే పేరుతో గ్రామాలు, పట్టణాలు లేదా ఇతర స్థలాలు ఏవీ లేవని నిర్ధారించుకోవాలి. లేదంటే గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

5. పేరు మార్పును సమర్ధించేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత పేరు మార్పు, కొత్త పేరు ఎంపిక కోసం సమగ్ర వివరణలను అందించాలి.

Exclusive: 2021 డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో ఆధార్ అథెంటికేషన్‌లు.. ఎందుకో తెలుసా..?


ఈ ప్రక్రియ అన్ని ప్రదేశాలకు ఫాలో కావాలా?
ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం గ్రామాలు, పట్టణాలు, నగరాల పేర్లను మార్చడానికి ఈ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి. రైల్వే స్టేషన్ల పేరు మార్చడానికి కూడా అదే విధానాన్ని ఫాలో కావలసి ఉంటుంది. భారతీయ రైల్వేకు దాని స్టేషన్ల పేర్లను మార్చే అధికారం ఉందని అనుకుంటారు కానీ అది నిజం కాదు. నగరంలో రోడ్డు పేరు మార్చే అధికారం మునిసిపల్ అథారిటీకి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణాలు, నగరాలు, గ్రామాలు, రైల్వే స్టేషన్‌ల పేరు మార్చడానికి తగిన అభ్యర్థనలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పిస్తాయి. ఇది ఇతర ఏజెన్సీల సహకారంతో ప్రతిపాదనలను మూల్యాంకనం చేస్తుంది. పేరు మార్చే ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ వస్తే "నో ఆబ్జెక్షన్" అని మంత్రిత్వ శాఖ పేర్కొంటుంది. అనుమతి పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది.

ఈ విధానం ఎంత ఖర్చుతో కూడుకున్నది?
నగర వీధి పేరు మార్చడానికి అయ్యే ఖర్చులో స్ట్రీట్ సైన్లు మళ్లీ పెయింట్ చేయడం, నగరం పేరుకు అనుగుణంగా పౌర కార్పొరేషన్ పేర్లను తయారు చేయడం వంటి ఖర్చులు ఉంటాయి. అయితే ఒక నగరం పేరు మార్చడానికి ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల పేరు మార్చాల్సినవసరం లేదు. కోల్‌కతా, ముంబై, చెన్నైలోని హైకోర్టులను ఇప్పటికీ కలకత్తా హైకోర్టు, బాంబే హైకోర్టు మద్రాసు హైకోర్టు అని పిలవడం మనం గమనిస్తూనే ఉన్నాం.
Published by:Veera Babu
First published:

Tags: India Railways

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు