Home /News /explained /

JEFF BEZOS IS LOOKING TO DEFY DEATH THIS IS WHAT WE KNOW ABOUT THE SCIENCE OF AGEING GH VB

Research on Ageing: మనిషి వృద్ధాప్యం సమస్యను అధిగమించే ప్రయోగం.. ఎలా సాధ్యం..? పూర్తి వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజ్ఞానశాస్త్రం అభివృద్ధి(Develop) చెందడంతో ఈ సృష్టిపై మనిషి ఎంతో వృద్ధి సాధించాడు. అంతరిక్షం నుంచి అణుబాంబు వరకు మానవుని విజయం అనితర సాధ్యమేనని చెప్పాలి. ఎంత చేసినా, ఏమి చేసినా చేయాల్సింది ఇంకా ఉందన్న చందంగా సృష్టిలోని నిగూఢ రహస్యాలను శోధించేందుకు ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాడు.

ఇంకా చదవండి ...
విజ్ఞానశాస్త్రం అభివృద్ధి(Develop) చెందడంతో ఈ సృష్టిపై మనిషి ఎంతో వృద్ధి సాధించాడు. అంతరిక్షం నుంచి అణుబాంబు వరకు మానవుని విజయం అనితర సాధ్యమేనని చెప్పాలి. ఎంత చేసినా, ఏమి చేసినా చేయాల్సింది ఇంకా ఉందన్న చందంగా సృష్టిలోని నిగూఢ రహస్యాలను శోధించేందుకు ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా మానవునికి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది. అసలు వయసు పెరగడాన్ని అధిగమించలేమా అనే దిశగా చాలా ఏళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచం కూడా వృద్ధాప్యాన్ని(Ageing) జయించాలనే లక్ష్యంతో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో ప్రాధాన్యత నెలకొంది. ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం జెఫ్ బెజోస్ ఇందులో కాస్త ముందున్నారు. తన సరికొత్త యాంటీ ఏజింగ్(Anti Ageing) కంపెనీ అయిన అల్టోస్ ల్యాబ్స్‌కు(Altos Labs) నేతృత్వం వహించడానికి గ్లాక్సో స్మిత్ క్లైవ్‌కు చెందిన హాల్ బారన్‌ను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్యం గురించి సైన్స్ ఏం చెబుతుంది? దీన్ని మనం అధిగమించలేమా లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం.

వృద్ధాప్యం అనే అనేది మనం ఎలా భావిస్తున్నామో లేదా మనం కనిపించే తీరులో మార్పు మాత్రమే కాదు, ఇది సెల్యూలర్ స్థాయిలో జరుగుతుంది. వైజ్ఞానిక పరిభాషలో చెప్పాలంటే వయోజనుల చర్మ కణాలు(Skin cells) దాదాపు 50 సార్లు విభజనకు గురవుతాయి. అదే నవజాత శిశువులో అయితే 80 నుంచి 90 సార్లు, వృద్ధుల్లో అయితే కేవలం 20 సార్లు మాత్రమే విడిపోతాయి. ఏజింగ్ మన జన్యువులో(Genes) స్పష్టంగా కనిపిస్తుంది. జెనిటికల్ మెటిరియల్ కాలక్రమేణా మార్పులకు లోనవుతుంది. రసాయనాల మిళితం కావడం వల్ల జీన్స్ ఆన్ లేదా ఆఫ్ చేసేవిధంగా మార్చవచ్చు. వీటిని ఎపిజెనెటికల్ మార్పులు(Epigenetic Changes) అని అంటారు. అవి మన వయసుతో పాటు పెరుగుతాయి. ఇది కాకుండా వృద్ధులుగా మారడానికి డీఎన్ఏ చివర్లలో మరో రకమైన మార్పు కూడా కారణమవుతుంది. టెలోమియర్స్ అని పిలిచే డీఎన్ఏ రిపీటింగ్ సిగ్మెంట్లు.. కణాలు విభనకు లోనైన ప్రతిసారి తగ్గిపోతుంటాయి.

Zodiac Signs-Kindness: ఈ రాశుల వారు ఎంతో దయాగుణం కలిగి ఉంటారు.. అందులో మీరు కూడా ఉన్నారా..


ఈ టెలోమియర్స్ మన షూలేస్‌ చివర్లో ఉండే ప్లాస్టిక్ టిప్ మాదిరిగా పనిచేస్తాయి. అంటే జెనిటిక్ మెటిరియల్ వక్రీకృత కాయిల్స్ ఒకదానితో ఒకటి కలిసి పోకుండా లేదా ముడిపడకుండా నిరోధిస్తాయి. ఈ రకంగా టెలోమియర్స్ తగ్గిపోవడం కూడా మన వెంట్రుకలు రంగు మారడాన్ని(వృద్ధాప్యం) సూచిస్తాయా లేదా కణాల వయసు పెరిగే ప్రక్రియలో భాగమా అనే విషయంపై శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు.

కణాలు, క్రోమోజోములు, టెలోమియర్స్
కణాలను సజీవంగా ఉంచడానికి, విభజించడానికి రోగనిరోధక కణాలు క్యాన్సర్ కణాల వలే టెలోమియర్లను తగ్గించడాన్ని ఆపివేస్తాయి. బహుశా ఇది అమరత్వానికి దోహదపడే అంశంగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. టెలోమియర్స్‌ను పనిచేయకుండా ఆపే మందులు కూడా క్యాన్సర్‌తో పోరాడటంలో చర్యను చూపిస్తున్నాయి. అయితే క్యాన్సర్ కణాలు ప్రతిఘటనను అభివృద్ధి చేస్తాయి.

ఇదే పెద్ద ప్రశ్న
వృద్ధాప్యం మన కణాలు, జన్యువులపై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మనకు వయసు ఎందుకు వస్తుంది? అనేది అందరి మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్నలు. జాతుల నిరంతర పరిణామక్రమం కోసం ఇలా జరుగుతుందని ఒకప్పుడు భావించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. భూమిపై ఉన్న చాలా జీవజాతులు పూర్తి వృద్ధాప్యాన్ని చేరుకోలేదు. చాలా జంతువులు ఇతర మాంసాహారుల వల్ల, వ్యాధులు, వాతావరణ మార్పులు, ఆకలి కారణంగా చనిపోయాయి. కాబట్టి జంతువుల జీవితకాల అంతర్నిర్మిత పరిమితి పరిణామానికి ఇది అంత ముఖ్యం కాకపోవచ్చు.

Giloy Diadvantages: ఈ ఆయుర్వేద మూలికతో లివర్‌ ప్రాబ్లమ్స్.. పరిశోధకుల సంచలన వాస్తవాలు.. తప్పక తెలుసుకోండి..


వృద్ధాప్యం ఎందుకు వస్తుంది?
వృద్ధాప్యం అనేది సూర్యుడు నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలకు గురికావడం వల్ల కాలక్రమేణా వచ్చే దుష్ప్రభావమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వయసు పెరిగే కొద్ది జన్యువులు దెబ్బతింటాయని అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది నేరుగా వృద్ధాప్యానికి దారితీస్తుందని స్పష్టమైన నిరూపణలేదు. మరోక అవకాశం కూడా ఉంది. వృద్ధాప్యం క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మనల్ని రక్షించడానికి ఉద్భవించి ఉండవచ్చు. కణాలు కాలక్రమేణా జన్యుపరమైన నష్టాన్ని కూడగట్టుకుంటాయి. కాబట్టి ఈ నష్టం చివరకు కణాన్ని క్యాన్సర్‌గా మార్చడాన్ని ఎక్కువ కాలం కొనసాగకుండా ఈ ఏజింగ్ ప్రక్రియను అభివృద్ధి చేసి ఉండవచ్చు.

వయసులో ఉన్నప్పుడు శరీరంలోని కొన్ని కణాలు సెనెసెన్స్ అనే స్థితిలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియలో కణం సజీవంగా ఉంటుంది, కానీ విభజనను ఆపివేస్తుంది. జీవితకాలంలో ఈ సెనెసెంట్ కణాలు శరీరంలో పేరుకుపోతాయి. ముఖ్యంగా చర్మం, కాలేయం, ఊపిరితిత్తులు, ప్లీహంలలో రెండు రకాల ప్రభావాలను(ప్రయోజనకరమైన, హానికరమైన) కలిగి ఉంటాయి. ప్రయోజనకరంగా ఎలా ఉంటాయంటే దెబ్బతిన్న కణజాలాన్ని అవి సరిచేయడానికి సహాయపడే రసాయనాలను స్రవిస్తాయి. అయితే చాలా కాలం పాటు సెనెసెంట్ కణాల సంఖ్య పెరగడంతో అవి అవయవాలు, కణజాలాల సాధారణ నిర్మాణాన్ని భంగపరుస్తాయి. ఫలితంగా వృద్ధాప్య సమస్యలకు కారణం కావచ్చు.

మన జన్యువులు, కణాలు అవయవాలకు భౌతికంగా ఏం జరుగుతుందనే విషయం ఆధారంగా వృద్ధాప్యంలో జరిగే విషయాలను వివరించవచ్చు. అయితే వయసు ఎందుకు పెరుగుతుందనే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయి. ప్రస్తుతం మానవ జీవితకాలాన్ని పొడిగించాలని జెఫ్ బెజోస్ కంపెనీ చేస్తున్న పరిశోధన విజయం సాధించగలదో లేదో తెలియదు. కానీ వృద్ధాప్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఉత్తేజకరమైన కొత్త ఆవిష్కరణలు ఉద్భవిస్తాయని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: Ageing, Explained, Jeff Bezos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు