Jeff Bezos: జెఫ్​ బెజోస్​ అంతరిక్ష యాత్ర సక్సెస్​.. టేకాఫ్​కు ముందు భారత నెటిజన్లు ఏం వెతికారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

జెఫ్ బెజోస్, ఇతరులు

యాత్ర ప్రారంభమయ్యే 24 గంటల ముందు బ్లూ ఆరిజిన్​ సంస్థ గురించి, న్యూ షెపర్డ్ రాకెట్​లో ప్రయాణించే వారి గురించి గూగుల్​లో తెగ వెతికేశారు. ముఖ్యంగా భారతీయులు ఈ యాత్రపై ఎక్కువ ఆసక్తి కనబర్చారు. మన వాళ్లు ఎక్కువగా శోధించిన విషయమేంటో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

  • Share this:
ప్రపంచ కుబేరుడు జెఫ్​ బెజోస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయింది. 2000లో జెఫ్​ బెజోస్​ స్థాపించిన బ్లూ ఆరిజిన్​ సంస్థ నిన్న సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్​ రాకెట్​ను నింగిలోకి పంపింది. 11 నిమిషాల పాటు 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమిపైకి తిరిగి చేరుకుంది. న్యూ షెపర్డ్​ రాకెట్​లో జెఫ్​ బెజోస్​తో పాటు అతని సోదరుడు మార్క్​ జెబెస్​, 82 ఏళ్ల మహిళా పైలట్​ వేలీ ఫంక్​, 18 ఏళ్ల విద్యార్థి ఒలివర్​ డెమెన్​ రోదసిలోకి దూసుకెళ్లారు. ఈ న్యూషెపర్డ్​ రాకెట్​ భూమి నుంచి అంతరిక్షంగా భావించే కర్మన్​ లైన్​ను దాటి 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఆ తర్వాత వ్యోమనౌకలో ప్రయాణించిన నలుగురి బృందం అంతరిక్ష యాత్రను ముగించుకొని సురక్షితంగా భూమిని చేరుకున్నారు.

యాత్ర ప్రారంభమయ్యే 24 గంటల ముందు బ్లూ ఆరిజిన్​ సంస్థ గురించి, న్యూ షెపర్డ్ రాకెట్​లో ప్రయాణించే వారి గురించి గూగుల్​లో తెగ వెతికేశారు. ముఖ్యంగా భారతీయులు ఈ యాత్రపై ఎక్కువ ఆసక్తి కనబర్చారు. మన వాళ్లు ఎక్కువగా శోధించిన విషయమేంటో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే న్యూ షెపర్డ్ లాంచ్​ సమయంలో భారతీయులు ఎక్కువగా ‘జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ ఫోటో’ను సెర్చ్​ చేశారు. దీనితో పాటు, ఈ అంతరిక్ష యాత్రకు ఎంత ఖర్చవుతుందనే విషయంపై కూడా ఎక్కువగానే వెతికారు.

భూ వాతావరణం నుంచి దూరంగా వెళ్లి, సబ్​ ఆర్బిటాల్ స్పేస్​ నుంచి భూమి అందాలను చూడటంతో పాటు అక్కడ కొన్ని నిమిషాల పాటు జీరో గ్రావిటీని అనుభూతి చెందడమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టింది బ్లూ ఆరిజిన్​ సంస్థ. ఈ క్రమంలో బెజోస్​ అంతరిక్ష యాత్ర గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎంతో ఆసక్తి కనబర్చారు.

లారెన్ శాంచెజ్‌తో లివింగ్ రిలేషన్​షిప్​..

బెజోస్ తన మాజీ భార్య మాకెంజీ స్కాట్​తో విడాకులు తీసుకున్న తర్వాత లారెన్ శాంచెజ్‌తో లివింగ్​ రిలేషన్​షిప్​లో ఉన్నాడు. బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం, లారెన్​ శాంచెజ్ న్యూస్ రిపోర్టర్, యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ‘సో యు థింక్ యు కెన్ డాన్స్’ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఆమె 2016 లో బ్లాక్ ఆప్స్ ఏవియేషన్ అనే ఏరియల్​ ఫిల్మింగ్​ సంస్థను నెలకొల్పింది. అయితే బెజోస్ అంతరిక్ష​ యాత్ర కంటే ఎక్కువగా తన గర్ల్​ఫ్రెండ్​ ఫోటో కోసం భారతీయులు సెర్చ్​ చేయడం ఆసక్తికరంగా మారింది.
Published by:Krishna Adithya
First published: