Home /News /explained /

JANA SENA CHIEF PAWAN KALYAN READY TO CAMPAIGN IN VISAKHA MUNICIPAL ELECTIONS NGS

AP Municiapl elections: గ్రేటర్ విశాఖకు దారేది..? పవన్ అజ్ఞాతవాసం వీడేదెలా?

పవన్ కల్యాణ్ Photo : Twitter

పవన్ కల్యాణ్ Photo : Twitter

ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి, బీజేపీతో పొత్తు లాభించకపోగా, పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన గొంతు వినిపించేవారు . బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది.

ఇంకా చదవండి ...
  జనసేన అధినేత పవన్ ను మున్సిపల్  ఎన్నికల కష్టాలు వెంటాడుతున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు పోటా పోటీ ప్రచాలతో దూకుడుగా దూసుకెళ్తున్నాయి.. పవన్ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా గ్రేటర్ విశాఖ ప్రచారానికి పవన్ రాలేకపోతుండడం పై జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పొత్తు మేలు చేయకపోగా పార్టీకి మరింత నష్టం చేసిందని మండిపడుతున్నారు...

  ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. శుక్రవారం విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్ కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీలు కార్మికుల పక్షాన నిలిచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం బంద్ కు మద్దతు తెలిపినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంద్ విషయంలో నోరెత్తలేదు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరిని కూడా స్పష్టం చేయలేయలేకపోతున్నారు.

  స్టీల్ ప్లాంట్ పై పవన్ నోరు మెదపకపోతే విశాఖలో నష్టం తప్పదని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు. ఓటమి పాలైనా భాగానే ఓట్లు పోలయ్యాయి. గాజువాక తో పాటు విశాఖ వ్యాప్తంగా ఉన్న యువతలో పవన్ పై మంచి క్రేజ్ ఉంది. దీంతో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో సత్తా చాటొచ్చని.. బీజేపీ పొత్తు కూడా తమకు కలిసి వస్తుందని మొదట భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

  ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి, బీజేపీతో పొత్తు లాభించకపోగా, పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన గొంతు వినిపించేవారు . బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది . బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన విశాఖ ఉక్కు కార్మికులకు అండగా తన స్టాండ్ ను ప్రకటించ లేకపోతున్నారు.

  స్టీల్ ప్లాంట్ పై ఎదో ఒకటి మాట్లాడకుండా ప్రచారానికి వెళ్తే ఇబ్బందులు తప్పవు.. ప్రజల నుంచి నిరసన గళం వినిపిస్తుంది. కార్మిక సంఘాలు సైతం ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. అలా అని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని పవన్ చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలో కేంద్రం పెద్దలను పవన్ విమర్శించలేరు.. వారిని విమర్శించకుండా గాజువాక లాంటి ప్రాంతాల్లో ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని ఆ పార్టీ కేడర్ భావిస్తోంది. అందుకే జనసేన అధినేత ప్రచారం ఆలస్యమవుతున్నట్టు సమాచారం. అయితే ఈ నెల 8న పవన్ విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

  మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మార్పు తెచ్చేందుకే బీజేపీతో కలిశామని పవన్ ‌అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా వైసీపీ దౌర్జన్యాలు చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు జనసైనికులు ఎదురు నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు ఉన్నా జనసైనికులు ఎన్నికల బరిలో నిలిచారని పేర్కొన్నారు. మార్పు కోసమే యువత ధైర్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని చెప్పారు. పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును నచ్చిన పథకాల పేరుతో పంచుతున్నారని పవన్‌ ఆక్షేపించారు. అర్హులకు పింఛన్లు, పథకాలు ఆపడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రశ్నించకపోతే రాష్ట్రంలో దారుణాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయని.. వైసీపీకి ఓటేస్తే ప్రజలను యాచకులుగా మారుస్తారని వ్యాఖ్యానించారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap local body elections, Bjp-janasena, Janasena, Municipal Elections, Pawan kalyan, Vizag Steel Plant

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు