• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • ISRO HAS COMPLETED THE DEVELOPMENT OF A RADAR CAPABLE OF PRODUCING EXTREMELY HIGH RESOLUTION IMAGES FOR A JOINT EARTH OBSERVATION SATELLITE MISSION WITH THE NASA SSR GH

NISAR: నాసాతో జతకట్టి ‘నిసార్’​ను అభివృద్ధి చేసిన ఇస్రో.. వచ్చే ఏడాది శ్రీహరికోట నుంచి ప్రయోగం

NISAR: నాసాతో జతకట్టి ‘నిసార్’​ను అభివృద్ధి చేసిన ఇస్రో.. వచ్చే ఏడాది శ్రీహరికోట నుంచి ప్రయోగం

ప్రతీకాత్మక చిత్రం

ఈ క్రమంలోనే ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్​ అండ్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​ (నాసా)తో సంయుక్తంగా రూపొందిస్తున్న ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​ మిషన్​ కోసం హైరిజల్యూషన్​ చిత్రాలు తీసేందుకు...

  • Share this:
అంతరిక్ష పరీక్షల్లో చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు క్వాడ్​ భాగస్వామ్య దేశాలు కలిసి పనిచేయనున్నాయి. దీని కోసం అమెరికా, భారత్​, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు రక్షణ రంగంలోనే కాకుండా అంతరిక్ష రంగంలోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. వాతావరణ మార్పుల నియంత్రణతో పాటు, భవిష్యత్​ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్​ అండ్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​ (నాసా)తో సంయుక్తంగా రూపొందిస్తున్న ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​ మిషన్​ కోసం హైరిజల్యూషన్​ చిత్రాలు తీసేందుకు సింథటిక్​ అపెర్చర్​ రాడార్(సార్​)​ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. అయితే, అమెరికాకు చెందిన నాసా, భారత్​కు చెందిన ఇస్రో కలిసి ఉమ్మడిగా ఈ ప్రాజెక్టు చేపట్టినందున.. ఆ రెండు పేర్లు కలిసి వచ్చేలా ‘నిసార్’​ అనే పేరు పెట్టారు. దీన్ని 2022 ప్రథమార్థంలో ఆంధ్రప్రదేశ్​లోని శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్నారు. అడ్వాన్స్​డ్ రాడార్​ ఫోటోల ద్వారా భూ ఉపరితలంపై జరుగుతున్న మార్పులు, తదనంతరం సంభవించే పరిణామాలను లెక్కించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. మంచు కరిగి కరిగి పోవడం నుంచి భూకంపాలు, సునామీలు, అగ్రిపర్వతాలు, కొండచరియలు విరిగిపడటాలు మొదలగు ఉపద్రవాలకు కారణాలు, ఈ ప్రాంతాల్లో పర్యావరణ మార్పులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని నిసార్​ సమకూరుస్తుంది. మూడేళ్ల మిషన్ సమయంలో ప్రతి 12 రోజులకు ఒకసారి ప్రపంచాన్ని ఇది స్కాన్ చేస్తుంది. భూ గ్రహంపై ఉన్న అపూర్వమైన దృశ్యాలను చేరవేస్తుంది. తద్వారా కొన్నేళ్ల పాటు భూ ఉపరితలంలో వస్తున్న మార్పులు, అనంతర పరిణామాలను బాగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది.

నిసార్ అంటే ఏమిటి?
ఇది ఒక SUV- పరిమాణ ఉపగ్రహం. దీనిని అమెరికా, భారతదేశ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. నిసార్​ ప్రయోగానికి సంబంధించి నాసా, ఇస్రోల మధ్య 2014 సెప్టెంబర్‌ 30న భాగస్వామ్య ఒప్పందం జరిగింది. కాగా, భూ ఉపరితలంపై 0.4 అంగుళాల కంటే చిన్న​ వైశాల్యం గల ప్రాంతంలో కూడా సంభవించే మార్పులను ఇది పసిగట్టగలదు. అందుకోసం దీనిలో రెండు వైవిధ్యమైన ఫ్రీక్వెన్సీలు (ఎల్​ బ్యాండ్​, ఎస్​ బ్యాండ్​) ఉపయోగిస్తున్నారు. ఇలా రెండు ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తున్న మొట్టమొదటి శాటిలైట్​ మిషన్​ ‘నిసార్’​ కావడం విశేషం. ఈ ప్రయోగంలో భాగంగా స్పేస్​ క్రాఫ్ట్ బస్​, ఎస్​ బ్యాండ్​ రాడార్​, ల్యాండ్​ వెహికిల్​, నిసార్​ లాంచ్​కు కావల్సిన ఇతర సేవలను కూడా ఇస్రోనే అందిస్తుంది. ఎల్​ బ్యాండ్​ సార్​, కమ్యూనికేషన్​ కోసం సైన్స్​ డేటా సబ్​ సిట్టమ్​, అత్యంత భద్రంగా ఉండే రికార్డర్​, పేలోడ్​ డేటా సబ్​ సిస్టమ్​లను నాసా సమకూర్చుతుంది.

ఈ మిషన్​ ప్రతి ఆరు రోజులకు ఒక భూ ప్రదక్షిణ పూర్తి చేస్తుందని, ఈ సమయంలో భూమి, మంచు ఉపరితలాల్లో మార్పులను క్షుణ్నంగా పరిశీస్తుందని నాసా తెలిపింది. భూమిని కారు మబ్బులు కమ్మేసినా, చిమ్మచీకటి అలిమేసినా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమాచారాన్ని సేకరించి విశ్లేషించేలా నిసార్​ను రూపొందిస్తున్నామని నాసా వెల్లడించింది. తద్వారా, భూపరితలంపై ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ విపత్తులను ఎదుర్కొవడానికి, భూ ఉపరితల మార్పులను తట్టుకునేలా సిద్ధం కావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా వెల్లడించింది.
First published: