Whatsapp: వాట్సాప్​ చాటింగ్​ నిజంగా సేఫేనా?..డేటా భద్రతపై అనుమానాలు?..ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్​ ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. వాట్సాప్​ యూజర్ల డేటా లీకవుతోందని, యూజర్ల ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారిందని అనేక మంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు.

  • Share this:
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్​ ఎంత పాపులారిటీ​ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్లకు పైగా వినియోగదారుల వాట్సాప్​ను ఉపయోగిస్తున్నారు. అటువంటి వాట్సాప్​ ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. వాట్సాప్(Whatsapp) యూజర్ల డేటా లీకవుతోందని, యూజర్ల (Users) ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారిందని అనేక మంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల సంచలనం రేపిన బాలీవుడ్(Bollywood) డ్రగ్స్​ వ్యవహారంలో​ సెలబ్రిటీల వాట్సాప్​ చాట్స్​ లీకవ్వడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతుండటంతో వాట్సాప్​ డేటా ప్రైవసీపై యూజర్లలో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

అయితే వాట్సాప్​ మాత్రం ఈ విమర్శలను కొట్టి పారేస్తుంది. తమ యూజర్ల డేటాను ‘ఎండ్ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​’ విధానంలో భ్రదపరుస్తామని, డేటా భద్రతపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని చెబుతోంది. అసలు ఈ ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? యూజర్ల డేటాను ఎలా భద్రపరుస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

* ఎండ్​ టు ఎండ్​ ఎన్‌క్రిప్షన్ ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్​ తమ యూజర్ల డేటా భద్రతకు ఉపయోగిస్తున్న ఎండ్​​ టు ఎండ్​ ఎన్​క్రిప్ట్​ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ అంటే మెసేజ్​ పంపిన వ్యక్తి, రిసీవ్​ చేసుకున్న వ్యక్తి మాత్రమే ఈ మెసేజ్​ను చూడగలరని అర్థం. వారి ప్రమేయం లేకుండా ఇతరులు ఎవరూ ఈ మెసేజ్​లను చదవలేరు. ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ద్వారా మెసేజ్​లు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్​లు, డాక్యుమెంట్లు, కాల్స్​ ఇలా ప్రతిదీ భద్రంగా ఉంటుంది. యూజర్ల విలువైన డేటా ఇతర వ్యక్తుల చేతుల్లో పడకుండా కాపాడుతుంది. తద్వారా, యూజర్ల డేటా ప్రైవసీకి పెద్దపీట వేస్తుంది.

ఈ విషయంపై వాట్సాప్​ ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ‘‘వాట్సాప్​లోని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్​ యూజర్ల డేటాకు భద్రతనిస్తుంది. మెసేజ్​ను పంపిన, రిసీవ్​ చేసుకున్న వ్యక్తులు తప్ప మూడో వ్యక్తి డేటా యాక్సెస్​ చేయకుండా నిరోధిస్తుంది. ఆఖరికి, మా మాతృ సంస్థ అయిన ఫేస్​బుక్​ సైతం యూజర్ల డేటాను యాక్సెస్​ చేయలేదు." అని శ్వేతపత్రంలో పేర్కొంది.

వాట్సాప్​ మెసేజ్​ ఎన్​క్రిప్షన్​, డిక్రిప్షన్​ అనేవి పూర్తిగా యూజర్​ డివైజ్​లోనే జరుగుతాయి. యూజర్​ మెసేజ్​ పంపిన వెంటనే అది క్రిప్టోగ్రాఫిక్​ లాక్​తో మరింత భద్రపడుతుంది. వెంటే మెసేజ్​ అందుకునే యూజర్​ కీ జనరేట్ అవుతుంది. ఇలా ప్రతి వాట్సాప్​ మెసేజ్​కు ఆటోమేటిక్​గా కీ మారిపోతుంటుంది. ఇదంతా బ్యాక్​ గ్రౌండ్​ చాట్​లో జరిపోతుంటుంది. మీ డివైజ్​లోని సెక్యూరిటీ కోడ్​ని వెరిఫై చేసుకోవడం ద్వారా మీ చాట్స్​ మొత్తం ప్రొటెక్ట్​ చేసినట్లుగా నిర్థారించుకోవచ్చు. ఎండ్​ టు ఎండ్​ ఎన్‌క్రిప్షన్ అనేది 2013లో ఓపెన్ విస్పర్ సిస్టమ్స్ కంపెనీ అభివృద్ధి చేసిన క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్.

* చాట్‌లు ఎలా లీక్ అవుతాయి?
వాట్సాప్​ చెబుతున్నట్లు యూజర్ల డేటాకు భద్రత ఉంటే.. మరి చాట్​ హిస్టరీ ఎలా లీక్​ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రీసెంట్​​గా బాలీవుడ్​ నటి అనన్య పాండే, షారుఖ్​ ఖాన్​ కుమారుడు ఆర్యన్​ ఖాన్​తో చేసిన వాట్సాప్​ చాటింగ్​ కూడా లీకైంది. ఈ చాటింగ్​ను ఆధారంగా చేసుకొనే అనన్య పాండేకు ఎన్​సీబీ సమన్లు జారీ చేసింది. ఈ సంఘటనలన్నీ చూస్తే.. వాట్సాప్​ చెబుతున్నట్లు నిజంగా మెసేజ్​లు ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్ట్​ అవుతున్నాయా? అనే దానిపై సందేహం కలగక మానదు.

నిజంగా చాట్​ సెక్యూరిటీ ఉంటే.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాట్సాప్​ సంభాషణ మీడియా లేదా ఇతర వ్యక్తులకు ఎలా లీక్​ అవుతుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే రియా చక్రవర్తి, ఆర్యన్ ఖాన్ వంటి బాలీవుడ్ ప్రముఖుల చాట్‌లు లీక్​ అవ్వలేదని, వాటిని భారతీయ చట్టాలకు లోబడి ఎన్​ఫోర్స్​మెంట్​ విచారణలో భాగంగా అధికారులు సేకరించారని వాట్సాప్​ క్లారిటీ ఇచ్చింది. యూజర్ల వాట్సాప్​ డేటా ఎట్టిపరిస్థితుల్లోనే లీక్​ అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అయితే, స్క్రీన్​ షాట్​చాటింగ్​ ఫోటోలు లీకయ్యే అవకాశం ఉందని, దానికి వాట్సాప్​కు సంబంధం లేదని వాదిస్తోంది.

Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

* విచారణలో భాగంగా నిందితుల వాట్సాప్​ డేటా తీసుకునే అధికారముందా?
కొన్ని కీలక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్‌ కంపెనీకి మధ్య నిరంతరం గొడవలు జరుగుతున్నాయి. నేరాలు అరికట్టడంలో, కేసుల దర్యాప్తులో వాట్సాప్​ చాట్​ హిస్టరీ కొన్ని సార్లు కీలకంగా పనిచేస్తుంది. అయితే, విచారణలో భాగంగా లా ఎన్​ఫోన్స్​మెంట్​ అధికారులు నిందితుల వాట్సాప్​ డేటా కోరగా.. వాట్సాప్​ పలుమార్లు ససేమిరా అంది. తమ యూజర్ల డేటా తమకు ముఖ్యమని విచారణ పేరుతో దాన్ని బయటపెట్టలేమని వాదించింది.

అయితే భారతీయ చట్టాల ప్రకారం, విచారణలో చాట్​ హిస్టరీ కీలకం అయితే ఆయా కంపెనీలు నిందితుల డేటాను అధికారులకు అందజేయాలి. ఈ రెండు సంఘర్షణల మధ్య వాట్సాప్​ డేటా ప్రైవసీపై స్పష్టత కొరవడింది. వాట్సాప్​ ఎఫ్​ఏక్యూ పేజీలో కూడా తమ యూజర్ల కంటెంట్​ అధికారులతో షేర్​ చేస్తామని ఎక్కడా పేర్కొనలేదు.
Published by:Kishore Akkaladevi
First published: