Punjab CM: గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను తలపించిన పంజాబ్ రాజకీయం.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై చివరి వరకు సస్పెన్స్

రాహుల్ గాంధీతో పంజాబ్ నేతలు

Punjab Politics: 2022 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పంజాబ్‌లో విజయం సాధించాలంటే.. జాట్ సిక్కు కాకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావించి.. చివరి నిమిషంలో.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించింది.

  • Share this:
Aman Sharma

గత రెండు రోజుల నుంచి పంజాబ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో.. అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్న వేళ.. చివరకు ముఖ్యమంత్రి పీఠం చరణ్ జిత్ సింగ్ చన్నీకి దక్కింది. అయితే ఇదంతా గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ వంటి థ్రిల్లర్‌ను తలపించింది.

అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన 24 గంటల్లో పంజాబ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన రాజీనామా చేసిన 24 గంట్లో కొత్త సీఎం పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చరణ్ జిత్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించడానికి మధ్య చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. సునీల్ జఖర్, సుఖ్‌జీంద‌ర్‌ సింగ్ రంధావా, రాజేందర్ కౌర్ భట్టల్ లాంటి సీనియర్ నేతల పేర్లు కూడా ముఖ్యమంత్రి రేస్ లో వినిపించాయి. కానీ.. వాళ్లెవరికీ ముఖ్యమంత్రి పీఠం దక్కలేదు.

మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జఖర్ ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారు అయినట్టే అని అందరూ భావించినా.. సామాజిక వ‌ర్గాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయన్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. జాట్ సిక్కు అయితేనే బెటర్ అనే వాదనను మంత్రి సుఖ్‌జీంద‌ర్‌ సింగ్ తెరమీదికి తీసుకురావడంతో మరికొందరి పేర్లు వినిపించాయి. చివరకు సుఖ్‌జీంద‌ర్‌ సింగ్‌నే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి.

అకాలీదళ్ మీద విరుచుకుపడాలన్నా.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా.. ఆయన అయితేనే కరెక్ట్ అని అధిష్ఠానం కూడా భావించినా.. ఆయనకు పెద్దగా ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు. అయినప్పటికీ.. చంఢీఘడ్‌లోని మారియట్ హోటల్‌లో పార్టీ ముఖ్యులు అందరూ రంధావానే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం ప్రారంభించారు.

ఇంతలో పీసీసీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ఎంటర్ అయి.. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా అని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. జాట్ సిక్కులలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా ఉండాలని.. అది తానే అయితే బెటర్ అని రంధావా నిర్ణయించుకోవడాన్ని సిద్ధూ తప్పు పట్టారు. 2022 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పంజాబ్‌లో విజయం సాధించాలంటే.. జాట్ సిక్కు కాకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావించి.. చివరి నిమిషంలో.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. సీనియర్ నేత మన్ ప్రీత్ బాదల్.. చన్నీని పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో.. ఒక్కసారిగా పంజాబ్ రాజకీయాలు మారిపోయాయి.

Green Chilli: పచ్చి మిర్చిను దూరం పెడుతున్నారా ?..ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు

Revanth Reddy: యముడి గెటప్‌లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

పంజాబ్ లో కేవలం 20 శాతం మాత్రమే ఉన్న జాట్ సిక్కు సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు అవుతూ వస్తున్నారు. కానీ.. పంజాబ్‌లో ఎస్సీ సామాజిక వర్గం 30 శాతానికి పైనే ఉంది. ఆ వర్గం ఓటర్లను సంతృప్తి పరచడం కోసం.. మరోవైపు బీఎస్పీ పార్టీతో అకాలీదళ్ జట్టు కట్టడం, బీజేపీ కూడా ఎస్సీ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆ వర్గం ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు.. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో చరణ్ జిత్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించాల్సి వచ్చింది.
Published by:Kishore Akkaladevi
First published: