Home /News /explained /

IS NORTH KOREA KIM JONG UN CREATING TENSION WITH NUCLEAR POT WHAT WE NO SO FAR BA GH

Explained: ఉత్తర కొరియాలో మళ్లీ అణ్వాయుధ కార్యకలాపాలు.. అక్కడ ఏం జరుగుతోందంటే..

కిమ్ జోంగ్ ఉన్

కిమ్ జోంగ్ ఉన్

North Korea Nuclear Power | ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యకలాపాలకు తెరలేపడంతో ప్రతిస్పందనగా యూఎస్, యూఎన్, ఇతర దేశాల అనేక ఆంక్షలను విధించాయి. కానీ ఉత్తర కొరియా దేశం ఇవేమీ పట్టనట్లుగా యూఎన్ భద్రత నియమాలను ఉల్లంఘిస్తోంది.

ఉత్తర కొరియా (North Korea) మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం, ఈ దేశం అణ్వాయుధాల కార్యకలాపాలను  (Nuclear Weapon) పునఃప్రారంభించడమే. సామూహిక వినాశనం సృష్టించే ఆయుధాల తయారీపై ఆంక్షలు విధించినప్పటికీ ఉత్తర కొరియా మాత్రం తలపొగరుతో అణ్వాయుధాల తయారుచేయడానికి పనులు చేపడుతోంది. ఈ దేశం తన ప్రధాన అణు సముదాయం వద్ద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిందని ఐక్యరాజ్యసమితి  (United Nations) అణ్వాయుధాల సంస్థ వాచ్‌డాగ్ పేర్కొంది. తమ దేశంపై విధించిన ఆంక్షలు ఎత్తివేయమని పరోక్షంగా ప్యాంగ్యాంగ్ హెచ్చరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

నార్త్ కొరియా ఏం చేస్తోంది?
ఉత్తర కొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి కీలకంగా ఉన్న యాంగ్‌బియాన్ ఎక్స్‌పరిమెంటల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అణు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనించామని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ఆగస్టులో ప్రచురించిన ఒక నివేదికలో పేర్కొంది.

Kim Jong Un: అయ్యో కిమ్‌కు ఏమైంది.. తలకు బ్యాండేజ్‌తో కనిపించిన ఉత్తర కొరియా అధినేత..ఈ ప్రదేశం దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌కు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ అణ్వాయుధాల కార్యక్రమాలు పునః ప్రారంభం అయ్యాయని IAEA వెల్లడించింది.

5MW రియాక్టర్ వద్ద 2018 డిసెంబర్ నుంచి జూలై 2021 వరకు రియాక్టర్ ఆపరేషన్ జరిగిందని చెప్పడానికి ఎలాంటి సూచనలు లేవని... కానీ జూలై 2021 నుంచి కూలింగ్ వాటర్ డిశ్చార్జ్‌తో సహా కొన్ని సూచనలు ఆపరేషన్ స్టార్ట్ అయిందని తెలుపుతున్నాయని IAEA వివరించింది.

ఫిబ్రవరి నుంచి జులై వరకు రేడియోకెమికల్ లాబొరేటరీలో కార్యకలాపాలు జరిగినట్టు తెలుస్తోందని తెలిపింది. రియాక్టర్ ప్లూటోనియంను యాంగ్‌బియాన్ ఉత్పత్తి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అణు ఆయుధాలను తయారు చేయడానికి ఉపయోగించే రెండు కీలకమైన పదార్థాల్లో ఒకటి.

ఉత్తర కొరియా అణు కార్యకలాపాలు కొనసాగించడమనేది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని IAEA వ్యాఖ్యానించింది. రియాక్టర్ల నుంచి తీసివేసిన ఇంధన రాడ్లను ప్లూటోనియమ్‌గా రీ-ప్రాసెస్ చేయడానికి ప్రస్తుతం ఉత్తర కొరియాలో పనులు కొనసాగుతున్నాయని IAEA నివేదించింది.

కరోనా కాలంలో ఉత్తర కొరియా అణ్వాయుధాలను ఎందుకు తయారు చేస్తోంది? 
కరోనా విజృంభించగానే ఉత్తర కొరియా దేశం తన సరిహద్దులన్నీ మూసివేసింది. పొరుగు దేశం చైనాతో కూడా పూర్తిస్థాయిలో సంబంధాలు తెంచుకుంది. వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. ఇక తుఫాన్లు, వరదలతో దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడింది. దాంతో ఆర్ధిక సంక్షోభం ఎదుర్కోవడం అనివార్యమైంది.


నిజానికి దీని నుంచి కోలుకోవడం ఉత్తరకొరియాకి సులువైన పని కాదు. దాంతో అణు కార్యక్రమాన్ని పునఃప్రారంభించి ప్రపంచాన్ని బేరసారాలకు తీసుకురావాలని దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఈ విధంగా చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

దేవుడా..బొద్దుగా ఉండే కిమ్ ఇలా గుర్తుపట్టలేకుండా ఉన్నాడేంటి..? అతని వాచ్ ధర ఎంతో తెలుసా..?అయితే గతంలోని దక్షిణ కొరియా, యూఎస్ మిలిటరీ చర్యలకు ప్రతిస్పందనగా ప్యాంగ్యాంగ్‌ ఈ చర్యలను చేపట్టి ఉండొచ్చని మరి కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తర కొరియాలో న్యూక్లియర్ పవర్‌ప్లాంట్ ఎంత పెద్దది?
ఖండాంతర క్షిపణుల నుంచి థర్మోన్యూక్లియర్ పరికరాల వరకు తమ వద్ద ఉన్నాయని దేశరాజధాని చెబుతోంది. కానీ వాస్తవంగా దాని ఆయుధాగారం గురించి ఎలాంటి స్పష్టత లేదు. అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగించే ఒప్పందం నుంచి వైదొలిగి మరింత అధునాతన అణు ఆయుధాలను పొందాల్సిన ఏకైక దేశం ఉత్తర కొరియానే అని న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ సంస్థ తెలిపింది.

ఇది 2006, 2009, 2013, 2016, 2017 సంవత్సరాల్లో న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో చివరిది థర్మోన్యూక్లియర్ పరికరం/ హైడ్రోజన్ బాంబును ప్రయోగించినట్లు దేశం వెల్లడించింది.

పోర్న్ వీడియో చూస్తూ అడ్డంగా బుక్కైన బాలుడు..కిమ్ ఏం శిక్ష వేశాడో తెలుసా..

కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CRF).. ప్యాంగ్యాంగ్‌ 20-60 అణు ఆయుధాలను కలిగి ఉండవచ్చని చెబుతోంది. ఉత్తర కొరియాలో 65 అణు ఆయుధాలకు సరిపడా ఆయుధ వనరులు ఉన్నాయని యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు 2018లో పేర్కొన్నారు. వీటితో 12 అదనపు ఆయుధాల ఉత్పత్తి చేయవచ్చని అధికారులు తెలిపారు.

షార్ట్, మీడియం, ఇంటర్మీడియట్- ఇంటర్‌కాంటినెంటల్-రేంజ్, సబ్ మేరైన్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయని సమాచారం. అమెరికాను దెబ్బతీసే సామర్థ్యం వీటికి ఉందని ఆ దేశ నాయకులు చెబుతున్నారు.

అణు చర్చలు, శాంతి చర్చల ప్రస్తుత స్టేటస్ ఏమిటి?
ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యకలాపాలకు తెరలేపడంతో ప్రతిస్పందనగా యూఎస్, యూఎన్, ఇతర దేశాల అనేక ఆంక్షలను విధించాయి. కానీ ఉత్తర కొరియా దేశం ఇవేమీ పట్టనట్లుగా యూఎన్ భద్రత నియమాలను ఉల్లంఘిస్తోంది.

ఈ విషయంలో ప్రపంచ దేశాలకు మాటిచ్చిన ఉత్తర కొరియా తన మాటలకు కట్టుబడి ఉండడం లేదు. జో బైడెన్ ఉత్తర కొరియా దేశానికి ఎలాంటి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వనని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మరింత రెచ్చిపోతోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Kim jong un, North Korea

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు