Home /News /explained /

IS NATO READY TO FACE PUTINS ACTIONS IS NATO AFRAID OF RUSSIA FULL DETAILS HERE GH VB

NATO Vs Putin: పుతిన్‌ చర్యలను ఎదుర్కొనేందుకు నాటో సిద్ధమా..!నాటో రష్యాకు భయపడుతోందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్చి 12న పోలాండ్(Poland) సరిహద్దుకు 18 కి.మీ. దూరంలోని ఉక్రెయిన్‌(Ukraine) యావోరివ్ సైనిక స్థావరంపై రష్యా(Russia) దాడులు నిర్వహించింది. నాటో దేశాల సమీపానికి రష్యా దాడులు చేరడంతో మూడో ప్రపంచ యుద్ధ భయాలు మొదలయ్యాయి. యావోరివ్‌పై దాడుల తర్వాత నాటో సభ్య దేశాలపై త్వరలో రష్యా దళాలు దాడి చేస్తాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించాడు.

ఇంకా చదవండి ...
మార్చి 12న పోలాండ్(Poland) సరిహద్దుకు 18 కి.మీ. దూరంలోని ఉక్రెయిన్‌(Ukraine) యావోరివ్ సైనిక స్థావరంపై రష్యా(Russia) దాడులు నిర్వహించింది. నాటో దేశాల సమీపానికి రష్యా దాడులు చేరడంతో మూడో ప్రపంచ యుద్ధ భయాలు మొదలయ్యాయి. యావోరివ్‌పై దాడుల తర్వాత నాటో సభ్య దేశాలపై త్వరలో రష్యా దళాలు దాడి చేస్తాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించాడు. యుద్ధంలో ఉక్రెయిన్‌ ఓడిపోతే యూరప్‌ మొత్తం కూడా ఓడిపోయినట్లేనని జెలెన్ స్కీ పేర్కొన్నాడు.

మూడో ప్రపంచ యుద్ధానికి నాటో సిద్దమా..?
తమ దేశాలను నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదే పదే కోరాడు. రష్యాతో ప్రత్యక్ష వివాదం ఎందుకని యూఎస్‌, నాటో మిత్రదేశాలు నిరాకరించాయి. నో-ఫ్లై జోన్‌ ఏర్పాటు చేస్తే ప్రపంచవ్యాప్తంగా వందల కొద్దీ విమానాలను స్థావరాలకు తరలించాల్సి ఉంటుంది. నో-ఫ్లై జోన్ ఏర్పాటుకు వారాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇంతలో రష్యా ప్రతిఘటన తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటో నో -ఫ్లై జోన్‌ అమలు చేస్తే రష్యా విమానాలను కూల్చివేయడంతో సమానమని నిపుణులు అంటున్నారు.

Explained: ఎక్కువ మంది ఉక్రెయిన్‌ శరణార్థులను అమెరికా ఎందుకు అనుమతించట్లేదు..? దీని వెనుక ఉన్న కారణాలు ఏవి..?


ఉక్రెయిన్ గగనతలాన్ని రక్షించేందుకు రష్యా యాంటీ-ఎయిర్‌ఫోర్స్‌ డిఫెన్సెస్‌ను ఎదుర్కోవాలంటే నాటో యుద్ధ విమానాలు కూడా అవసరం. రష్యా, బెలారస్‌ భూభాగాల్లో మోహరించిన కొన్ని ఎయిర్‌- డిఫెన్స్‌ సిస్టెమ్స్‌ను తొలగించాల్సిన అవసరం ఉంటుంది. వాటిని తొలగించాలంటే గ్రౌండ్‌ వార్‌కు నాటో దిగాల్సిందేనని, అందుకు ఇంకా ఆ దేశాలు సిద్ధం కాలేదని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు ఐరోపాలో యుద్ధం జరుగుతున్న సమయంలో అవసరమైన స్థాయిలో నాటో సిద్ధంగా లేదని విశ్లేషణలు వస్తున్నాయి.

గ్రౌండ్‌ ఫోర్సెస్‌లో రష్యా వర్సెస్‌ నాటో..
యూఎస్‌, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ సహా ఐరోపాలో 74,000 మంది సైనికులు ఉన్నారు. జర్మనీలో మాత్రమే 36,000 యూఎస్‌ సైనిక దళాలు ఉన్నాయి. వారంతా ఫ్రంట్‌ లైన్‌ ఫైటర్స్‌ కాదు.. లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ , ఇతర పనుల్లో పాల్గొనే సైనికులు. ఫ్రంట్-లైన్ బాల్టిక్ దేశాలలో ఉన్న 40,000 మంది బలమైన నాటో సైనికులు ఉన్నారు. ఉక్రెయిన్‌లో మోహరించిన రష్యన్ బలగాల సంఖ్య దాదాపు 190,000.. నాటో దళాల బలం కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. రష్యా స్టాండింగ్ ఆర్మీలో 900,000 మంది క్రియాశీలక సైనికులు ఉన్నారు. రష్యాను ఎదుర్కోవాలంటే కనీసం 100,000 మంది సైనికులను యూఎస్‌ నుంచి ఐరోపాకు తరలించాల్సి ఉంటుంది. అయితే నాటో తమ ఆయుధాలు, పరికరాలు, లాజిస్టిక్స్‌ను పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Holika Dahan: హోలీ వేడుకలకు సిద్ధమవుతున్న భారతీయులు.. పూజా పద్ధతులు, శుభ గడియల వివరాలు..


నాటో ఎందుకు భయపడుతోంది..?
సైనికులతో కూడిన యూఎస్‌ నౌకలు ఐరోపాలో స్థావరాలకు చేరాలంటే 3,000 మైళ్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సైనికుల తరలింపుకు 2-3 నెలల సమయం పడుతుందని, కదలికలను ఉపగ్రహాల ద్వారా రష్యా పసిగడుతుందని నిపుణులు చెబుతున్నారు. నాటో యుద్ధ విమానాలను సమీపించే ముందే పుతిన్ దాడులకు ఆదేశిస్తాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యుద్ధ సమయంలో రష్యా దళాలు ఉక్రెయిన్ లో నిలిచిపోయాయి. దీంతో రవాణా సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. అణ్వాయుధాలను పుతిన్‌ ఆశ్రయిస్తే, ఐరోపా దేశాలకు పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు