• Home
  • »
  • News
  • »
  • explained
  • »
  • IS COVID THIRD WAVE EFFECT ON KIDS HOW TO PROTECT KIDS FROM VIRUS SU GH

COVID and KIDS: పిల్లలకు నిజంగానే థర్డ్​వేవ్​ ముప్పు ఉందా? వైరస్​ నుండి వారిని ఎలా కాపాడుకోవాలి?.. మీ సందేహాలకు సమాధానాలు

ప్రతీకాత్మక చిత్రం

కరోనా థర్డ్ వేవ్ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలకు థర్డ్ వేవ్ ముప్పు ఉండనుందా..?, పిల్లలను వైరస్ బారి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తుండగా, రానున్న థర్డ్​ వేవ్​ ఎక్కువగా చిన్నారులపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదటి దశలో వైరస్​ వృద్ధులను టార్గెట్​ చేయగా, రెండవ దశలో ఎక్కువగా యువత కరోనా బారీన పడ్డారు. ఇక మూడో దశలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై వైరస్​ ప్రభావం ఉండనుందని అంచానా వేస్తున్నారు. రాబోయే థర్డ్​ వేవ్​ పిల్లలపైనే ఎందుకు దాడి చేయనుంది? పిల్లలు నిజంగానే కరోనా సంక్రమణ ప్రమాదంలో ఉన్నారా? దీనిలో వాస్తవమెంత? ఇటువంటి ప్రశ్నలకు నిపుణులు చెబుతున్న సమాధానాలు తెలుసుకుందాం.

1. కరోనా వైరస్ నాసోఫారింక్స్, ఊపిరితిత్తులు, పేగు, గుండె, మూత్రపిండాల కణాలపై ప్రబావాన్ని చూపుతుంది. ఇది ACE2 గ్రాహకం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. నాసోఫారెంక్స్, ఊపిరితిత్తుల్లో ACE2 గ్రాహకం వయస్సుతో పాటు పెరుగుతుంది. అందువల్ల, చిన్నపిల్లల్లో కరోనా సంక్రమణ అవకాశం తక్కువగా ఉంటుంది. ACE2 గ్రాహకం ద్వారా వైరస్​ శరీరంలోని కణాలలోకి ప్రవేశించిన తరువాత, ACE2 ఎక్స్​పాన్షన్​ తగ్గుతుంది. తద్వారా, ఇది తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది.

2. ఎండోథెలియం (రక్త నాళాల లోపలి పొర) సాంద్రత పిల్లల్లో, పెద్దల్లో భిన్నంగా ఉంటుంది. అందువల్ల, పిల్లలకు గుండెపోట వంటి త్రోంబోటిక్ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

3. సాధారణంగా చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పుట్టుకతోనే ఇవి అభివృద్ధి చెందుతాయి. వయస్సు పెరిగే కొద్ది రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల, చిన్నపిల్లలకు వైరస్​ సంక్రమణ ప్రమాదం చాలా తక్కువ. ఒకవేళ, కరోనా సోకినప్పటికీ, వారు మరణించే అంత ప్రమాదం ఉండదు. కరోనా సంక్రమణకు అడ్డుగా నిలిచే దీనిని కణాలను యాంటీబాడీ డిపెండెంట్ ఎన్‌హాన్స్‌మెంట్ (ADE) అని పిలుస్తారు. కరోనా సోకిన పిల్లల కంటే పెద్దల్లో ఈ ADE కణాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, పెద్లలకే కరోనా సంక్రమణ ప్రమాదం ఎక్కువ.

4. వృద్ధాప్యం రోగనిరోధక శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. వయసు పెరిగేకొద్ది రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. తద్వారా, వైరస్ సులభంగా​ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదే పిల్లల విషయానికి వస్తే.. వారిలో బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఫలితంగా వారికి వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

5. పిల్లల్లో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, సిఓపిడి వంటి వ్యాధులు సోకే అవకాశాలు చాలా తక్కువ. అదే పెద్దవారిలో అయితే, ఈ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. ఈ వ్యాధులు పెద్దవారిలో తీవ్రమైన కరోనా సంక్రమణకు దోహదం చేస్తాయి.

6. యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడేటివ్ లక్షణాలు గల విటమిన్ డి లోపం పిల్లలతో పోలిస్తే పెద్దలలో ఎక్కువగా ఉంటుంది. విటమిన్​ డి లోపం పెద్దల్లో కరోనా సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.

7. చిన్న పిల్లల్లో బ్యాక్టీరియా, వైరస్ వంటివి ఎక్కువ కాలం నిలిచి ఉండవు. అందువల్ల, వారిలో కరోనా సంక్రమణ ప్రమాదం తక్కువ.

8. యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ- ఆక్సిడేటివ్​ లక్షణాలు గల హార్మోన్ మెలటోనిన్ పిల్లల్లో అధిక స్థాయిలో ఉంటుంది. అదే వయస్సు పెరుగుతున్న కొద్ది ఈ లక్షణాలు తగ్గుతాయి. అందువల్ల, పెద్దలపై వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

9. చిన్న పిల్లలకు 5 ఏళ్ల వరకు పోలియో చుక్కలు వేస్తుంటారు. తద్వారా వారి శరీరంలో యాంటీబాడీలు పెంపొందుతాయి. ఫలితంగా వారి శరీరంలోకి వైరస్​ చొరబడే అవకాశాలు చాలా తక్కువ.

10. పెద్దలతో పోలిస్తే పిల్లలు చాలా తక్కువగా ఇంటి నుంచి బయటికి వెళ్తుంటారు. ప్రయాణాలు కూడా తక్కువగా చేస్తుంటారు. అందుకే, వారికి వైరస్​ సోకే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి.

పిల్లలను వైరస్​ సంక్రమణ నుండి ఎలా కాపాడుకోవాలి?
కరోనా నుంచి మనల్ని మనం ఎలాగైతే రక్షించుకుంటున్నామో పిల్లలు కూడా అవే జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలి. సామాజిక దూరం పాటించడం, ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచేలా ముసుగు ధరించడం, చేతులను శానిటైజ్​ చేసుకోవడం, రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు చెప్పాలి. ఎక్కువ మంది యువత, వృద్ధులు టీకాలు వేసుకోవడం ద్వారా వారి నుంచి పిల్లలకు వైరస్​ సంక్రమించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

(ఆర్టికల్​ రాసిన వారు.. డాక్టర్​ నికిత్​)
Published by:Sumanth Kanukula
First published: