Home /News /explained /

INTERNATIONAL DAY OF FORESTS 2021 WHY WE CELEBRATE GLOBAL FORESTS DAY ON MARCH 21 HERE IS THE HISTORY SIGNIFICANCE THEME AND CELEBRATION NK

International Forests Day 2021: అటవీ దినోత్సవ చరిత్ర, ప్రాధాన్యం, థీమ్, వేడుకలు

International Forests Day 2021: అటవీ దినోత్సవ చరిత్ర, ప్రాధాన్యం, థీమ్, వేడుకలు (File)

International Forests Day 2021: అటవీ దినోత్సవ చరిత్ర, ప్రాధాన్యం, థీమ్, వేడుకలు (File)

International Day of Forests 2021: అడవులకు సంబంధించి ఈ రోజును ఎందుకు కేటాయించారు? ఇవాళ ఏం చేస్తారు? ఈ సంవత్సరం థీమ్ ఏంటి? తెలుసుకుందాం.

  International Day of Forests 2021: నేడు అంతర్జాతీయ అడవుల దినోత్సవం. ఐక్యరాజ్యసమితి (United Nations - UNO) ప్రతి సంవత్సరం మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుతోంది. ఈ రోజున రకరకాల అడవులు, వాటివల్ల ఈ ప్రపంచానికి కలుగుతున్న ప్రయోజనాల్ని వివరిస్తోంది. ఈ భూమిపై అడవులే లేకపోతే... సకల జీవరాశి ఉండేదే కాదు. అడవుల వచ్చే ఆక్సిజన్‌ ద్వారానే మనం బతుకుతున్నాం. మనం వాడే వస్తువుల్లో 95 శాతం అడవుల నుంచి వచ్చేవే. సబ్బులు, షాంపూలు, మందులు, ఆహార పదార్థాలు అన్నింటికీ మూలం అడవులే. మనమే కాదు... జంతువులు, పక్షులు, క్షీరదాలు, క్రిమికీటకాలన్నీ అడవులపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. గ్రామాలు, తండాల్లో పేదరికాన్ని తగ్గించడంలో అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

  International Day of Forests 2021 theme:
  ప్రతి సంవత్సరం అటవీ దినోత్సవానికి ఓ ప్రత్యేక థీమ్‌ని కేటాయిస్తున్నారు. ఆ సంవత్సరమంతా ఆ థీమ్ అమలులో ఉంటుంది. ఈ సంవత్సరం అడవుల పునరుద్ధరణ (Forest restoration) అనే థీమ్ ఎంపికచేశారు. తద్వారా అన్ని దేశాలు, ప్రభుత్వాలూ... అడవుల్ని పెంచాలి. నరికేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కల్ని పెంచాలి. అవి చెట్లు అయ్యేలా కృషి చెయ్యాలి. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలి. లక్కీగా మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ అడవుల శాతం పెరుగుతోంది. అంటే ఈ థీమ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బాగా అమలవుతోందన్నమాట. అడవుల్ని పెంచడం, అటవీ ఉత్పత్తుల్ని సరైన మార్గంలో సేకరించడం ద్వారా... స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలన్నది కూడా ఈ సంవత్సరం థీమ్‌లో భాగంగా ఉంది.

  International Day of Forests 2021, global Forests Day 2021, international day of forests 2021 theme, international day of forests 2021 images, international day of forests 2021 logo, forest day 2021 theme, forest day in india, forest day world, అంతర్జాతీయ అడవుల దినోత్సవం, అటవీ దినోత్సవం, అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు,
  International Forests Day 2021: అటవీ దినోత్సవ చరిత్ర, ప్రాధాన్యం, థీమ్, వేడుకలు (File)


  International Day of Forests 2021 celebration:
  ఈ ప్రత్యేక దినోత్సవం రోజున ప్రపంచ దేశాలన్నీ ఓ పండుగలా దీన్ని జరుపుతాయి. ప్రజల్లో అడవుల పట్ల అవగాహన కల్పిస్తాయి. అలాగే స్కూళ్లలో అడవులపై విద్యార్థులకు కాంపిటీషన్లు, చిత్రలేఖనం, డిబేట్ల వంటివి నిర్వహిస్తాయి. అందరూ మొక్కలు నాటేలా, పెంచేలా ప్రోత్సహిస్తాయి. ఈ దిశగా ఐక్యరాజ్యసమితిలో భాగమైన అడవులు, ఆహారం, వ్యవసాయ సంస్థ (FAO)... ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. అడవుల్ని పెంచడానికి ఉన్న అవకాశాలను ప్రోత్సహిస్తుంది.

  International Day of Forests significance:
  ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాతావరణ మార్పులనేవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతోంది. వాతావరణంలో వేడి పెరిగిపోవడమే దీనికి కారణం. అదే మొక్కలు, చెట్ల సంఖ్యను పెంచితే... వాతావరణంలో కార్బన్ డై-ఆక్సైడ్‌ని మొక్కలు పీల్చేసుకుంటాయి. తద్వారా వేడి తగ్గి... భూమికి హాని జరగకుండా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలనే ఉద్దేశంతో ఈ అటవీ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

  ఇది కూడా చదవండి:Vastushastra: అదృష్టం తలుపు తట్టాలంటే... ఇంట్లో ఏనుగు బొమ్మను ఇలా ఉంచండి 

  అడవులు అన్నీ చేస్తున్నా జాలి లేని మానవుడు... తన స్వార్థం కోసం అడవుల్ని నరికేస్తున్నాడు. ఒకప్పుడు అడవులు ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు పట్టణాలు, నగరాలూ వచ్చేశాయి. నోరు లేని చెట్లు మానవుడి కబ్జా దాహానికి బలైపోతున్నాయి. దాని వల్ల కలిగే అనర్థాలు కూడా ఎక్కువగానే ఉన్నా... ప్రభుత్వాలు చేయాల్సినంత చెయ్యకపోవడం వల్ల అడవుల పరిరక్షణ అనేది సాధ్యం కావట్లేదు. లక్కీగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అడవుల్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Forest

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు