• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • INSURANCE POLICIES THESE 4 INSURANCE POLICIES APPLICABLE FOR COVID 19 DEATHS YOU CAN CLAIM HERE ARE THE DETAILS NK GH

Insurance Policies: కరోనా మరణాలకూ ఇన్సూరెన్స్... ఈ 4 పాలసీలనూ పరిశీలించండి

Insurance Policies: కరోనా మరణాలకూ ఇన్సూరెన్స్... ఈ 4 పాలసీలనూ పరిశీలించండి

కరోనా మరణాలకూ ఇన్సూరెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Insurance Policies: కరోనా మరణాలు చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కోవిడ్ మరణాలకూ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే... కొంతలో కొంతైనా ఆ కుటుంబాలు నిలదొక్కుకోగలవు. అలాంటి 4 పాలసీల వివరాలు చూద్దాం.

  • Share this:
కరోనా సెకండ్​వేవ్​ప్రజలను విపరీతంగా భయపెడుతోంది. ఇది ఆరోగ్యం మీదే కాదు... ఆర్థికంగానూ వ్యక్తులపై దాడి చేస్తోంది. దీంతో ఇన్సూరెన్స్​లకు ప్రాధాన్యం పెరిగింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి ఆర్థికంగా కొంతమేర ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. దీని ద్వారా పాలసీదారుడు మరణిస్తే వారి నామినికి బీమా మొత్తం వస్తుంది. అయితే, ఇవి కాకుండా అనేకమంది యాడ్-ఆన్ ప్లాన్లను కూడా తీసుకుంటుంటారు. కానీ, ఈ ప్లాన్లపై చాలా మందికి అవగాహన లేక క్లెయిమ్ చేసుకోరు. పూర్తి ఉచితంగా లేదా చాలా నామమాత్రపు ఛార్జీలతో వచ్చే ఈ పాలసీలేంటో తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా:
2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన ధన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా (PMJYB) పాలసీని కూడా ఆయన ప్రారంభించారు. దీని కింద నామమాత్రపు రుసుముతోనే ప్రతి బ్యాంక్ ఖాతాదారుడికీ జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించారు. అందువల్ల, దురదృష్టవశాత్తు మీ కుటుంబ సభ్యులు కరోనాతో మరణిస్తే.. వెంటనే వారి బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయండి. మే చివరి వారం లేదా జూన్ ఆరంభంలో రూ.330 ప్రీమియం డెబిట్​అయినట్లు మీరు స్టేట్​మెంట్స్‌లో గుర్తిస్తే, బ్యాంకును సంప్రదించి రూ.2 లక్షల బీమా మొత్తం క్లెయిమ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. 55 సంవత్సరాల వయసులోపు ఉన్న ఖాతాదారుల విషయంలోనే ఈ పథకం కింద బీమా క్లెయిమ్​కోరవచ్చు.

ఉద్యోగుల భవిష్యనిధి బీమా:
సాధారణంగా ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా కలిగి ఉంటారు. ప్రతి నెలా వారి జీతం నుంచి కొంతమేర ఈపీఎఫ్‌లో జమ అవుతుంది. అంతే మొత్తం సంస్థ జమచేస్తుంది. దీనిలో కొంత మొత్తం ఆటోమేటిక్‌గా ఎంప్లాయీ డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్‌లో ప్రీమియం కింద జమ అవుతుంది. ఒకవేళ, సదరు ఉద్యోగి మరణిస్తే అతని నామినీ రూ.2.5 నుంచి రూ.7 లక్షల వరకు బీమా క్లెయిమ్​చేసుకునే అవకాశం లభిస్తుంది. సాధారణంగా బీమా క్లెయిమ్ మొత్తం ఉద్యోగి నెలవారీ జీతానికి 10 నుంచి 12 రెట్లు ఉంటుంది. అయితే, ఉద్యోగి మరణించే సమయానికి అతని ఈపీఎఫ్ అకౌంట్​యాక్టివ్‌లో ఉండాలనే నిబంధన ఉంది. కాబట్టి, మీ కుంటుంబ సభ్యులు కరోనాతో మరణిస్తే వెంటనే ఫారం 5 IF ద్వారా ఈ మొత్తాన్ని క్లెయిమ్​చేసుకోవచ్చు.

SIP ఇన్సూరెన్స్:
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అనేక కంపెనీలు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ఉదాహరణకు ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ జీవిత బీమా కవర్‌తో కలిపి 'సిప్ ప్లస్' పాలసీని అందిస్తోంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సెంచరీ సిప్‌, PGIM ఇండియా మ్యూచువల్ ఫండ్ 'స్మార్ట్ సిప్', నిప్పాన్ ఇండియా 'సిప్ ఇన్సూరెన్స్' పాలసీలను అందిస్తుంది. ఇవి గ్రూప్ ప్లాన్లను కూడా అమలు చేస్తున్నాయి. వీటిలో చేరేందుకు ఎలాంటి ఆరోగ్య పరీక్షలూ అవసరం లేదు. గరిష్ట జీవిత బీమా కవరేజ్ మొత్తం రూ.50 లక్షల వరకు ఉంటుంది.

ఇది కూడా చదవండి: E-Bike: రూ.6తో 65 కి.మీ. మైలేజ్. ధర రూ.35,000... ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు ఇవీ

మొబైల్ కనెక్షన్లతో బీమా:
భారతి ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఉచిత జీవిత బీమా కవర్లను అందిస్తోంది. 18 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి రూ.179, రూ.279 ప్రీపెయిడ్​ప్యాకేజీలతో పాటే ఈ బీమా కవరేజీలు కూడా లభిస్తాయి. వీటి కోసం భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్ సంస్థలతో ఎయిర్​టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాన్లలో చేరిన వారు రూ.2 నుంచి 4 లక్షల జీవిత బీమా కవరేజీని పొందవచ్చు.
First published: