Home /News /explained /

INSTAGRAM HOW TO SEND SILENT MESSAGES ON INSTAGRAM STEP BY STEP PROCESS IS FOR YOU GH VB

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో సైలెంట్ మెసేజెస్ ఎలా పంపాలి..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల 'సైలెంట్ మెసేజెస్' అనే ఓ యూజ్‌ఫుల్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌ (DM)ల్లో ఎవరికైనా సైలెంట్/మ్యూటెడ్ మెసేజెస్ పంపించవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా యాప్‌లలో(Social Media App) ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఒకటి. ఫొటోలు, వీడియోలు, రీల్స్ షేర్ చేయడానికి ఇండియన్‌ యూజర్లు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఇండియన్స్ బాగా వాడే సోషల్ మీడియా(Social Media) యాప్‌ల్లో ఇన్‌స్టాగ్రామ్ టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది. అనేక అద్భుతమైన ఫీచర్లు ఆఫర్ చేయడం వల్లే ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లకొద్దీ యూజర్లు(Users) చేరిపోతున్నారు. అయితే ఇంకా ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకునేందుకు తరచూ సరికొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల 'సైలెంట్ మెసేజెస్' అనే ఓ యూజ్‌ఫుల్ ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఈ ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌ (DM)ల్లో ఎవరికైనా సైలెంట్/మ్యూటెడ్ మెసేజెస్ పంపించవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సైలెంట్ మెసేజెస్ ఫీచర్‌తో, మీరు అవతలి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ మెసేజ్‌ (DMs)లను పంపవచ్చు. ఈ ఫీచర్ ప్రైవేట్, గ్రూప్ చాట్‌లలో పని చేస్తుంది.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


ఇన్‌స్టాగ్రామ్‌లో సైలెంట్ మెసేజెస్ ఎలా పంపాలి
ఇన్‌స్టాగ్రామ్‌లో సైలెంట్ మెసేజెస్ పంపడానికి ముందు యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్‌లో 238.0.0.0.35 వెర్షన్‌కి... ఐఓఎస్‌లో 236.1 లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ని లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసిన తర్వాత కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వాలి.

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్‌లో బ్యాంకులు ఈ రోజుల్లో తెరుచుకోవు

1. మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ ఓపెన్ చేయాలి.

2. టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న DM బటన్‌పై క్లిక్ చేయాలి.

3. సైలెంట్ మెసేజ్ పంపాలి అనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేయాలి.

4. సైలెంట్ మెసేజెస్ పంపడానికి “@silent” అని టైప్ చేసి, ఆపై స్పేస్ ఇచ్చి మీ మెసేజ్ టైప్ చేయాలి. ఉదాహరణకు – @silent

5. ఆపై సెండ్ బటన్ పై నొక్కాలి.

New Rules: సామాన్యుల జేబులకు చిల్లు... రేపటి నుంచి అమలులోకి వచ్చే 7 కొత్త రూల్స్ ఇవే

ఈ ఫీచర్‌ని ఉపయోగించి, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో సైలెంట్ మెసేజెస్ పంపవచ్చు, అంటే అవతలి వ్యక్తి ఫోన్‌లో మీరు పంపిన మెసేజ్‌లకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ సౌండ్‌ వినిపించదు. సైలెంట్‌గా వారి ఫోన్‌కు మీ మెసేజ్ సెండ్ అవుతుంది. దీనివల్ల వారికి డిస్టబ్ ఉండదు. పర్సనల్ మెసేజ్ పంపించడానికి ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. పైన పేర్కొన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు కూడా క్షణాల్లోనే సైలెంట్ మెసేజ్ పంపించవచ్చు.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


ఇన్‌స్టాగ్రామ్ రీసెంట్‌ టైమ్స్‌లో తన యాప్‌లో ఇలాంటి అనేక అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ యాప్‌కు ఇటీవల ఫేస్‌బుక్ అవతార్ సపోర్ట్ కూడా అందించింది. ఫేస్‌బుక్ యాప్‌లో అవతార్‌లను సెటప్ చేసే యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ డీఎంలలో అవతార్ స్టిక్కర్‌లను ఉపయోగించవచ్చు. అవతార్ స్టిక్కర్‌లను స్టోరీస్‌కు రియాక్షన్లగా పంపడానికి కూడా ఉపయోగించవచ్చు. అలానే పోల్స్‌, 30-సెకన్ల పాటలు, బ్రౌజ్ చేస్తున్నప్పుడే రిప్లై ఇవ్వడం వంటి ఇన్‌స్టాగ్రామ్ ఇతర ఫీచర్లు యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Instagram, Messages, New feature, Silent

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు