Vaccine Policy: కరోనా వ్యాక్సిన్ పై సందేహాలున్నాయా...అయితే ఇది ఇది మీకోసం...

ప్రతీకాత్మక చిత్రం

Vaccine Policy: వ్యాక్సినేషన్​ ప్రక్రియలో మీ సందేహాలకు సమాధానాలివే!

  • Share this:
దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తోంది. రోజుకు 3 లక్షలకు మించి కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి ఏకైక ఆయుధంగా భావిస్తోన్న వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. తొలి రెండు దశల్లో ఫ్రంట్​ లైన్​ వారియర్స్​, 45 ఏళ్ల పైబడిన వారికి వాక్సిన్​ ఇస్తోన్న ప్రభుత్వం.. మే 1 నుంచి ప్రారంభమైన మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇవ్వాలని నిర్ణయించింది.

మూడో దశలో మార్పులు ఏంటి?
మొదటి రెండు దశల్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (కోవిషీల్డ్), భారత్ బయోటెక్ (కోవాగ్జిన్)ల నుంచి వ్యాక్సిన్​ డోసులను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు దశల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగానే వ్యాక్సిన్​ అందజేయగా.. ప్రైవేట్​ ఆసుపత్రుల్లో మాత్రం డోసు వ్యాక్సిన్​ను రూ. 250లకు పంపిణీ చేసింది. ఇక మే 1 నుంచి ప్రారంభమైన మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను రెండు భాగాలుగా విభజించారు. కేంద్రానికి 50 శాతం, బహిరంగ మార్కెట్‌కు.. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ హాస్పిటల్స్​కు 50 శాతం పంపిణీ చేయాలని వ్యాక్సిన్​ తయారీ సంస్థలు నిర్ణయించాయి.

ప్రభుత్వ ఆసుప్రతుల్లో ఉచితంగానేనా?
కేంద్రానికి, రాష్ట్రాలకు 50 శాతం చొప్పున వ్యాక్సిన్​ పంపిణీ చేస్తామని భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​ సంస్థలు తెలిపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్​ తయారీదారుల నుంచి డోసులను కొనుగోలు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని టీకా కేంద్రాల్లో ఉచిత వ్యాక్సిన్​ అందుబాటులో ఉంటుంది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 250కు వ్యాక్సిన్ పొందవచ్చా?
లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఉన్న విధంగా రూ. 250లకు వ్యాక్సిన్లు ఇవ్వరు. అవి వాటి సొంత రేట్లను నిర్ణయిస్తాయి.

ప్రైవేట్ వ్యాక్సిన్​ సెంటర్​లో ఎంత ఖర్చు అవుతుంది?
ప్రైవేట్​ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధర మొదటి మూడు దశల కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, తయారీ సంస్థల నుంచి వారు టీకాలను అధిక ధరకు కొనుగోలు చేస్తారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ధరలు నిర్ణయించకుండా పర్యవేక్షిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీని కోసం ఒక యంత్రాంగ్రాన్ని ఏర్పాటు చేసింది. వ్యాక్సిన్​ నిల్వలు, ధరలను కో-విన్ ప్లాట్‌ఫాంలో పొందుపరుస్తామని పేర్కొంది.

ఏ రాష్ట్రానికి ఎన్ని డోసుల వ్యాక్సిన్​?
కరోనా యాక్టివ్​ కేసుల సంఖ్య ఆధారంగా కేంద్రం తన 50 శాతం వాటాను రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ప్రస్తుతానికైతే రాష్ట్రాలకు డిమాండ్ ప్రకారం వ్యాక్సిన్ డోసులను పంపిస్తుంది.

విదేశీ వ్యాక్సిన్ల సంగతేంటి?
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం ఉచితంగా అందివ్వదు. వాటిని బహిరంగ మార్కెట్​లోకి విడుదల చేస్తుంది. అంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇవి లభిస్తాయి. వీటి రేట్లను ఆయా విదేశీ వ్యాక్సిన్​ తయారీ సంస్థలు నిర్ణయిస్తాయి.

ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు?
ఒక టీకా కేంద్రంలో ఇదివరకే మొదటి డోస్​ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తారు. వారు మొదటి డోస్​ ఏ కంపెనీ వ్యాక్సిన్​ తీసుకున్నారో.. రెండో డోస్​ కూడా అదే కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వ్యాక్సిన్​ పంపిణీలో వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేట్ టీకా సంస్థలు టీకా ధరలను పారదర్శకంగా ప్రకటించాలని మాత్రం కేంద్రం కోరింది. కానీ ధరలపై చర్చించడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వలేదు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కోవిషీల్డ్​ టీకా ధరలను ఇటీవలే ప్రకటించింది. ్్్
Published by:Krishna Adithya
First published: