Agni - V: అగ్ని-V క్షిపణిని పరీక్షించేందుకు భారత్ సిద్ధం.. చైనాకు ఎందుకు వణుకు పుడుతోంది?

అగ్ని 5 క్షిపణిని చూసి చైనా ఎందుకు బయపడుతున్నది? (ప్రతీకాత్మక చిత్రం)

తొలి ఇంటర్ కాంటినెంటల్​ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం) అగ్ని- V (అగ్ని-5)ను మరోసారి పరీక్షించేందుకు భారత్ సిద్ధమైంది. దీంతో చైనా ఉలిక్కి పడుతున్నది.

  • Share this:
ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంటూ భారత దేశం​ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. దీంతో భారత్​కు ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు కంటగింపుగా మారింది. తాజాగా తొలి ఇంటర్ కాంటినెంటల్​ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం) అగ్ని- V (అగ్ని-5)ను మరోసారి పరీక్షించేందుకు భారత్ సిద్ధమైంది. దీంతో చైనా ఉలిక్కిపడుతోంది. అగ్ని- V (Agni-V)  టెస్ట్ నిర్వహించడం భారత్​కు ఇది తొలిసారి కాకపోయినా.. డ్రాగన్ దేశం (China) ఈసారి మరింత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ టెస్టుల తర్వాత భారత రక్షణ దళం అమ్ములపొదిలోకి ఈ ఖండాంతర అగ్ని క్షిపణి చేరనుంది. దీంతో భారత సాయుధ దళానికి (Indian Army) మరింత బలం చేకూరినట్టవుతుంది. అసలు అగ్ని- V విషయంలో చైనా ఎందుకు ఆందోళన చెందుతోంది.. పూర్తి వివరాలు ఇవే..

ఈ టెస్టుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత..

అగ్ని- V.. భారత తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం). 5000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. దశాబ్దకాలం పాటు దీని తయారీ ప్రక్రియ జరిగింది. అనుకున్న సుదూర లక్ష్యాన్ని అగ్ని- V విజయవంతంగా ఛేదించిందని 2018 జనవరిలో నిర్వహించిన ఐదో పరీక్ష తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అయితే, ఒకే ఏడాది రెండుసార్లు టెస్ట్ చేశాక సాయుధ దళాలకు అగ్ని- Vను అప్పగించాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది జూన్​, డిసెంబర్​లో క్షిపణి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇది ఆలస్యమైంది. అయితే తదుపరి టెస్టు సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. అయితే మిసైల్​కు ఇదే తొలి యూజర్ ట్రైల్స్ అని సమాచారం. అగ్ని- V ఒకటికి మించి ఎక్కువ వార్​హెడ్లను తీసుకెళ్లి.. విభిన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. రక్షణ పరిభాషలో దీన్ని మల్టిపుల్​ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్​ రీన్​ట్రీ వెహికల్ (ఎంఐఆర్​వీ) అంటారు.

IND vs ENG: వచ్చే ఏడాది జులైలో ఏకైక టెస్ట్ ఆడనున్న ఇంగ్లాండ్-ఇండియా.. అది సిరీస్ డిసైడరేనా?
ఎంఐఆర్​వీ అంటే ఏంటి..?

ఎంఐఆర్​వీ సామర్థ్యం ఉన్న క్షిపణులు విభిన్న లక్ష్యాలకు ఒకటి కంటే ఎక్కువ అణు వార్​హెడ్లను వేయగలవు. 1960లో అమెరికా తొలిసారి దీన్ని తయారు చేసింది. సంప్రదాయ మిసైళ్లు ఒకసారి ఒకే వార్​హెడ్​ను తీసుకెళ్లగలదు. అదే ఎంఐఆర్​వీ ఉంటే ఒకే సమయంలో ఎక్కువ వార్​హెడ్లను మోసుకెళ్లి.. విభిన్న లక్ష్యాలను ఛేదించగలదు. అంటే ఒకసారి ప్రయోగించి ఎక్కువ ప్రాంతాలపై దాడులు చేయవచ్చు. అలాగే ఎంఐఆర్​వీ ఉన్న మిసైళ్లు విభిన్న లక్ష్యాలను ఛేదించడమే కాకుండా.. వార్​హెడ్లను విభిన్న వేగాలతో, విభిన్న డైరెక్షన్లలో కూడా విడుదల చేయగలవు. కాగా భారత సరిహద్దు దేశాలు చైనా, పాకిస్థాన్ కూడా తమ వద్ద ఎంఐఆర్​వీ క్షిపణులు ఉన్నాయని గతంలో ప్రకటించాయి.

భారత్ వద్ద పృథ్వీ-II, అగ్ని-I, అగ్ని-II, అగ్ని-III, అగ్ని-IV పేర్లతో ఫుల్లీ ఆపరేషనల్​ ల్యాండ్ బేస్ట్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే సబ్​మెరైన్​ నుంచి లాంచ్ చేసే బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి.

ప్రయోగించిన ప్రాంతం నుంచి ఆయుధాలను మోసుకొని వెళ్లి నిర్దేశించిన లక్ష్యంలో లాంచ్ చేసే రాకెట్ లాంటి సెల్ఫ్ గైడెడ్​ వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థనే బాలిస్టిక్ మిసైల్ అంటారు. అత్యంత శక్తిమంతమైన పేలుడు పదార్థాలైన కెమికల్​, బయోలాజికల్, న్యూక్లియర్ ఆయుధాలను ఈ మిసైల్ తీసుకెళ్లగలదు.

Team India: కోహ్లీసేనకు దొరికిన 'వరుణాస్త్రం'.. పొట్టి ప్రపంచకప్‌లో ప్రధాన అస్త్రంగా మారనున్న వరుణ్ చక్రవర్తి?
చైనా ఎందుకు గగ్గోలు పెడుతోంది..?

ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్​ (యూఎన్​ఎస్​సీ)లో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా.. భారత్​లో మిసైల్స్ టెస్ట్​లపై అక్కసు వెల్లగక్కడాన్ని అలవాటుగా మార్చుకుంది. అగ్ని- V టెస్ట్​ను భారత్ మరోసారి చేస్తుందనగానే చైనా విదేశాంగ ప్రతినిధి జా లిజియన్ మీడియా ముందుకు వచ్చారు. అందరి ప్రయోజనాల కోసం దక్షిణాసియాలోని శాంతి, సెక్యూరిటీ, నిశ్చలత పాటించాలి. దీనికి అందరూ నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం” అంటూ మాట్లాడారు. అలాగే భారత్​, పాకిస్థాన్ న్యూక్లియర్ టెస్టులను ఆపాలని ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 1172ను లేవనెత్తారు. భారత మిసైల్ టెస్టులపై అభ్యంతరం తెలపడం డ్రాగన్ కంట్రీకి ఇది కొత్తేం కాదు.

అగ్ని- Vకి 5000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉండడం చైనాను మరింత కలవరానికి గురి చేస్తోంది. అణ్వాయుధాలను సులభంగా మోసుకెళ్లగల ఈ క్షిపణికి ఎనిమిదో పరీక్షఅని అధికారులు చెబుతున్నారు. ఈ క్షిపణి ద్వారా చైనాలోని ఏ నగరాన్నైనా భారత్ లక్ష్యంగా చేసుకోగలదు. ఒక్క ప్రాంతాన్నే కాకుండా విభిన్న ప్రాంతాలను టార్గెట్ చేసే సామర్థ్యం ఉంటుంది. అందుకే అగ్ని- 5 క్షిపణి తాజా ప్రయోగంపై డ్రాగన్ దేశం కంగారుపడుతోంది. అలాగే ఆస్ట్రేలియా, జపాన్​, భారత్​, అమెరికా ఓ క్వాడ్​ గ్రూప్​గా సైతం ఏర్పడ్డాయి. అయితే ఇది మిలటలీ అలయన్స్ కాకపోయినా చైనా ఉలిక్కి పడుతోంది. అలాగే ఆస్ట్రేలియా ఇటీవలే తన తొలి అణు జలాంతర్గామిని సైతం పరీక్షించింది.
Published by:John Naveen Kora
First published: