INDIA MAY NEED BOOSTER SHOTS POST COVID 19 VACCINATION BUT NEED IS NOT IMMEDIATE URGENT TOP CSIR SCIENTIS MK GH
Covid Vaccine: భారతీయులకు కరోనా టీకా మూడో డోసు అవసరమే..సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త
ప్రతీకాత్మక చిత్రం
రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు బూస్టర్ డోస్ సైతం అవసరం కావచ్చని చెబుతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అనురాగ్ అగర్వాల్. అయితే ఇవి ప్రస్తుతం అత్యవసరం కాదని తెలిపారు.
కరోనా మహమ్మారిని నివారించేందుకు కోవిడ్ టీకాలు తీసుకోవడం తప్పనిసరి అయింది. అయితే టీకా తీసుకున్న తర్వాత కూడా కొందరు కరోనా కోరల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు బూస్టర్ డోస్ సైతం అవసరం కావచ్చని చెబుతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అనురాగ్ అగర్వాల్. అయితే ఇవి ప్రస్తుతం అత్యవసరం కాదని తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ అనురాగ్.. న్యూస్ 18తో టీకాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఐజీఐబీ(IGIB) అనే శాస్త్రీయ పరిశోధన సంస్థ.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం ఐజీఐబీ సంస్థ కరోనా కొత్త వేరియంట్లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి సార్స్-కోవ్-2 జన్యువుల నిర్మాణాలపై పరిశోధనలు చేస్తోంది.
కరోనా బారిన పడి కోలుకున్న వారు రెండు టీకా డోసులు తీసుకుంటే.. వారిలో రోగనిరోధక శక్తి బూస్టర్ డోసు తీసుకున్నంత స్ట్రాంగ్‌గా బలపడే అవకాశం ఉందని డా.అగర్వాల్ అభిప్రాయపడ్డారు. రెండు టీకా డోసులతో సహా బూస్టర్ డోసు తీసుకోవడం కంటే.. కరోనా వైరస్ సంక్రమణ తర్వాత రెండు టీకా డోసులు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మరింత బలోపేతం అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. కోవిడ్ నుంచి రికవర్ అయిన వారు ఒక్క డోసు వైరస్ తీసుకున్నా.. సమర్థవంతమైన రక్షణ లభిస్తుందన్నారు. ఐసీఎంఆర్ జూన్, 2021 సర్వేలో 60% కంటే ఎక్కువ సెరోపాజిటివిటీ రేటు నమోదైంది కాబట్టి ఇప్పటికిప్పుడు అధిక సంఖ్యలో భారతీయులకు బూస్టర్ డోస్‌లు అవసరం కాకపోవచ్చని వివరించారు.
హెల్త్ కేర్ వర్కర్లు, రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులున్న వృద్ధులు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. కరోనాతో అధిక ముప్పు ఉన్న ఇలాంటి వ్యక్తులకు బూస్టర్ డోసు అవసరమవుతాయని చెప్పుకొచ్చారు. ఈ వర్గం వ్యక్తుల ఇన్ఫెక్షన్ స్టేటస్ అంచనా వేయలేం కష్టం కాబట్టి వీరికి ప్రత్యేకంగా బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం వస్తుందన్నారు. ఇప్పటికే ముప్పు ఎక్కువ ఉన్నవారికి బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ సరైన, సమగ్ర ప్రణాళికలు ఇంకా రచించలేదు.
"ఎవిడెన్స్ బేస్డ్ ప్లాన్ రూపొందించడానికి ముందు చేయాల్సిన పని చాలా ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఈ పనులు కొనసాగుతున్నాయి. సహజ రోగనిరోధక శక్తి లేదా టీకా డోసుల ద్వారా ఇచ్చే రోగనిరోధక శక్తి ఎంత సమయంలో క్షీణిస్తుందో తెలుసుకోవడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాం. అలాగే రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుందా లేదా.. దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అందిస్తుందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం." అని డాక్టర్ అనురాగ్ పేర్కొన్నారు.
కోవిడ్-19 వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది
కోవిడ్-19 వ్యాధి చాలా ఎక్కువగా ఉందని.. ఇది ఇంకా అంతం కాలేదని పల్మోనాలజిస్ట్, వైద్య పరిశోధకుడు డా.అగర్వాల్ అన్నారు. ఫెస్టివల్ సీజన్ కారణంగా రాబోయే నెలల్లో కొత్తగా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందన్నారు. అయితే ఈ వ్యాప్తి థర్డ్ వేవ్ మాదిరి తీవ్రంగా ఉండదన్నారు. థర్డ్ వేవ్ విజృంభణను సూచించే కొత్త వేరియంట్లు వచ్చినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) పరిశీలనలో తేలలేదని తెలిపారు. ఇప్పటివరకు థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని కానీ జాగ్రత్త పడటం చాలా ముఖ్యమని సూచించారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.