హోమ్ /వార్తలు /Explained /

Explained: కోవిడ్ టీకా రెండో డోసుపై ప్రజల నిర్లక్ష్యం.. వేసుకోకుంటే ఏమవుతుందో తెలుసా?

Explained: కోవిడ్ టీకా రెండో డోసుపై ప్రజల నిర్లక్ష్యం.. వేసుకోకుంటే ఏమవుతుందో తెలుసా?

దేశంలో కవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. నిన్న 19.13 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు ఎక్కువగా వస్తోన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు చేసింది.

దేశంలో కవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. నిన్న 19.13 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు ఎక్కువగా వస్తోన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు చేసింది.

Corona Vaccination: కరోనా నియంత్రణకు అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ (Covid-19 vaccine) రెండో డోసు గడువు ముగిసిపోతున్నా చాలా మంది టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా నియంత్రణకు అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ (Covid-19 vaccine) రెండో డోసు గడువు ముగిసిపోతున్నా చాలా మంది టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. చండీగఢ్‌లో 75,526 మంది గడువు ముగిసినా రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోలేదని అక్కడి ఆరోగ్యశాఖ గుర్తించింది. 16 వారాల కిందట 75,416 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరంతా రెండో డోసు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. మరో 110 మంది కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకుని 6 వారాలు దాటిపోయింది. వీరు కూడా రెండో డోసు వేయించుకోవాల్సి ఉన్నా ముందుకు రావడం లేదు.

కరోనా రెండో డోసు వేయించుకోవడం ఎంత ముఖ్యమో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) ప్రొఫెసర్ రాకేష్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వార్తాసంస్థకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక విషయాలపై మాట్లాడారు. ఆ వివరాలు..

India Corona Updates: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తవి ఎన్నంటే..

ప్రశ్న: ఆరోగ్యశాఖ డేటా ప్రకారం 70,000 మందికి పైగా కోవిషీల్డ్ రెండో డోస్ తీసుకోలేదు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉండవచ్చు?

సమాధానం: ప్రస్తుతం వేలాది మంది రెండో డోసు తీసుకోలేదు. వారితోపాటు, వారి కుటుంబసభ్యులు కూడా ప్రమాదంలో ఉన్నారు. వారు దేశ వనరులను కూడా వృథా చేస్తున్నారు. దేశంలో 10 కోట్ల మంది రెండో డోసు గడువు దాటిపోయినా వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇది ఆందోళనకరమైన విషయం. దీనిపై ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలి.

* ఎవరైనా రెండో డోస్ తీసుకోకుంటే ప్రోటోకాల్ ఏంటి? అలాంటి వారు మళ్లీ మొదటి డోస్ తీసుకోవాల్సి ఉంటుందా?

అలాంటి ప్రోటోకాల్స్ ఏమీ లేవు. కానీ సమయం మించిన తరువాత రెండో డోసు తీసుకున్నా, దాన్ని మొదటి డోసు కిందే లెక్కించాల్సి ఉంటుంది. మొదటి డోసు ఎక్కడ తీసుకున్నా సరే.. రెండో డోసు దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు.

Cow Dung : ఆవు పేడ తిన్నాడు -అదే బలమంటున్నాడు -Haryana డాక్టర్

* టీకా రెండు డోసులు తీసుకోవడం ఎంత ముఖ్యం?

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం తప్పనిసరి. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మినహా, మిగిలినవన్నీ రెండు డోసుల వ్యాక్సిన్లు. రెండో డోసు తీసుకున్న తరువాతే కరోనా నుంచి సరైన రక్షణ మొదలవుతుంది.

* పండుగల వేళ, రెండు టీకా డోసులు తీసుకున్న వారికి కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందా?

రెండు డోసులు తీసుకున్న వారికి కరోనా సోకే ప్రమాదం తక్కువ. ఒకవేళ కోవిడ్ సోకినా తీవ్రత తక్కువగా ఉంటుంది. రెండు డోసులు తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరడాన్ని తగ్గించడంతోపాటు, మరణం నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

అయ్యో పాపం.. 5వేల మందికి తన చేతులతో పురుడుపోసిన నర్సు.. తన డెలివరీకే ప్రాణాలు కోల్పోయిందే.

* మూడో వేవ్‌ను నిరోధించడంలో టీకా సహాయపడుతుందా?

మరో వేవ్‌ను నిరోధించడానికి కోవిడ్ సరైన ప్రవర్తనను నిర్వచించాల్సి ఉంది. అనవసర ప్రయాణాలు, సమావేశాలు నివారించాలి. మాస్క్ చాలా కాలం తప్పకుండా పెట్టుకోవాలి.

* తాజా డేటా ప్రకారం వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేస్తుంది?

దీనిపై సరైన వివరాలు లేవు. క్రమంగా శరీరంలో వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుంది. కొందరు ఆరు నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకోవాలని అమెరికా, ఇంగ్లాండ్ దేశాలు సూచించాయి.

* ఆరోగ్య కార్యకర్తలకు, ఇతర ఆనారోగ్య సమస్యలు ఉన్న వారికి బూస్టర్ డోసు ఉపయోగపడుతుందా?

ఇలాంటి వారికి బూస్టర్ డోస్ అవసరం అవుతుంది. రెండో డోసు తరువాత మనం సంవత్సరం వేచి ఉండవచ్చని ఐ.సి.ఎం.ఆర్ ( ICMR) చెబుతోంది.

First published:

Tags: Corona bulletin, Corona cases, Corona Vaccine, COVID-19 cases, COVID-19 vaccine

ఉత్తమ కథలు