Home /News /explained /

Omicraon variant: ఒమిక్రాన్ వల్ల కరోనా థర్డ్​ వేవ్​ వస్తుందా? దీన్ని ఎదుర్కోవడం ఎలా?

Omicraon variant: ఒమిక్రాన్ వల్ల కరోనా థర్డ్​ వేవ్​ వస్తుందా? దీన్ని ఎదుర్కోవడం ఎలా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ద్వారా మూడో వేవ్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలంతా రెండు డోసుల టీకాలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతోపాటు కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ పాటించాలని కూడా కోరింది. ఒప్పటికే దేశంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులను ధృవీకరించారు.

ఇంకా చదవండి ...
కరోనా కొత్త వేరియంట్ (Corona new variant) ఒమిక్రాన్ (Omicraon)ద్వారా మూడో వేవ్ ( Corona Third wave) వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలంతా రెండు డోసుల టీకాలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతోపాటు కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ (Covid-19 protocols)  పాటించాలని కూడా కోరింది. ఒప్పటికే దేశంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులను ధృవీకరించారు. అనేక మంది అనుమానితులను కూడా గుర్తించారు. ఇది వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను వేగవంతం చేసింది. డెల్టా వేరియంట్ దేశంలో వినాశనాన్ని సృష్టించింది. ప్రజలు దీన్ని కళ్లారా చూశారు. అందుకే ఒమిక్రాన్ విషయంలో కూడా జనం ఆందోళన చెందుతున్నారు. అనవసర భయాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరచుగా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలతో ఓ జాబితాను విడుదల చేసింది.

ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానాలివే..

1. ఒమిక్రాన్ ఆందోళనకర వేరియంటుగా ఎలా మారింది, దాన్ని ఎలా కనుగొన్నారు?
నవంబరులో దక్షిణాప్రికాలో మొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంటును గుర్తించారు. ఇది చాలా ఎక్కువ మ్యుటేషన్ రేటు కలిగి ఉంది. ఒమిక్రాన్ ఇన్ఫెక్టివిటీ, రోగనిరోధక శక్తిని తగ్గించడంతో సంబంధం కలిగి ఉందని గుర్తించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించింది.సార్స్ కోవ్ -2 (SARS-CoV-2) కోసం ఉపయోగించిన పద్దతి ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ కొనుగొన్నారు. మొదట ఆర్టీ పీసీఆర్ (RT PCR), తరువాత జీనోమ్ సీక్వెన్సింగ్ పద్దతిలో ఒమిక్రాన్ గుర్తించారు.

2. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఓమిక్రాన్‌తో కోవిడ్-19 (COVID -19 ) ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించే పద్దతులు మునుపటి వేరియంట్ల మాదిరిగానే ఉంటాయి. మాస్కును సక్రమంగా ధరించడం, కోవిడ్-19 టీకా రెండు డోసులు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడంతోపాటు, సాధ్యమైనంత వరకు వెంటిలేషన్ ప్రాంతంలో నివశించాలి.

3. ఇప్పటికే ఉన్న టీకాలు ఒమిక్రాన్ కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయా?
ఇప్పటికే ఉన్న టీకాలు ఒమిక్రాన్ నివారించడానికి పనిచేయవని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం ప్రకటించింది. టీకాలు వేసిన పౌరుల్లో కొత్త స్ట్రెయిన్ రీఇన్‌ఫెక్షన్‌కు కారణం అవుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. వ్యాక్సిన్లు ఇప్పటికీ తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తున్నాయని, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వేయడం చాలా ముఖ్యమని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

4. భారత్​లో మూడో వేవ్ త్వరలో వచ్చే అవకాశం ఉందా?
ఒమిక్రాన్ వేరియంటును గుర్తించడంతో నాల్గవ వేవ్ వచ్చినట్టు దక్షిణాఫ్రికా ప్రకటించింది. అయితే భారతదేశంలో టీకాలు వేగవంతంగా వేయడం వల్ల, అధిక సెరోపోజిటివిటీకి రుజువుగా డెల్టా వేరియంట్ ఎక్కువగా వ్యాపించడం వల్ల, ఒరియంట్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దక్షిణాఫ్రికా వెలుపలి దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. లక్షణాలను బట్టి, భారత్ సహా మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

5. ఒమిక్రాన్ వ్యాప్తిపై మనదేశం ఎలా స్పందిస్తోంది?
శాస్త్రీయ, వైద్య సంఘం సహాయంతో కేంద్రం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అంటువ్యాధుల వ్యాప్తిని నివారించడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Corona third wave, Coronavirus, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు