2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.30,307 కోట్ల డివిడెండ్(Dividend)ను ప్రభుత్వానికి బదిలీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయించింది. ఇది 10 సంవత్సరాలలో కనిష్ట డివిడెండ్. అంతకు ముందు సంవత్సరం ఇచ్చిన రూ.99,126 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 69 శాతం తగ్గింది. RBI, Public Sector Undertaking బ్యాంకుల నుంచి రూ.73,948 కోట్ల రూపాయల డివిడెండ్‌ను ఆశిస్తున్నట్లు కేంద్రం(Central) బడ్జెట్‌లో(Budget) పేర్కొనగా.. రూ.30,307 కోట్ల డివిడెండ్‌ను ఆర్‌బీఐ అందిస్తోంది. బడ్జెట్ సంఖ్యలతో పోలిస్తే దాదాపు రూ.43,641 కోట్ల లోటును సృష్టించింది.
డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది?
లిక్విడిటీ నిర్వహణ కోసం ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన రివర్స్ రెపో ఆపరేషన్ల కోసం ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు గణనీయమైన వడ్డీ ఆదాయాన్ని చెల్లించిందని, బ్యాంకులు తమ మిగులు నిధులను ఆర్‌బీఐ వద్ద నిలిపివేసాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త దీపన్విత మజుందార్ మాట్లాడుతూ..‘సిస్టమ్‌లోని మిగులు లిక్విడిటీని రోజువారీ, టర్మ్ రివర్స్ రెపో వేలంలో పెట్టుబడి పెట్టాం. దీని వల్ల ఆర్‌బీఐకి 3.35- 3.99 శాతం ఖర్చు అవుతుంది. ఇది ఆర్‌బీఐ నికర వడ్డీ రాబడులను తగ్గించింది” అని చెప్పారు.
తక్కువ ఫారెక్స్ నిల్వలు కూడా తక్కువ డివిడెండ్‌కు గణనీయంగా దోహదపడి ఉండవచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021 డిసెంబర్ చివరి నాటికి, దిగుమతుల విదేశీ మారక నిల్వలు (చెల్లింపుల బ్యాలెన్స్ ఆధారంగా) 2021 సెప్టెంబర్ చివరి నాటికి 14.6 నెలల నుంచి 13.1 నెలలకు తగ్గాయని పేర్కొంటున్నారు.
ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ ఆర్థికవేత్త శంఖనాథ్ బందోపాధ్యాయ మాట్లాడుతూ..‘రూపాయిని రక్షించడానికి బలమైన అమ్మకాల కారణంగా ఫారెక్స్ నిల్వలు కొంచెం తగ్గాయి. RBIకి ఇప్పుడు 9- 10 నెలల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పోరు, ప్రపంచ ద్రవ్యోల్బణ ధోరణుల కారణంగా అనిశ్చితి చాలా ఎక్కువగా ఉన్న తరుణంలో ఆర్‌బీఐ చాలా జాగ్రత్తగా ఉండవచ్చు’ అని తెలిపారు.
* డివిడెండ్‌ను RBI ఎలా లెక్కిస్తుంది?
ఆర్‌బీఐ ప్రభుత్వానికి చెల్లించాల్సిన మిగులు మొత్తంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా, RBI అనేక ఇతర గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ బఫర్‌ల కంటే ఎక్కువగా నిల్వలు, మూలధనాన్ని నిర్వహిస్తోందని ప్రభుత్వం అధిక చెల్లింపులను కోరింది.
చాలా మంది ఆర్థికవేత్తల ప్రకారం.. మిగులు అనేది ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో ఆర్జించిన ఆదాయం, వ్యయ భాగం అవశేషంగా అర్థం చేసుకోవచ్చు. ఇది తప్పనిసరిగా ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. విదేశీ కరెన్సీ ఆస్తులపై RBI రీవాల్యుయేషన్ నష్టం/లాభం కరెన్సీ, గోల్డ్ రీవాల్యుయేషన్ ఖాతా(CGRA)లో లెక్కిస్తారు. CGRA మార్పిడి రేటు/బంగారం ధర హెచ్చుతగ్గులకు వ్యతిరేకంగా బఫర్‌ను అందిస్తుంది. CGRA సరిపోకపోతే, అది కంటిన్జెన్సీ ఫండ్ (contingency fund) నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. బిమల్ జలాన్ కమిటీ సిఫారసుల నిబంధనలను ఆర్‌బీఐ పాటించాలి. జలాన్ ప్యానెల్ కంటిన్జనెన్సీ ఫండ్ కోసం తక్కువగా 5.5 శాతం స్థాయిని సూచించింది (ఎగువ ముగింపు 6.5 శాతం). ఫండ్ కింద ఆర్‌బీఐ ఇప్పటివరకు కొనసాగించిన కనిష్ట స్థాయి ఇది. 2019లో RBI కంటిన్జెన్సీ ఫండ్‌ను 5.5 శాతం వద్ద ఉంచడానికి, అదనపు మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీ చేయడానికి అంగీకరించింది.
ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం
ఆర్థికవేత్తల ప్రకారం, ఊహించిన దాని కంటే తక్కువ పన్నేతర వసూళ్లలో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కనిపిస్తుంది. బడ్జెట్ 2023 ఆర్‌బీఐ, పబ్లిక్ సర్వీస్ బ్యాంకుల నుండి డివిడెండ్‌గా రూ.73,948 కోట్లు అంచనా వేసింది. ఇందులో ప్రభుత్వం రూ.30,307 కోట్లు మాత్రమే పొందింది. పన్నేతర వసూళ్లలో మొత్తం రూ.43,641 కోట్ల అంతరాన్ని సూచిస్తుంది. గత సంవత్సరం ప్రభుత్వం తన లక్ష్యాన్ని బడ్జెట్ రూ.53,511 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు సవరించింది. RBI అధిక ఆదాయం రూ.99,122 కోట్ల మిగులు డివిడెండ్‌కు దారితీసింది.
Instagram Features: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఫీచర్స్.. తెలుసుకోండి.. ట్రై చేయండి
మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం
దీని ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై పరోక్షంగా పడే అవకాశం ఉంది. ఆర్థికవేత్తల ప్రకారం,2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక స్లిప్‌పేజ్ అంచనాలు బడ్జెట్ అంచనాలకు మించిన వ్యయానికి (ఆహారం, ఎరువుల కోసం అధిక సబ్సిడీ వ్యయం కారణంగా) దారితీసింది.
ప్రభుత్వానికి సాధ్యమయ్యే మార్గం
డివిడెండ్ చెల్లింపు-అవుట్‌ల స్థాయిని పెంచాలని ఆర్‌బీఐని అభ్యర్థించినట్లు ప్రభుత్వం దాని ఇతర వనరుల నుంచి మెరుగైన ఆదాయాల కోసం వెతకాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Central Government, Explained, Rbi