• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • HOW YOU CAN PROTECT YOUR AADHAR CARD AND WHICH ALLOWS YOU TO LOCK AND UNLOCK YOUR AADHAAR NUMBER SSR GH

మీ ఆధార్ కార్డు ఇంకెవ‌రైనా ఉప‌యోగిస్తే ఎలా అనుకుంటున్నారా? అయితే ఇలా దాన్ని సురక్షితం చేసుకోండి..!

మీ ఆధార్ కార్డు ఇంకెవ‌రైనా ఉప‌యోగిస్తే ఎలా అనుకుంటున్నారా? అయితే ఇలా దాన్ని సురక్షితం చేసుకోండి..!

ప్రతీకాత్మక చిత్రం

కార్డుదారులు ఇక్క‌డ చెప్ప‌బోయే కొన్ని స్టెప్స్ పాటించ‌డం వ‌ల్ల మీ ఆధార్ కార్డును భ‌ద్రంగా కాపాడుకోవ‌చ్చు. ఆధార్ కార్డు అంటే వ్య‌క్తి గుర్తింపును రుజువు చేయ‌డానికి అందుబాటులో ఉండే ప్ర‌త్యేక నంబ‌రు గ‌ల‌‌ కార్డు. ఈ యూనిక్ ఐడెంటిటీ ప్రూఫ్‌ను...

  • Share this:
ఏ గుర్తింపు కార్డ్ అయినా భద్రంగా ఉంచుకోవాలి. పొర‌పాటున దాని నెంబ‌రునో, లేదంటే ఆ కార్డునో ఎవ‌రైనా చ‌ట్ట‌వ్య‌తిరేక ప‌నుల‌కు ఉప‌యోగించారంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుకే భార‌త ప్ర‌భుత్వం ఆధార్ కార్డు భ‌ద్ర‌తను మ‌రింత ప‌టిష్టం చేయ‌డం కోసం వివిధ చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీని ద్వారా ఆధార్ కార్డు మిస్‌యూజ్ కాకుండా చూసుకోవ‌చ్చు. కార్డుదారులు ఇక్క‌డ చెప్ప‌బోయే కొన్ని స్టెప్స్ పాటించ‌డం వ‌ల్ల మీ ఆధార్ కార్డును భ‌ద్రంగా కాపాడుకోవ‌చ్చు. ఆధార్ కార్డు అంటే వ్య‌క్తి గుర్తింపును రుజువు చేయ‌డానికి అందుబాటులో ఉండే ప్ర‌త్యేక నంబ‌రు గ‌ల‌‌ కార్డు. ఈ యూనిక్ ఐడెంటిటీ ప్రూఫ్‌ను యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అంద‌జేస్తుంది. భార‌తీయ పౌర‌ులకు ఇచ్చే ఈ కార్డులో 12 అంకెలున్న బ‌యోమెట్రిక్ వివ‌రాలు పొందుప‌రుస్తారు. దీనికి భార‌త దేశంలో ఎంత ప్రాధాన్య‌త ఉంటుందంటే, బ్యాంక్ అకౌంట్ తెర‌వ‌డం నుంచి ఇన్‌క‌మ్‌ ట్యాక్స్ రిట‌ర్న్‌లు ఫైల్ చేయ‌డం వ‌ర‌కూ, అలాగే ప్ర‌భుత్వానికి సంబంధించిన ఎలాంటి ప‌థ‌కాన్ని పొందాల‌న్నా ఈ కార్డు ఎంతో అవ‌స‌రం.

ఇలాంటి అత్య‌వ‌స‌ర‌మైన ఆధార్ కార్డు భ‌ద్రంగా ఉంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం క‌దా!? అందుకే యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా మీ ఆధార్ కార్డును లాక్‌, అన్‌లాక్ చేసుకోవ‌డానికి వీలు క‌ల్పిస్తుంది. దీని వ‌ల్ల ఈ వ్య‌క్తి అయినా త‌న ఆధార్ కార్డు విష‌యంలో ప్రైవ‌సీని, భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేసుకునే అవ‌కాశం ఉంది. కింద వివ‌రించిన స్టెప్స్‌ను పాటిస్తే మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉంటుంది

ఆధార్ కార్డు లాక్ చేయ‌డం అంటే?
ఆధార్ కార్డును లాక్ చేయ‌డం అంటే మీ ఆధార్ కార్డు పైన ఉండే 12 అంకెల నెంబ‌రును లాక్ చేయ‌డ‌మే. దీనికి బ‌దులుగా అన్ని ర‌కాల ప్రామాణికత కోసం 16 అంకెల వ‌ర్చువ‌ల్ ఐడీ (VID) ఉంటుంది.

ఆధార్‌ను లాక్ చేయ‌డానికి రెండు మార్గాలున్నాయి

1. UIDAI  వెబ్‌సైట్ ద్వారా..
ఆధార్ సేవ‌ల కింద ఉండే రెసిడెంట్‌ పోర్ట‌ల్‌ను ఓపెన్ చేయాలి.
అక్క‌డున్న లాక్ & అన్‌లాక్ పైన క్లిక్ చేయాలి.
యుఐడి లాక్ రేడియో బ‌ట‌న్‌ను సెలెక్ట్ చేసి, త‌ర్వాత తాజా వివ‌రాల స్థానంలో యుఐడి నెంబ‌ర్‌, పూర్తి పేరు, పిన్‌కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి. త‌ర్వాత సెక్యురిటీ కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి.
త‌ర్వాత‌, సెండ్ ఓటిపి పైన గానీ, లేదంటే టిఓటిపి పైన‌గానీ సెలెక్ట్ చేసి, స‌బ్మిట్ పై క్లిక్ చేయాలి.
దీనితో మీ యుఐడి విజ‌య‌వంతంగా లాక్ అయిన‌ట్లే.

2. SMS ద్వారా
యుఐడిని లాక్ చేయాలంటే ముందుగా 16 అంకెల వ‌ర్చువ‌ల్ ఐడి నెంబ‌రు ఉండాలి. ఒక‌వేళ వర్చువ‌ల్ ఐడి లేక‌పోతే ఎస్ ఎమ్ ఎస్ స‌ర్వీస్ ద్వారా లేదంటే రెసిడెంట్ పోర్ట‌ల్ ద్వారా విఐడిని పొందొచ్చు.
ఎస్ ఎమ్ ఎస్ స‌ర్వీస్ కోసం GVID స్పేస్ యుఐడిలోని చివ‌రి 4 లేదా 8 అంకెల‌ను టైప్ చేయాలి. త‌ర్వాత 1947కు ఎస్ ఎమ్ ఎస్ చేయాలి. ఉదా GVID 1234

ఆధార్‌లో బయోమెట్రిక్‌ను లాక్ చేయ‌డం కూడా మ‌రో ప‌ద్ధ‌తి. `లాకింగ్ \ ఆన్‌లాకింగ్` స‌ర్వీస్ ద్వారా తాత్కాలికంగా మీ బ‌యోమెట్రిక్‌ను లాక్ చేయొచ్చు.

ఆధార్ బ‌యోమెట్రిక్‌ను లాక్ చేయ‌డం ఎలాగో చూడండి. రెసిడెన్షియ‌ల్ పోర్ట‌ల్‌ను ఓపెన్ చేయండి. అక్క‌డ `My Adhaar`కు వెళ్లి త‌ర్వాత `Adhaar Service`కు వెళ్లాలి. లాక్ \ అన్‌లాక్ బ‌యోమెట్రిక్ పైన క్లిక్ చేయాలి. త‌ర్వాత ఆధార్ లేదా విఐడి నెంబ‌ర్‌, క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి.

మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రుకు ఓటిపి వ‌స్తుంది. ఆ ఓటిపిని ఎంట‌ర్ చేసిన త‌ర్వాత స‌బ్మిట్ చేయాలి. ఇప్పుడు మీ బ‌యోమెట్రిక్స్ లాక్ అయిన‌ట్లే.
Published by:Sambasiva Reddy
First published:

అగ్ర కథనాలు