హోమ్ /వార్తలు /Explained /

EPFO: మీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి..? ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి..

EPFO: మీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి..? ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPFO క్రమంగా తన సేవలను డిజిటలీకరిస్తోంది. ముఖ్యంగా గత రెండు ఏళ్లలో పలు సేవలను ఆన్లైన్ చేస్తూ వస్తోంది. తద్వారా తమ పీఎఫ్ ను పొందేందుకు వేతన జీవులు రోజుల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) నుంచి వేతన జీవులు తమకు కావాల్సిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలో చాలామందికి అవగాహన లేకపోవచ్చు. EPFO క్రమంగా తన సేవలను డిజిటలీకరిస్తోంది. ముఖ్యంగా గత రెండు ఏళ్లలో పలు సేవలను ఆన్లైన్ చేస్తూ వస్తోంది. తద్వారా తమ పీఎఫ్ ను పొందేందుకు వేతన జీవులు రోజుల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేయడం దగ్గర నుంచి, కొత్త యూఏఎన్(UAN) నంబర్‌ను క్రియేట్ చేయడం, ఈపీఎఫ్(EPF) ఖాతా నుంచి డబ్బును డ్రా చేసుకోవడం వరకు ఇలా పలు సేవలను ఆన్‌లైన్‌లోనే సులభంగా అందిస్తోంది. వినియోగదారులు తమ EPFO ​​KYCని కూడా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


EPFO ​​బ్యాలెన్స్‌ తనిఖీ, EPF క్లెయిమ్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే ఫైల్ చేయవచ్చు. వీటితో పాటు ఇతర సేవలను సైతం ఈపీఎఫ్(EPF) చందాదారులు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు. కాబట్టి మీరు ఉద్యోగం మారుతున్నట్లయితే మీ PFని పాత కంపెనీ నుంచి ప్రస్తుత సంస్థకు బదిలీ చేయాలనుకుంటున్నారా? అయితే ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


* పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే..?

స్టెప్-1: యూనివర్సల్ అకౌంట్ నంబర్(UAN), పాస్‌వర్డ్ ను ఉపయోగించి EPF అకౌంట్‌కు లాగిన్ అవ్వాలి.

స్టెప్-2: ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

స్టెప్-3: ‘వన్ మెంబర్-వన్ ఈపీఎఫ్ అకౌంట్ (ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్)’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్-4: మీ వ్యక్తిగత సమాచారాన్ని, ప్రస్తుత PF ఖాతా వివరాలను ధ్రువీకరించుకోవాలి.

స్టెప్-5: PF అకౌంట్ వివరాల ధ్రువీకరణ అనంతరం, ఇంతకుముందు ఉద్యోగానికి సంబంధించిన PF అకౌంట్ వివరాలను చూసే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్-6: క్లెయిమ్ ఫామ్‌ను ధ్రువీకరించడానికి పాత కంపెనీ, లేదా ప్రస్తుత యజమానిని ఎంచుకోండి.

స్టెప్-7: తర్వాత మెంబర్ ID లేదా UAN టైప్ చేయాలి.

స్టెప్-8: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(OTP)ను పొందేందుకు గెట్ OTPపై క్లిక్ చేయండి.

స్టెప్-9: ఫోన్‌కి వచ్చిన OTPని ఎంటర్ చేసి, సబ్‌మిట్ చేయాలి.

స్టెప్-10: ప్రావిడెంట్ ఫండ్(PF) ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఫామ్‌ను స్వీయ ధ్రువీకరణ చేయాలి. మీ EPF బదిలీ రిక్వెస్ట్ గురించి మీ యజమానికి కూడా సమాచారం అందుతుంది.

Explained: భారత్ గోధుమల సరుకును టర్కీ ఎందుకు తిరస్కరించింది..? రుబెల్లా వ్యాధి అంటే ఏంటి..?


చివరిగా కొత్త యజమాని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(EPF) బదిలీ అభ్యర్థనను ఆమోదించిన తర్వాత మీరు ఎంచుకున్న ఖాతాకు ప్రావిడెంట్ ఫండ్ బదిలీ అవుతుంది. EPF ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ విజయవంతంగా ప్రాసెస్ అయిన తర్వాత మొబైల్ ద్వారా నోటిఫికేషన్‌ను అందుకుంటారు.

First published:

Tags: EPFO, Explained

ఉత్తమ కథలు