Home /News /explained /

HOW TO POSTPONE PERIODS WITH OUT TABLETS HERE IS ANSWER BA GH

Postpone Periods: టాబ్లెట్స్ అవసరం లేకుండా పీరియడ్స్ వాయిదా పడేది ఎలా?

6. వారం రోజులు ఉండాలా?
పిరియడ్ ఎన్ని రోజులకోసారి రావాలి? ఎన్ని రోజుల పాటు రక్తస్రావం జరగాలి? అన్న విషయం ప్రతి ఒక్కరికీ వేరుగా ఉంటుంది. మూడు నుంచి ఏడు రోజుల పాటు జరిగితే దాన్ని సాధారణ పిరియడ్ అని చెప్పవచ్చు. ఏడు కంటే ఎక్కువ రోజులు ఉంటే దాన్ని లాంగ్ పిరియడ్ అని అంటారు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని అర్థం.

6. వారం రోజులు ఉండాలా? పిరియడ్ ఎన్ని రోజులకోసారి రావాలి? ఎన్ని రోజుల పాటు రక్తస్రావం జరగాలి? అన్న విషయం ప్రతి ఒక్కరికీ వేరుగా ఉంటుంది. మూడు నుంచి ఏడు రోజుల పాటు జరిగితే దాన్ని సాధారణ పిరియడ్ అని చెప్పవచ్చు. ఏడు కంటే ఎక్కువ రోజులు ఉంటే దాన్ని లాంగ్ పిరియడ్ అని అంటారు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని అర్థం.

మహిళల్లో రుతుక్రమం సక్రమంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన రోజులు, ముఖ్యమైన ఫంక్షన్లు, కార్యక్రమాలు ఉన్నప్పుడు పీరియడ్స్‌ వస్తే అసౌకర్యంగా ఉంటుంది. దీంతో పాటు నలతగా అనిపించడం, చిరాకు, మూడ్ స్వింగ్స్.. వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇంకా చదవండి ...
మహిళల్లో రుతుక్రమం సక్రమంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన రోజులు, ముఖ్యమైన ఫంక్షన్లు, కార్యక్రమాలు ఉన్నప్పుడు పీరియడ్స్‌ వస్తే అసౌకర్యంగా ఉంటుంది. దీంతో పాటు నలతగా అనిపించడం, చిరాకు, మూడ్ స్వింగ్స్.. వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే చాలామంది పీరియడ్స్‌ను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని రకాల మందుల సాయంతో పీరియడ్స్ వాయిడా వేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పిల్స్ హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల దీర్ఘకాలంలో ఇతర సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వీటికి బదులుగా ఇళ్లల్లో లభించే కొన్ని పదార్థాల సహాయంతో దుష్ప్రభావాలకు దూరంగా ఉంటూ రుతుక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవచ్చు.

 ఆవాలు
ఆవాల్లో ఉండే ఔషధ గుణాలు రుతుక్రమాన్ని ఆలస్యం చేస్తాయి. ఒక చెంచా ఆవాలను రాత్రి పడుకునే ముందు కప్పు నీళ్లు లేదా పాలలో నానబెట్టాలి. వీటిని తరువాతి రోజు ఉదయం తినాలి. పీరియడ్స్ రావడానికి వారం రోజుల ముందు నుంచి ఈ పద్ధతులు పాటించాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే సబ్జా గింజలను కూడా ఆవాలకు బదులుగా తీసుకోవచ్చు.

నిమ్మరసం
నిమ్మరసంలో ఉండే సిట్రస్ సమ్మేళనాలు రుతుక్రమాన్ని ఆలస్యం చేస్తాయి. పీరియడ్స్‌ రావడానికి కొన్ని రోజుల ముందు నుంచి విటమిన్ సి లభించే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. రుతుక్రమంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల నుంచి కూడా నిమ్మరసం ఉపశమనం కలిగిస్తుంది. సిట్రస్ జాతి పండ్లు, రసాలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం మెరుగవుతుంది.

యాపిల్ సిడార్ వెనిగర్
యాపిల్ సిడార్ వెనిగర్ డీటాక్సిఫికేషన్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయే మలినాలను బయటకు పంపిస్తుంది. పీరియడ్స్ వాయిదా వేసేందుకు కూడా దీన్ని వాడవచ్చు. దీంట్లో ఉండే యాసిడ్లు రుతుక్రమాన్ని ఆలస్యం చేస్తాయని అధ్యయనాల్లో తేలింది. అందువల్ల పీరియడ్స్ రావడానికి 10-12 రోజుల ముందు నుంచే ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్‌ను గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీంట్లో ఉండే ఔషధ గుణాలు రుతుక్రమంలో ఎదురయ్యే కడుపునొప్పి, ఇతర సమస్యలను దూరం చేస్తాయి. అయితే దీన్ని పళ్లకు తగలకుండా తాగాల్సి ఉంటుంది.

పప్పులు
మనకు అందుబాటులో ఉండే వివిధ రకాల కాయధాన్యాలు, పప్పులు పీరియడ్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేయగలవు. వేయించిన ధాన్యాలు పీరియడ్స్‌ను ఆలస్యం చేస్తాయి. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఇతర జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. వేయించిన పప్పు ధాన్యాలు, వీటి పొడితో చేసే పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి.

ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టికి ఆయుర్వేద గుణాలు ఉంటాయి. చర్మ సౌందర్యానికి దీన్ని వాడతారు. అయితే ఇది పీరియడ్స్‌ను కూడా ఆలస్యం చేయగలదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 25-30 గ్రాముల ముల్తానీ మట్టిని కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. పీరియడ్స్ వచ్చే తేదీకి కనీసం ఒక వారం ముందు నుంచి దీన్ని క్రమం తప్పకుండా తాగాలి. కానీ ముల్తానీ మట్టిని నిపుణుల సలహాతోనే వాడాలి. దీని వాడకాన్ని కొన్నిరోజులకే పరిమితం చేయాలి.
Published by:Krishna Adithya
First published:

Tags: Health tip, Health Tips, Women health

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు