దేశవ్యాప్తంగా కరోనా సెంకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు రెండు లక్షలకు మించి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కోరల్లో చిక్కుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. చికిత్స కోసం లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. గతేడాది కరోనా పుణ్యామాని అనేక మంది ఉపాధి కోల్పోయారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కరోనా సోకితే చికిత్స మరింత భారంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కుంగిపోకుండా ఈ పరిస్థితిని నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. అయితే, కరోనా భారీన పడ్డ వారికి చికిత్సఅందించడానికి మీకు బీమా పాలసీ ఉన్నప్పటికీ,మీరు వ్యక్తిగతంగా కొంత నగదు సమకూర్చుకోక తప్పదు.ఉదాహరణకు, మీ భీమా మీకవరేజీనిపరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపుచికిత్స ప్రారంభించడానికిఆయా హాస్సిటల్స్ మిమ్మల్ని ఫీజు చెల్లించమని అడగవచ్చు. అందువల్ల, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. దీని కోసం అనేక మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.
క్రెడిట్ కార్డు ఉపయోగించండి
చాలా ఆస్పత్రుల్లోఇప్పుడు క్రెడిట్ కార్డులను అంగీకరిస్తున్నారు. అందువల్ల,ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డును ఉపయోగించండి.ఆరోగ్య భీమా ఉన్నప్పటికీ మీరు కొంత సొమ్ము కట్టాల్సి రావొచ్చు. కార్డ్తో అయితే వెంటనే పని అయిపోతుంది. అయితే, క్రెడిట్ కార్డు చెల్లింపులకు వడ్డీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఈ వడ్డీ30నుండి-49శాతంవరకు ఉంటుంది.అయితే,బకాయిలను తిరిగి చెల్లించడం సులభతరం చేయడానికి,ఆమొత్తాన్నిసమానమైన నెలవారీ వాయిదా(EMI)ల్లోకిమార్చుకోండి.
వ్యక్తిగత రుణం
చాలా బ్యాంకులు ఖాతాదారుల బ్యాంకు లావాదేవీలను బట్టి ప్రీ అప్రోవ్డ్ లోన్స్ వెసులుబాటు కల్పిస్తాయి. ఈ లోన్లను చాలా తక్కువ పత్రాలతో వీలైనంత త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇకవేళ మీకు ప్రీ అప్రూవుడ్ లోన్ వసతి లేనట్లైతే.. కేవైసీ తీసుకొని వీలైనంత త్వరగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి. మీ క్రెడిట్ స్కోరును బట్టి వీటికి 9 నుండి 26 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. ఈ ఆప్షన్ మీక్రెడిట్ కార్డునుండి బిల్లు చెల్లించడంకంటే ఖచ్చితంగామంచిదనే చెప్పవచ్చు. మీకు అత్యవసర పరిస్థితిలో ఒక్క రోజులోపే రుణం మంజూరు చేస్తాయి.
బంగారాన్నితనఖా పెట్టడం
బంగారాన్ని తనఖా పెట్టి రుణం పొందటం త్వరగా అయ్యే పని. మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నా సరే, బంగారంపై రుణాలు మంజూరు చేస్తుంటాయి బ్యాంకులు. ఈ రుణాలను పొందేందుకు ఎక్కువ పత్రాలు కూడా అవసరం లేదు.దరఖాస్తును సమర్పించినకొద్దిగంటల్లోనే బంగారు రుణాలు ఇవ్వబడతాయి.వీటిపై వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ వడ్డీ రేట్లు7-నుండి29% మధ్యఉంటాయి.
సెక్యూరిటీలపై రుణం
మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న సమయంలో మీరు పెట్టిన పెట్టుడులుఇప్పుడు రుణాల రూపంలో సహాయపడవచ్చు.స్థిర డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, డీమాట్ షేర్లు లేదా యులిప్స్,టర్మ్ ఇన్సూరెన్స్పథకాలపై మీరు రుణాలు పొందే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ మనం ముందే పత్రాలను సమర్పించి ఉంటాయి, కాబట్టి, పెద్దగా పత్రాలు, ప్రక్రియ లేకుండానే చాలా తక్కువ సమయంలో రుణం పొందే అవకాశం ఉంటుంది.ఈ రుణాల వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాల కన్నా తక్కువ.రుణ మొత్తం బీమా పాలసీ సరెండర్ విలువలో 60నుండి-90%, ఎఫ్‌డిలో 80నుండి-95%,మ్యూచువల్ ఫండ్లలో 50- నుండి 60%మధ్య ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Money