Home /News /explained /

HOW TO DECLARE A MOVIE TAX FREE WHAT ARE THE BENEFITS OF THIS GH VB

Explained: ఒక సినిమాను ట్యాక్స్-ఫ్రీగా ఎలా ప్రకటిస్తారు..? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక సినిమా పన్ను నుంచి పూర్తి మినహాయింపు పొందాలంటే దానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? సినిమాని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటిస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నేటితరం ప్రజలకు కశ్మీర్‌లో(Kashmir) జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తోంది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌(The Kashmir Files)’ సినిమా. డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మార్చి 11న విడుదలైన ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ సినిమాకు పొలిటికల్ సపోర్ట్ కూడా అందుతోంది. ఈ నేపథ్యంలో హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా(Goa), కర్ణాటక, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో సహా పలు రాష్ట్రాలు ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీని ట్యాక్స్-ఫ్రీగా(Tax Free) ప్రకటించాయి. దీంతో ఈ మూవీ టికెట్స్ తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక సినిమా పన్ను నుంచి పూర్తి మినహాయింపు పొందాలంటే దానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? సినిమాని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటిస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

NATO Vs Putin: పుతిన్‌ చర్యలను ఎదుర్కొనేందుకు నాటో సిద్ధమా..!నాటో రష్యాకు భయపడుతోందా..?


ట్యాక్స్-ఫ్రీగా ప్రకటించడానికి సినిమాకి ఉండాల్సిన అర్హతలు ఏంటి?
సినిమాలపై ట్యాక్స్-ఎగ్జమ్షన్ (Tax-Exemption) క్లెయిమ్ చేయడానికి స్థిరమైన ప్రమాణాలేవీ లేవు. ఒక సినిమాపై ట్యాక్స్ రెవిన్యూ క్లెయిమ్ ను వదులుకునే నిర్ణయం కేవలం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది. అది కూడా ఫలానా జోనర్ లో సినిమాలు తీస్తేనే పన్ను మినహాయింపు ఇస్తామని రాష్ట్రాలు చెప్పవు. ట్యాక్స్-ఎగ్జమ్షన్‌ను సినిమాలవారీగా ప్రకటిస్తారు. మొదటగా సినిమా ఎలాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి ప్రజలకు చూపిస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తాయి. సినిమా చూపించే సమస్యలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయా లేదా విషయాన్ని కూడా ప్రభుత్వాలు అంచనా వేస్తాయి. ఒక జనరల్ రూల్ ప్రకారం, ఒక సినిమా సామాజిక-సంబంధిత (Socially-Relevant), స్పూర్తిదాయకమైన సబ్జెక్ట్‌తో వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో కొన్నిసార్లు పన్ను నుంచి మినహాయింపు ప్రకటిస్తాయి.

ఇతర మూవీలతో పోలిస్తే ట్యాక్స్-ఫ్రీ మూవీలు చూడటం ఎంత చౌకగా ఉంటుంది?
2017లో వస్తు, సేవల పన్ను (GST) అమల్లోకి రాకముందు, రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపు పన్ను (Entertainment Tax)ను విధించాయి. ఈ పన్ను రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వినోదపు పన్ను ఎక్కువగా ఉంది. ఒక మూవీ ట్యాక్స్-ఫ్రీగా డిక్లేర్ చేసినప్పుడు, వినోదపు పన్ను మినహాయించడం జరుగుతుంది. ఫలితంగా టిక్కెట్ల ధరలు గణనీయంగా తగ్గాయి.

2018 వచ్చిన జీఎస్‌టీ విధానంలో, సినిమా టిక్కెట్లపై మొదట 28 శాతం జీఎస్‌టీ విధించారు. తదనంతరం రెండు స్లాబ్‌లు ప్రవేశపెట్టారు. వాటి ప్రకారం, రూ. 100 కంటే తక్కువ ధర ఉన్న టిక్కెట్‌లపై 12 శాతం జీఎస్‌టీ, ఆపై ఖరీదైన టిక్కెట్‌లపై 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. ఈ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. కాబట్టి ఒక రాష్ట్రం ఇప్పుడు ఏదైనా సినిమాని ట్యాక్స్-ఫ్రీగా ప్రకటించినప్పుడు, కేవలం స్టేట్ జీఎస్‌టీ (SGST) భాగం వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అయితే సెంట్రల్ జీఎస్‌టీ (CGST) అనేది టిక్కెట్లపై విధిస్తూనే ఉంటారు. దీన్నిబట్టి టిక్కెట్ ధర ఆధారంగా, 6 శాతం లేదా 9 శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది.

Explained: ఎక్కువ మంది ఉక్రెయిన్‌ శరణార్థులను అమెరికా ఎందుకు అనుమతించట్లేదు..? దీని వెనుక ఉన్న కారణాలు ఏవి..?


సాధారణంగా థియేటర్ ఓనర్లు వినోదపు పన్ను ప్రేక్షకుల నుంచి సేకరిస్తూ ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీఎస్‌టీ రెవిన్యూ వదులుకుంటే, థియేటర్ యాజమాన్యం స్టేట్ జీఎస్‌టీకి సమానమైన మొత్తాన్ని టికెట్ ధరల నుంచి తగ్గిస్తుంది. అయితే మూవీ నిర్మాతలు ట్యాక్స్-ఫ్రీ ట్యాగ్‌ని ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ఎండార్స్మెంట్ గా చూస్తారు. ఫిలిం సంపాదనలో పెద్ద వ్యత్యాసం లేకపోయినా ఈ ట్యాగ్ మూవీ ఇమేజ్, పబ్లిసిటీని పెంచుతుంది.

దేశంలో ఏ ఇతర మూవీలకు పన్ను మినహాయింపు లభించింది?
మన ఇండియాలో గాంధీ (1982) వంటి విస్తృతంగా ప్రశంసలు పొందిన, ముఖ్యమైన చిత్రాలను పన్ను-ఫ్రీగా ప్రకటించేవారు. అయితే 2016లో దంగల్, నీర్జా అనే రెండు సామాజిక సంబంధిత సినిమాలకు పలు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు లభించింది. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ (2017), ఛపాక్ (2020), మేరీ కోమ్ (2014), తారే జమీన్ పర్ (2007), డైస్లెక్సిక్ పిల్లల కథ; మర్దానీ (2014), నిల్ బట్టే సన్నాట (2015) వంటి సినిమాలు ఇటీవల కాలంలో ట్యాక్స్ ఫ్రీ ట్యాగ్ ని పొందాయి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Film tickets, Tax free

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు