Emergency fund: ఎమర్జెన్సీ అవసరాల కోసం డబ్బు ఎలా పొదుపు చేయాలి...

ప్రతీకాత్మక చిత్రం

గత ఏడాది కోవిడ్-19 కారణంగా చాలామంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకొందరు వ్యాపారాల నిర్వహణ సాధ్యపడక నష్టాలను ఎదుర్కొన్నారు. జీతాల్లో కోతలు అనివార్యమయ్యాయి. ఇలాంటి అనిశ్చితులను, ఊహించని ఖర్చులను భర్తీ చేయడానికి అత్యవసర నిధులు ఉపయోగపడాయి.

  • Share this:
గత ఏడాది కోవిడ్-19 కారణంగా చాలామంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకొందరు వ్యాపారాల నిర్వహణ సాధ్యపడక నష్టాలను ఎదుర్కొన్నారు. జీతాల్లో కోతలు అనివార్యమయ్యాయి. ఇలాంటి అనిశ్చితులను, ఊహించని ఖర్చులను భర్తీ చేయడానికి అత్యవసర నిధులు ఉపయోగపడాయి. అందుకే చాలామంది ప్రస్తుతం అత్యవసర నిధి ఏర్పాటు పై ఆసక్తి చూపిస్తున్నారు. ఊహించని, అనివార్యమయ్యే ఖర్చులను భర్తీ చేయడానికి నెలవారీ జీతంలో కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడాన్ని అత్యవసర నిధి లేదా ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. వాస్తవానికి ఫైనాన్షియల్ ప్లానర్లు అందరూ ఎమర్జెన్సీ ఫండ్‌ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తారు. ఎంతటి కఠినమైన ఆర్థిక లక్ష్యాలు ఉన్నా సరే.. కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం జీతానికి సమానమైన అత్యవసర నిధిని పక్కన పెట్టుకోవాలి.

వైద్య ఖర్చులు, నిరుద్యోగం, ప్రస్తుత ఉద్యోగాన్ని కోల్పోవడం, ప్రమాదం, కారు లేదా ఇంటి రిపేరింగ్, గృహోపకరణాల రిపేర్ లేదా రీప్లేస్మెంట్, ఇల్లు మారడం, బిల్స్ సెటిల్ చేయడం.. వంటివన్నీ అకారణంగా, ఊహించని విధంగానే ఎదురవుతాయి. నెలవారీ జీతాన్ని ఇతర అవసరాలకు కేటాయించాలని ప్రణాళిక వేసుకునే వారికి ఈ ఖర్చులన్నీ భారంగా మారతాయి. వీటిని ఎమర్జెన్సీ ఫండ్‌తో భర్తీ చేసుకొని ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తపడవచ్చు.

అత్యవసర నిధిని ఎలా నిర్మించాలి?

- ముందు మీరు ఆదా చేయాలనుకునే మొత్తం ఎంతో తేల్చుకోవాలి. జీతం, ఈఎంఐలు, నెలవారీ ఖర్చులు, ఇతర ఖర్చులను బేరీజు వేసుకొని ఎమర్జెన్సీ ఫండ్‌కు నిధులను మళ్లించాలి. కొన్ని ఫైనాన్షియల్ వెబ్‌సైట్లు ఇందుకు అవరసమయ్యే కాలిక్యులేటర్ యాప్‌లను అభివృద్ధి చేశాయి. అవసరమైతే వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటి ద్వారా మీ మొత్తం ఆదాయం, ఖర్చును లెక్కించాలి. ఆ తరువాత కొంత భాగాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా పక్కన పెట్టాలి. కనీసం ఆరు నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని పక్కన పెట్టాలి.

- ఎమర్జెన్సీ ఫండ్‌కు ఎంత కేటాయించాలో నిర్ణయం తీసుకున్న తరువాత.. ఫండ్స్‌ నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా అకౌంట్ తీసుకోవడం మంచిది. ఈ అకౌంట్‌కు క్రమశిక్షణతో విడిగా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయాలి. సేవింగ్స్ అకౌంట్‌ నుంచి ఆటో డెబిట్ సదుపాయం ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి నెలా ఎమర్జెన్సీ ఫండ్‌కు తప్పనిసరిగా నిధులు కేటాయించాలి. అయితే ఈ నిధులను సాధారణ సేవింగ్స్‌గా భావించకూడదు.

- ఎమర్జెన్సీ ఫండ్స్‌ను సులభంగా డబ్బుగా మార్చుకునే మార్గాల్లో సేవ్ చేయాలి. ఇందుకు సేవింగ్స్ అకౌంట్‌ను ఎంచుకోవడం మంచిది. వీటి నుంచి ఎప్పుడైనా సులభంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అవసరమైనప్పుడు లిక్విడ్ ఫండ్ మొత్తాన్ని రీడిమ్ చేసుకోవచ్చు. కొంతమంది క్యాష్ రూపంలో రిడీమ్ చేసుకోవడానికి రెండు మూడు రోజులు పట్టవచ్చు. అందువల్ల అత్యవసర సమయాల్లో ఆలస్యం కాకుండా డబ్బు తీసుకునేలా జాగ్రత్తపడాలి.

ఈ వీడియో చూడండి...మరిన్ని వీడియోల కోసం సబ్ స్క్రయిబ్ చేయండి...



- అత్యవసర నిధులను రెండు కేటగిరీలుగా విభజించుకోవాలి. మొత్తం ఫండ్‌ను దీర్ఘకాలిక అత్యవసర నిధులు, స్వల్పకాలిక అత్యవసర నిధులుగా విభజించాలి. ఇందుకు 15:15:70 ఫార్ములాను అనుసరించాలి. అంటే 15 శాతం నగదుగా, 15 శాతం బ్యాంకులో సేవింగ్స్ రూపంలో, మిగిలిన 70 శాతం లిక్విడ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్‌గా ఉండేలా జాగ్రత్తపడాలి. ఈ 70 శాతం నిధులు దీర్ఘకాలిక ఎమర్జెన్సీ ఫండ్స్‌గా ఉపయోగపడతాయి.
First published: