Andhra Pradesh: యువతీ, యువకుల తల్లిదండ్రులకు అలర్ట్.. మానసిక ఒత్తిడికి అదే కారణం..? ఏం చేయాలి..?

మానసిక ఒత్తిడికి అదే కారణమంటున్న నిపుణులు

ఎంతో భవిష్యత్తు ఉన్న యువత తీవ్ర ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు. చిన్ని చిన్న కారణాలతో పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు.. వారిలో డిప్రెషన్ ను ఎలా గుర్తించాలి.. ఆ ఒత్తిడి నుంచి బయట పడేయాలంటే ఏం చేయాలి.. మానసిక నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి..?

 • Share this:
  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18          యువత తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు.. శక్తికి మించిన పని చేయడంలో.. యుక్తి ప్రదర్శించడంలోనూ వారికి వారేసాటి.. ముఖ్యంగా మానసికంగా ఎంతో ధైర్యంగా ఉంటారు. ఇది ఒకప్పటి మాటగానే మిగిలిపోతోంది అనే భయం పెరుగుతోంది. రోజు రోజుకీ యువతలో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. కరోనా పరిస్థితులతో ఎవరిలోనైనా ఒత్తిడి ఉండడం సహజం.. అయితే అతి చిన్న చిన్న కారణాలకు కూడా వారు ఒత్తికి గురి అవ్వడంతో తీవ్రంగా ఆందోళన పెంచుతోంది. నేటి యువత మనసు చాలా సున్నితంగా ఉంటోంది. తల్లిదండ్రులు చేసే గారాబమో.. నేటి సమాజిక పరిస్థితులో.. కరోనా భయం లేదా లేక సోషల్ మీడియా ప్రభావమో చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకుంటున్నారు. అనుకున్నది జరగకపోతే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఏం కోరుకుంటున్నారో అది క్షణాల్లో జరిగిపోవాలి అనుకుంటున్నారు. లేదంటే కన్న తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు.

  ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలు అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.. ఫోన్ లో మాట్లాడనివ్వలేదని.. పెళ్లి ఆలస్యమైందని.. అమ్మ మందలించిందని.. కుక్క కొనివ్వలేదని.. బైక్ అడిగితే తండ్రి కాదాన్నాడని.. ఇలా చెప్పాలి అంటే  చాలానే ఉన్నాయి. ఇటీవల జరిగిన చాలా సంఘటనల్లో చిన్న చిన్న కారణాలతో యువత తమ జీవితాన్ని అర్థాంతంగా ముగించుకోడం కలరవపెడుతోంది.

  ఇదీ చదవండి: రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..!

  తాజాగా విశాఖ నగరంలోని ఓ యువకుడు.. తన తల్లిదండ్రులు బైక్ కొని ఇవ్వలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జీవీఎంసీ 51వ వార్డు పంజాబ్‌ హోటల్‌ దరి మహత్‌ కాలనీకి చెందిన 19 ఏళ్ల బెరిసెట్టి రాజ్‌కుమార్‌ జీవీఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా పారిశుద్ధ్య కార్మికులే. కొంతకాలంగా 1.50 లక్షల రూపాయల విలువైన బైక్‌ను కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాడు. కొన్ని రోజులు ఆగమని వారు సర్దిచెప్పారు. దీంతో మనస్థాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

  ఇదీ చదవండి: బీజేపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి ఆ కీలక నేత.. రివర్స్ అవుతున్న కమలం ప్లాన్

  ఇటీవల విశాఖపట్నంలో యువకుడు చేసిన పని.. ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. తనకు కుక్క పిల్ల కొనివ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరులో ఓ యువతి పెళ్లి ఆలస్యం చేస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలో ఫోన్ అతిగా మట్లాతున్నాదని తల్లి మందలించిందనే కారణంతో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా అతి చిన్నకారణాలకే వందేళ్ల జీవితాన్ని 20 ఏళ్ల వయసులోపే ముగించేస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారం వారిపై పెరుగుతున్న ఒత్తిడే అంటున్నారు ప్రముఖ మానిసక వైద్య నిపుణులు కూటికుప్పల సూర్యారావు.

  ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్.. సంక్షేమ పథకాల అమలుపై ఊహించని ట్విస్ట్

  ఇలాంటివి మానసిక ఒత్తిడి కారణంగానే జరుగుతాయని ఆయన అంటున్నారు. కరోనా కారణంగా విద్యార్దులు బయట ప్రపంచాన్ని చూడటం లేదని.. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన అభిప్రాయపడుతున్నారు. మియామి యూనివర్శిటీ కూడా దీనికి సంబందించి ఒక పరిశోదన చేసిందన్నారు. మత్తుమందుల ప్రభావం కూడా ఉంటోందని.. తల్లిదండ్రులు అతి గారాభం కూడా ఒక కారణమంటున్నారు. అందుకే చిన్న చిన్న కోరికలు తీర్చలేరా అని భవిష్యత్తు పై ఆందోళన పెంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ లేకపోవడం కూడా సమస్యే అంటున్నారు సూర్యారావు.

  పిల్లలు ఏం చేస్తున్నారు.. వారి మానసిక పరిస్థితి ఏంటి అన్నది ముందుగానే తల్లిదండ్రులు గుర్తించగలగాలి. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురవుతున్నట్టు గుర్తిస్తే వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అప్పుడు వారిని మానసిక ఒత్తిడి నుంచి బయటపడేయొచ్చు. అలాగే వారిని ఒత్తిడి గురిచేసే అంశాలకు దూరంగా ఉండేలా చూడడం.. మానసికంగా ఉత్సహాంగా ఉండేలా ప్రోత్సహించగలిగితే ఇబ్బందులు ఉండవు అంటున్నారు నిపుణులు.
  Published by:Nagesh Paina
  First published: