హోమ్ /వార్తలు /Explained /

Education Loan: విద్యా రుణాల్లో వడ్డీ ఎంత ఉంటుంది? EMI కాలిక్యులేటర్ ద్వారా తెలుసువడం ఎలా?

Education Loan: విద్యా రుణాల్లో వడ్డీ ఎంత ఉంటుంది? EMI కాలిక్యులేటర్ ద్వారా తెలుసువడం ఎలా?

Student Loans | ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసిన తర్వాత మీ నెలవారీ చెల్లింపులను ఎడ్యుకేషన్ లోన్ EMI కాలిక్యులేటర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. లోన్ మొత్తం, కాలపరిమితి, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ఈక్వేటెడ్ మంథ్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ (EMI) వివరాలు పొందవచ్చు.

Student Loans | ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసిన తర్వాత మీ నెలవారీ చెల్లింపులను ఎడ్యుకేషన్ లోన్ EMI కాలిక్యులేటర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. లోన్ మొత్తం, కాలపరిమితి, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ఈక్వేటెడ్ మంథ్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ (EMI) వివరాలు పొందవచ్చు.

Student Loans | ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసిన తర్వాత మీ నెలవారీ చెల్లింపులను ఎడ్యుకేషన్ లోన్ EMI కాలిక్యులేటర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. లోన్ మొత్తం, కాలపరిమితి, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ఈక్వేటెడ్ మంథ్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ (EMI) వివరాలు పొందవచ్చు.

ఇంకా చదవండి ...

    ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్ధులు తమ లక్ష్యాలను సాధించడానికి ఎడ్యుకేషన్ లోన్స్ (Education Loans) సహాయపడతాయి. మన దేశంలోని ప్రధాన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సైతం ఈ విద్యా రుణాలను అందిస్తున్నాయి. భారతదేశంలో, విదేశాల్లో ఉన్నత విద్య (Education abroad) కోసం విద్యా రుణాలు (Student Loans) అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఏయే కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్‌ ఇస్తారనేది రుణదాత నిర్ణయిస్తారు. నర్సరీ నుంచి ప్రారంభమయ్యే కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ కోర్సుల (Education Loan for Part time courses) కోసం కూడా ఈ రుణాన్ని పొందవచ్చు. అయితే ఎడ్యుకేషన్ లోన్స్‌పై వర్తించే వడ్డీరేటు రుణదాతను బట్టి మారుతుంది. 15 సంవత్సరాల వరకు రీపేమెంట్ వ్యవధి కలిగిన ఎడ్యుకేషన్ లోన్‌పై సంవత్సరానికి 6.60 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి. ఇలా తీసుకున్న లోన్‌ను నిర్ణీత వ్యవధి తరువాత వడ్డీతో సహా EMIల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ EMI ఎంత ఉంటుందనేది రుణ గ్రహీతలు ఆన్‌లైన్ ద్వారానే తెలుసుకోవచ్చు.

    రుణాలు అందించిన బ్యాంకులన్నీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లోన్ EMI క్యాలిక్యులేటర్లను అందుబాటులో ఉంచాయి. అనేక థర్డ్-పార్టీ ఫిన్ టెక్ సంస్థలు సైతం సొంతంగా ఇలాంటి క్యాలిక్యులేటర్లను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

    Scholarships: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.31 వేల నుంచి రూ.70వేల మధ్య స్కాలర్​షిప్ పొందాలంటే.. ఇలా చేయండి..



    ఎడ్యుకేషన్ లోన్ EMI కాలిక్యులేటర్లు అంటే ఏంటి?

    ఎడ్యుకేషన్ లోన్ EMI కాలిక్యులేటర్లు అనేవి మీ లోన్ EMIలను లెక్కించడానికి అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ టూల్స్. గణిత సూత్రాల ద్వారా ఈఎంఐ చెల్లింపులను లెక్కించడానికి బదులుగా సులభమైన ఈ ఆన్‌లైన్ సాధనాల ద్వారా కచ్చితమైన గణాంకాలు పొందవచ్చు. ఇవి సాధారణ క్యాలిక్యులేటర్‌ల మాదిరిగానే ఉంటాయి కానీ ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించి ఎడ్యుకేషన్ లోన్ EMI క్యాలిక్యులేటర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందుకు లోక్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాలను నింపాల్సి ఉంటుంది. అనంతరం ఒక సెకనులోపు మీ లోన్ EMI మొత్తం స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

    Online Courses: కోవిడ్ తరువాత ఈ కోర్సులకు పెరిగిన ఆదరణ.. 2021లో టాప్ ట్రెండింగ్ కోర్సులు ఇవే.. 



    ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసిన తర్వాత మీ నెలవారీ చెల్లింపులను ఎడ్యుకేషన్ లోన్ EMI కాలిక్యులేటర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. లోన్ మొత్తం, కాలపరిమితి, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ఈక్వేటెడ్ మంథ్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ (EMI) వివరాలు పొందవచ్చు. చాలా రుణదాతలు ప్రతి సంవత్సరం మీ లోన్‌లో కొంత భాగాన్ని (part prepayments) చెల్లించేందుకు అనుమతిస్తారు. మీరు ఇలాంటి పార్ట్ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. క్యాలిక్యులేటర్‌లో ఈ వివరాలను నమోదు చేసి, వడ్డీ చెల్లింపులపై ఎంత ఆదా చేయవచ్చు? మీ లోన్ గడువు ఎన్ని సంవత్సరాలకు తగ్గుతుంది? వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

    Entrance Exams: జేఈఈ మెయిన్ నుంచి నీట్ వరకు.. 2021లో ప్రవేశ పరీక్షల్లో ఎలాంటి మార్పులు వచ్చాయంటే..



    ఈ EMI కాలిక్యులేటర్లను ఎందుకు ఉపయోగించాలి?

    చెల్లింపులు తెలుసుకోవచ్చు

    ఎడ్యుకేషన్ లోన్ క్యాలిక్యులేటర్ల సాయంతో రుణ గ్రహీతలు ప్రతి నెలా చెల్లించాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ ఎంతో తెలుసుకోవచ్చు. లోన్ వ్యవధిలో ఎంత వడ్డీ చెల్లించాలి.. లోన్ వ్యవధి ముగిసే నాటికి చెల్లించాల్సిన మొత్తం పేమెంట్ ఎంతో కూడా తెలుసుకోవచ్చు.

    వేగవంతమైన విశ్లేషణ

    లోన్ కాలవ్యవధి, వడ్డీ రేటు, ఇతర వివరాలను ఎంటర్ చేయడం ద్వారా సెకన్ల వ్యవధిలోనే ఎడ్యుకేషన్ లోన్ EMIలను లెక్కించవచ్చు. గణిత సూత్రాల ప్రమేయం లేకుండా గణాంకాలు పొందవచ్చు.

    Education Loan: ఎడ్యుకేషన్ లోన్లు ఎలా అప్లై చేయాలి? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ? మొత్తం లిస్ట్..



    సులభమైన ప్రక్రియ

    కొన్ని ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా ఈఎంఐలను సులభంగా తెలుసుకోవచ్చు. సంప్రదాయ గణాంక పద్ధతుల్లో ఉండే కఠినమైన ప్రక్రియకు ఈ సాధనాల ద్వారా చెక్ పెట్టవచ్చు.

    సరైన లోన్ ప్లానింగ్

    క్యాలిక్యులేటర్ల సాయంతో ఈఎంఐలను తెలుసుకోవడం ద్వారా మంచి లోన్ రీపేమెంట్ ప్లాన్‌ను దరఖాస్తుదారులు సిద్ధం చేసుకోవచ్చు. ఇతర ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఈ ఈఎంఐకి సరిపోయే నిధులను జమచేసుకోవచ్చు.

    Top Professional Courses: ఆన్​లైన్​ కోర్సులకు పెరిగిన డిమాండ్​... భారతీయులు ఎంచుకున్న టాప్ 10 ప్రొఫెషనల్ కోర్సులివే



    తగిన లోన్ మొత్తాన్ని పొందడం

    క్యాలిక్యులేటర్ ద్వారా పొందిన ఈఎంఐ మొత్తం ఎక్కువగా ఉంటే.. ఎంటర్ చేసిన లోన్ అమౌంట్ మీకు భారంగా మారుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో లోన్ అప్లికేషన్‌ను రీ-వాల్యుయేషన్ చేసుకోవచ్చు.

    వివిధ కాంబినేషన్లకు పరీక్షించే అవకాశం

    ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లోన్ క్యాలిక్యులేటర్ల సాయంతో విభిన్న కాంబినేషన్లను ఉపయోగిస్తూ.. మీకు సరిపోయే ఈఎంఐ ఆప్షన్‌, లోన్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు.

    ఉచిత సేవలు- ఈ యూజర్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ లోన్ క్యాలిక్యులేటర్ సేవలను అన్ని సంస్థలు ఉచితంగానే అందిస్తుండటం మరో విశేషం.

    ఎడ్యుకేషన్ లోన్ EMIలను మాన్యువల్‌గా ఎలా లెక్కించాలి?

    ఆన్‌లైన్ విధానంలో ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐలను సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ EMIను లెక్కించేందుకు ఒక గణిత సూత్రం కూడా ఉంది.

    EMI = [P x R x (1+R) ^n] / [(1+R)^ n-1].

    ఇక్కడ P= ప్రధాన రుణ మొత్తం

    R= వర్తించే వడ్డీ రేటు

    n= నెలవారీ వాయిదాల సంఖ్య.

    మాన్యువల్ EMI లెక్కింపు ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుంది. ఇందుకు సమయం కూడా ఎక్కువగానే పడుతుంది. అందువల్ల ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లోన్ EMI క్యాలిక్యులేటర్‌ సేవలను ఉపయోగించుకోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.


    ఎడ్యుకేషనల్ లోన్ EMI క్యాలిక్యులేటర్‌ ప్రాధాన్యత

    వివిధ బ్యాంకుల ఎడ్యుకేషనల్ లోన్ EMI క్యాలిక్యులేటర్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఇంటర్‌ఫేస్ వాడకం చాలా సులభం. ఈ టూల్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు సమయాన్ని సైతం ఆదా చేస్తుంది. లోన్ వ్యవధి, వడ్డీరేట్ల పరంగా విస్తృతమైన ఆప్షన్లను కస్టమర్లు తనిఖీ చేసుకునే అవకాశం సైతం ఉంది. ఈ క్యాలిక్యులేటర్‌ కోసం లోన్ దరఖాస్తుదారులు కొన్ని ఇన్‌పుట్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. లోన్ మొత్తం (Loan Amount), పదవీకాలం (Tenure), వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపులు చేయాలనుకుంటున్నారా?.. వంటి వివరాలను అప్‌డేట్ చేస్తే సరిపోతుంది. అయితే వివిధ బ్యాంకులు అందించే ప్రత్యేకమైన టూల్స్‌లో కొన్ని అదనపు వివరాలు సైతం అందించాల్సి ఉంటుంది. ఈ విధానంతో సంప్రదాయ గణాంక పద్ధతుల అవసరం లేకుండా లోన్ దరఖాస్తుదారులు అన్ని వివరాలను సులభంగా పొందవచ్చు.

    First published:

    Tags: EDUCATION, Education Loan

    ఉత్తమ కథలు