ఈ రోజుల్లో కారు చాలామందికి ఒక నిత్యావసరంగా మారింది. ముఖ్యంగా కరోనా (Coronavirus) తరువాత చాలామంది వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు బ్యాంకులు సైతం తక్కువ వడ్డీతోనే కార్ల కొనుగోలుకు లోన్లు (Car Loan) అందిస్తున్నాయి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా అన్ని ఆదాయ వర్గాల వారి అవసరాలకు తగ్గట్లు కార్లను (Budget Cars) రూపొందిస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. అయితే కొత్త కారు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని వారు సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకుంటున్నారు. ఇలాంటి వాటి కోసం బ్యాంకులు ప్రత్యేకంగా లోన్లు (Used car loan) అందిస్తుండటం విశేషం. వీటిని యూజ్డ్ కార్ లోన్లు (Used Car Loan) అంటున్నారు. ఈ రుణాల ద్వారా మంచి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయవచ్చు.
యూజ్డ్ కార్ లోన్లను బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే అందిస్తున్నాయి. 7 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే వ్యవధితో ఇవి అందుబాటులో ఉన్నాయి. సంస్థలను బట్టి వడ్డీ రేట్లు మారుతాయి. నిర్దిష్ట రుణదాతలు కారు విలువలో 100% వరకు రుణాలను అందిస్తుండటం విశేషం. అన్ని ప్రధాన బ్యాంకులు, NBFCలు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు యూజ్డ్ కార్ లోన్లు అందిస్తున్నాయి. స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులు, నెలవారీ జీతం పొందే ఉద్యోగులు ఈ రుణాలు పొందవచ్చు.
సెకండ్ హ్యాండ్ కార్ లోన్ల ఫీచర్లు, ప్రయోజనాలు (Used Car Loans Features and Benefits)
కొత్త కార్ లోన్‌తో పోల్చినప్పుడు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు కోసం అందే లోన్ మొత్తం తక్కువగా ఉంటుంది. దీంతో మీ నెలవారీ EMIలు సైతం తక్కువగా ఉంటాయి. ఈ రుణాల రీపేమెంట్ వ్యవధి ఎక్కువగా ఉండటం వల్ల రుణ గ్రహీతల ఇతర ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం పడదు. కొన్ని బ్యాంకులు, NBFCలు 100% వరకు ఫైనాన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నాయి. దీని ద్వారా పెద్ద మొత్తంలో డౌన్‌పేమెంట్ భారాన్ని తప్పించుకోవచ్చు. ఈ లోన్ కోసం దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కొత్త కారుతో పోల్చినప్పుడు బీమా ఖర్చులు, తరుగుదల (depreciation) రేట్లు తక్కువగా ఉంటాయి. సరళమైన రీపేమెంట్ నిబంధనల ద్వారా ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండానే యూజ్డ్ కార్ రుణాలను తిరిగి చెల్లించవచ్చు.
కొత్త కార్ లోన్‌తో పోల్చినప్పుడు యూజ్డ్ కార్ లోన్‌కు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కారు వయసు 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే.. దాని కొనుగోలుకు కొన్ని బ్యాంకులు, NBFCలు రుణాన్ని అందించవు. అంతేకాక ఈ రుణ మొత్తంలో బీమా ఖర్చులు ఉండవు.
యూజ్డ్ కార్ లోన్‌కు అర్హత ప్రమాణాలు
జీతం పొందే ఉద్యోగులు
ఉద్యోగుల వయోపరిమితి 21-65 సంవత్సరాలుగా ఉండాలి. వారి ఆదాయం నెలకు కనీసం రూ.15,000 అయినా ఉండాలి. దీంతోపాటు ప్రస్తుత సంస్థలో కనీసం ఒక సంవత్సరం పాటు పని చేస్తూ ఉండాలి.
స్వయం ఉపాధి పొందేవారు
స్వయం ఉపాధి ఆదాయ మార్గం కలవారు యూజ్డ్ కార్ లోన్ పొందేందుకు వయో పరిమితి 25-65 సంవత్సరాలుగా ఉండాలి. వారి ఆదాయం ఏడాదికి కనీసం రూ.1.5 లక్షలుగా ఉండాలి. దీంతోపాటు కనీసం 3 సంవత్సరాల పాటు ఒకే రకమైన వ్యాపారంలో ఉండాలి.
ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం?
యూజ్డ్ కార్ లోన్ కోసం దరఖాస్తు ఫారం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, కార్ వాల్యుయేషన్ రిపోర్టు(Car valuation report)లను దరఖాస్తుదారులు సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్‌లలో ఏదో ఒక ఐడెంటిపీ ఫ్రూఫ్ అవసరం. అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ID, LIC పాలసీ, విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్‌లలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఇన్‌కమ్ ప్రూఫ్ కోసం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఆడిట్ షీట్, ఫారం 16, శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
యూజ్డ్ కార్ లోన్ కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?
దరఖాస్తుదారులు లోన్ పొందాలనుకుంటున్న బ్యాంక్ బ్రాంచ్ లేదా NBFC ఆఫీస్‌కు వెళ్లాలి. సంబంధిత లోన్ దరఖాస్తు ఫారంను పూరించాలి. మీరు యూజ్డ్ కార్ లోన్‌కు అర్హులో కాదో తనిఖీ చేయడానికి కొన్ని పత్రాలను రుణదాతలు అడుగుతారు. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తరువాత, లోన్ మంజూరుపై నిర్ణయాన్ని అధికారులు ప్రకటిస్తారు. అనంతరం రుణదాతతో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలు చర్చించండి. వీటన్నింటిపై ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత లోన్ ప్రాసెసింగ్ ప్రక్రియను పూర్తి చేయండి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ఎలా?
వివిధ బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల వెబ్‌సైట్లలో యూజ్డ్ కార్ లోన్ అర్హతను చెక్ చేసేందుకు ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంచాయి. ఈ లోన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు అవసరమైన పత్రాలను ముందుగానే ఆన్‌లైన్ విధానంలో సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూరించాలి. ఇందులో వ్యక్తిగత, ఉద్యోగ, ఆర్థిక వివరాలు నింపాల్సి ఉంటుంది. అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత సంస్థలు డాక్యుమెంట్లను వెరిఫై చేసి, వాటి చెల్లుబాటును తనిఖీ చేస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత కారు లోన్ మంజూరు చేస్తారు. ఆయా సంస్థల నియమ, నిబంధనల ప్రకారం నిర్ణీత వ్యవధిలో దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్‌కు లోన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. ఒకవేళ దరఖాస్తుదారుల డాక్యుమెంటేషన్ అసంపూర్తిగా ఉన్నా లేదా పత్రాలు చెల్లనివైనా, క్రెడిట్ రిపోర్ట్‌లో తేడాలు గుర్తించినా.. యూజ్డ్ కార్ లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది.
రుణ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే చిట్కాలు
తక్కువ వడ్డీ రేట్లు, తగిన కాల వ్యవధిలో పాటు స్పెషల్ ఆఫర్లతో యూజ్డ్ కార్ లోన్లను అందించే రుణదాత కోసం దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో తనిఖీ చేయాలి. వివిధ బ్యాంకులు, NBFCలు యూజ్డ్ కారు రుణాలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నాయి. ఆన్‌లైన్ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ సులభతరం అవ్వడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. రుణాల నెలవారీ ఈఎంఐ చెల్లింపులను తనిఖీ చేయడానికి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న కార్ లోన్ EMI క్యాలిక్యులేటర్లను ఉపయోగించవచ్చు. దీంతోపాటు లోన్ మంజూరు ప్రక్రియ త్వరగా జరిగే ఏర్పాటు చేసిన రుణదాతను ఎంచుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.