హోమ్ /వార్తలు /Explained /

Inspiration 4 Mission: అంతరిక్షంలోకి వెళ్లనున్న స్పేస్‌ ఎక్స్‌ వ్యోమగాములు..ప్రత్యేకత ఇదే...

Inspiration 4 Mission: అంతరిక్షంలోకి వెళ్లనున్న స్పేస్‌ ఎక్స్‌ వ్యోమగాములు..ప్రత్యేకత ఇదే...

8. గత అక్టోబరులో కూడా ఇలాంటి పోటీనే నిర్వహించారు. అప్పుడు దాదాపు 18 మంది గెలిచారు. వారికి $450,000 నాసా ఇచ్చింది. ఈ సారి ఎక్కువ‌మంది పోటీ ప‌డొచ్చ‌ని నాసా భావిస్తోంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం) (image credit - twitter - spacex)

8. గత అక్టోబరులో కూడా ఇలాంటి పోటీనే నిర్వహించారు. అప్పుడు దాదాపు 18 మంది గెలిచారు. వారికి $450,000 నాసా ఇచ్చింది. ఈ సారి ఎక్కువ‌మంది పోటీ ప‌డొచ్చ‌ని నాసా భావిస్తోంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం) (image credit - twitter - spacex)

సెప్టెంబర్ 15న (భారత్‌లో సెప్టెంబర్ 16 తెల్లవారుజామున) నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి నలుగురు వ్యోమగాముల బృదం అంతరిక్ష యాత్ర చేపట్టడానికి బయలుదేరనున్నారు. ఇన్‌స్పిరేషన్ 4 మిషన్‌లో భాగంగా అమెరికన్ బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మన్ నేతృత్వంలోని మొత్తం నలుగురు పౌరుల బృందం అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు.

ఇంకా చదవండి ...

అంతరిక్ష పర్యాటకాన్ని సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రైవేట్ స్పేస్ కంపెనీలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షంలోకి వ్యోమనౌకలను పంపించాయి. ఈ జాబితాలో స్పేస్‌ ఎక్స్ సైతం చేరనుంది. సెప్టెంబర్ 15న (భారత్‌లో సెప్టెంబర్ 16 తెల్లవారుజామున) నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి నలుగురు వ్యోమగాముల బృదం అంతరిక్ష యాత్ర చేపట్టడానికి బయలుదేరనున్నారు. ఇన్‌స్పిరేషన్ 4 మిషన్‌లో భాగంగా అమెరికన్ బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మన్ నేతృత్వంలోని మొత్తం నలుగురు పౌరుల బృందం అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ నిర్మించిన రాకెట్‌లో వీరు భూమి ‘లో ఎర్త్ ఆర్బిట్‌’కు వెళ్లనున్నారు. ఇది గతంలో ఇద్దరు బిలియనీర్లు జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్లిన దూరం కంటే చాలా ఎక్కువ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి?

స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ (మిషన్ కోసం రిసైలెన్స్‌గా పేరు మార్చారు).. అంతరిక్షంలోకి 575 కిలోమీటర్ల ఎత్తుకు నలుగురు వ్యక్తులను తీసుకెళ్లనుంది. ఇన్‌స్పిరేషన్‌ 4 పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాంటి అనుభవంలేని నలుగురు సాధారణ పౌరులను స్పేస్‌ఎక్స్‌ నింగిలోకి పంపనుంది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS), హబుల్ స్పేస్ టెలిస్కోప్ పరిధి దాటి మరింత ఎత్తుకు వెళ్లనుంది. ఐఎస్‌ఎస్‌ భూమికి 400 కిలోమీటర్లు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ 560 కిమీల ఎత్తులో ఉంది. నింగిలోకి దూసుకెళ్లే నలుగురు సిబ్బంది భూమి ‘లో ఎర్త్ ఆర్బిట్’ (LEO) కు వెళ్లనున్నారు. ఇది భూమి నుంచి సుమారు 2000 కిలోమీటర్లు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రపంచ దేశాలు ప్రయోగించే శాటిలైట్‌లు చాలా వరకు ఈ కక్ష్యలోనే ఉంటాయి.

హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేర్ మిషన్ల తరువాత భూమి నుంచి ఎక్కువ ఎత్తుకు చేరుకోనున్న వ్యక్తులు వీరే కావడం విశేషం. మూడు రోజుల అనంతరం వ్యోమగాములు తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్‌4పేమెంట్స్‌’ కంపెనీ సీఈవో జేర్డ్‌ ఐసాక్‌మాన్‌ భరిస్తున్నారు. ఐజాక్‌మాన్ భారీ ఖర్చుతో ఈ ఫ్లైట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ అనే క్యాన్సర్ ఛారిటీ సంస్థ కోసం 200 మిలియన్ డాలర్లను సమీకరించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా 100 మిలియన్ డాలర్లను ఈ ఇన్‌స్టిట్యూట్‌కి డొనేట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత నలుగురు సభ్యుల బృందం ఆరోగ్య పరిశోధనల కోసం డేటా సైతం సేకరించనున్నారు. మానవ శరీరంపై అంతరిక్ష ప్రయాణం ప్రభావం గురించి తెలుసుకోవడానికి రిసెర్చ్ గ్రేడ్ ECG యాక్టివిటీ, మూవ్‌మెంట్, నిద్ర, హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, క్యాబిన్ నాయిస్, కాంతి తీవ్రత.. వంటి వివరాలను వారు సేకరించనున్నారు.

ఈ బృందాన్ని స్పేస్‌లోకి తీసుకెళ్తున్న రాకెట్ ఏది?

స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన అతిపెద్ద ఫాల్కన్ 9 రాకెట్‌.. రిసైలెన్స్ క్యాప్సూల్‌ను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఫాల్కన్‌ 9 రాకెట్‌ అనేది రిఫ్లైట్ చేయగల మొదటి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ అని స్పేస్‌ఎక్స్‌ చెబుతోంది. భూమి కక్ష్యలోకి, కక్ష్యను దాటి మనుషులను తీసుకెళ్లగలదని, పేలోడ్‌లను రవాణా చేయగలదని ఆ సంస్థ వెల్లడించింది.

జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్స్ కంటే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది?

బెజోస్, బ్రాన్సన్ అంతరిక్ష యానం చేపట్టిన స్పేస్‌ఫ్లైట్‌లకు.. ఇన్‌స్పిరేషన్ 4 మిషన్‌కు తేడాలు ఉన్నాయి. వీరిని నింగిలోకి తీసుకెళ్లిన న్యూ షెపర్డ్, వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ-22 స్పేస్ క్రాఫ్ట్స్‌ రెండూ సబార్బిటల్ ఫ్లైట్‌లు. కానీ స్పేస్‌ఎక్స్ ఫ్లైట్ మాత్రం సిబ్బందిని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO) వరకు, భూమి నుంచి అత్యంత ఎత్తుకు తీసుకెళ్లగలదు.

బ్రాన్సన్, బెజోస్ ఇద్దరూ స్పేస్ అంచుని తాకినట్లుగానే భావించాలి. వీరి ప్రాజెక్టులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తయ్యాయి. అయితే ఇన్‌స్పిరేషన్ 4 ప్రయోగంలో మాత్రం వ్యోమగాములు మూడు రోజులు కక్ష్యలో గడిపిన తరువాత భూమికి తిరిగి చేరుకుంటారు. యూఎస్‌లో ఫ్లోరిడా తీరంలో ఉన్న ల్యాండింగ్ సైట్‌లలో స్ప్లాష్ డౌన్ ద్వారా వీరు ల్యాండింగ్ అవుతారని స్పేస్‌ఎక్స్ తెలిపింది.

రిసైలెన్స్ క్యాప్సూల్ కక్ష్యలో తిరగడానికి ఆర్బిటాల్ వెలాసిటీని, అంటే 27,000 kmph కంటే ఎక్కువ వేగాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఈ నలుగురు సభ్యులు ఉన్న క్యాప్సూల్ ప్రతి 90 నిమిషాలకు భూమి చుట్టూ ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ వేగంతో పోల్చుకుంటే.. బ్రాన్సన్, బెజోస్ ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్‌ల పని నామమాత్రమేనని తెలుస్తోంది.

నలుగురు సభ్యుల బృందంలో ఉన్నవారు ఎవరు?

ఇన్‌స్పిరేషన్ 4 మిషన్ పూర్తిగా ఆటోమేటెడ్‌గా పనిచేస్తుంది. భూమిపై ఉన్న మిషన్ సెంటర్ నుంచి దీన్ని నియంత్రిస్తారు. క్యాప్సూల్‌లో ప్రయాణిస్తున్న వారిలో 38 ఏళ్ల బిలియనీర్ ఫండర్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ షిఫ్ట్ 4 పేమెంట్స్ వ్యవస్థాపకుడు ఐసాక్‌మాన్.. ఈ మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరించనున్నారు. ఐసాక్‌మాన్ ఒక సర్టిఫైడ్ పైలట్. అతడికి విమానాలంటే పిచ్చి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ యుద్ధ విమానాలు అతడి వద్ద ఉన్నాయి.

సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌లో ఫిజిషియన్ అసిస్టెంట్, 29 ఏళ్ల చైల్డ్ క్యాన్సర్ సర్వైవర్ అయిన హేలీ ఆర్సెనియాక్స్.. ఈ స్పేస్‌ ఫ్లైట్‌లో మెడికల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈమెను హాస్పిటల్ ఎంపిక చేసింది. ప్రొస్థెసిస్‌తో (కృత్రిమ అవయవం) అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఆమె కాలికి ఏర్పడ్డ కణితి కారణంగా ఎముకను తొలగించారు. దీంతో ఒక మెటల్ రాడ్‌ను ఎముక స్థానంలో అమర్చారు.

ఏరోస్పేస్ డేటా ఇంజనీర్, యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన 41 ఏళ్ల క్రిస్ సెంబ్రోస్కీ, మిషన్ స్పెషలిస్ట్‌గా ఉంటారు. ప్రముఖ వ్యవస్థాపకులు, శిక్షణ పొందిన పైలట్ అయిన 51 ఏళ్ల డాక్టర్ సియాన్ ప్రొక్టర్ మిషన్ పైలట్‌గా వ్యవహించనున్నారు. వీరిద్దరినీ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ నలుగురు సిబ్బందికి అంతరిక్షయానంపై శిక్షణ ఇస్తున్నారు.

Published by:Krishna Adithya
First published:

Tags: NASA, Space

ఉత్తమ కథలు