హోమ్ /వార్తలు /Explained /

Explained: విటమిన్‌ C సప్లిమెంట్స్ ఎన్ని రకాలు..? మార్కెట్‌లో లభిస్తున్న మంచి సప్లిమెంట్స్ ఏవి..?

Explained: విటమిన్‌ C సప్లిమెంట్స్ ఎన్ని రకాలు..? మార్కెట్‌లో లభిస్తున్న మంచి సప్లిమెంట్స్ ఏవి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శరీరంలో ఇమ్యునిటీ(Immunity) పెంచడంలో విటమిన్‌ C బాగా పని చేస్తుంది. ఇది ప్రొటెంట్‌ యాంటీ ఆక్సిడెంట్‌. ఈ పోషకం ప్రతిరోజు శరీరం అన్ని రకాలు పనులను సక్రమంగా జరిపేలా సైకలాజికల్‌ ఫంక్షన్స్‌కు సహాయపడుతుంది.

శరీరంలో ఇమ్యునిటీ(Immunity) పెంచడంలో విటమిన్‌ C బాగా పని చేస్తుంది. ఇది ప్రొటెంట్‌ యాంటీ ఆక్సిడెంట్‌. ఈ పోషకం ప్రతిరోజు శరీరం అన్ని రకాలు పనులను సక్రమంగా జరిపేలా సైకలాజికల్‌ ఫంక్షన్స్‌కు సహాయపడుతుంది. విటమిన్‌ C(Vitamin C) మన శరీరానికి అవసరమయ్యే ఎసెన్షియల్‌ న్యూట్రియంట్‌. దీన్ని శరీరం దానంతట అది తయారు చేసుకోలేదు. అందులోనూ నీటిలో కలిగే స్వభావం ఉండటంతో దీన్ని శరీరం నిల్వ చేసుకోలేదు. ప్రతిరోజూ యూరిన్‌లో వచ్చేస్తుంది. అందువల్ల మనం ప్రతిరోజు శరీరానికి అవసరమైనంత విటమిన్‌ C తీసుకొంటున్నామా లేదా అనేది చూసుకోవాలి. చర్మం, ఎముకలు(Bones), గుండు, మెదడు, కణాల ఆరోగ్యానికి విటమిన్‌ C చాలా అవసరం. విటమిన్‌ C ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతోపాటు సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా మంచిదే.

నాణ్యమైన విటమిన్‌ C సప్లమెంట్‌ ఎంచుకోవడం ఎలా?

చాలా రకాల్లో విటమిన్‌ C సప్లిమెంట్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గమ్స్‌, లిక్విడ్‌, పౌడర్‌ రూపంలో లభ్యమవుతున్నాయి. ఏ రూపంలో విటమిన్‌ C ఉందనేది ప్రధానం కాకపోయినా నాణ్యతను పరిశీలించాలి. పిల్లలకు మాత్రం గమ్స్‌ తరహాలో లభ్యమయ్యే సప్లిమెంట్స్ ఇస్తే సులువుగా తినగలరు.

Explained: మణిపూర్‌ రాష్ట్రానికి వేర్పాటువాదులతో ముప్పు ఎంత..? కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ మేరకు ఫలిస్తాయి..?


సప్లిమెంట్స్ ఎంచుకొనే ముందు కొన్ని అంశాలను పరిశీలించాలి. ఇవి ఏయే రూపంలో లభిస్తున్నాయో తెలుసుకోవాలి.

సిట్రస్‌ బయోఫ్లేవనాయిడ్‌ ట్రియో: ఎక్కువగా విటమిన్‌ C అవసరమైన వారి కోసం ఇది తయారు చేశారు. శరీరంలో కణాలు అబ్సార్బ్‌ చేసుకొనేలా ఇది పని చేస్తుంది. విటమిన్‌ Cని సిట్రస్‌ బయోఫ్లేవనాయిడ్‌ రక్షిస్తుంది.

అబ్సార్బిక్‌ యాసిడ్‌:  విటమిన్‌ Cని తీసుకోవడానికి ఇది మంచి పద్ధతి. చిన్న చిన్న డోసులలో తీసుకొంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. శరీరం వినియోగించుకోలేని విటమిన్‌ C యూరిన్‌లో బయటకు వచ్చేస్తుంది.

లిపోసోమల్‌ విటమిన్‌ C:  పౌడర్‌, లిక్విడ్‌ రూపంలో లభ్యమవుతుంది. GI ట్రాక్ట్‌ ద్వారా కణాలకు చేరుతుంది.

ఫ్రూట్స్‌:  అన్ని రకాల ఫ్రూట్స్‌ నుంచి తీసుకొన్న విటమిన్‌ Cని సప్లిమెంట్స్‌లో వినియోగిస్తున్నారు. ఉసిరి, రోస్‌ హిప్స్‌, అసరోలా ప్రధాన వనరులు.

సిట్రస్ బయోఫ్లేవనాయిడ్స్‌: సిట్రస్‌ బయోఫ్లేవనాయిడ్స్‌ విభిన్న రూపంలోని ఫైటోనూట్రియంట్స్‌, వవిటమిన్‌ C రూపం కాదు. అయితే విటమిన్‌ C సప్లిమెంట్స్‌లో వినియోగిస్తారు. విటమిన్‌ C ఆక్సిడేషన్‌లో కీలకంగా పని చేస్తుంది.

ఎంత విటమిన్‌ C అవసరం?

ఎలాంటి విటమిన్‌ C తీసుకొంటున్నామో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఎంత తీసుకోవాలనేదానిపై కూడా అవగాహన పెంచుకోవడం అంతే ముఖ్యం. ప్రతిరోజూ మహిళలకు 75 మిల్లీగ్రామ్స్‌, పురుషులకు 90 మిల్లీగ్రామ్స్‌ విటమిన్‌ C అవసరమవుతుంది. హైపొటెన్సీ డోసెస్‌ కావాల్సిన వారికి 250 నుంచి 1000 మిల్లీగ్రాములు అవసరం అవుతుంది.

విటమిన్‌ C సప్లిమెంట్స్ ప్రయోజనాలు

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరం అన్ని రకాల పనులను సక్రమంగా నిర్వహించుకోవడానికి విటమిన్‌ C ఉపయోగపడుతుంది. చర్మం, ఎముకలు, గుండె, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఐరన్‌ను శరీరానికి అందిస్తుంది.

ఇది కూడా చదవండి: ఊపిరిపీల్చుకోండి.. ఈ నియమాలు అనుసరిస్తే మీ ఊపిరితిత్తులకు ఏ హానీ కలగదు..!

నాణ్యమైన విటమిన్‌ C సప్లిమెంట్స్ ఇవే..

Mindbodygreen Vitamin C Potency+: 1000 మిల్లీగ్రామ్‌ల డోసులో తీసుకోవచ్చు. ఈ పౌడర్‌ ఒక్క డోసులో 15 నారింజ పండ్లలో ఉన్నంత విటమిన్‌ C ఉంటుంది. పుల్లని పండ్ల నుంచి తీసిన సిట్రస్ బయోఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి.

Pure Encapsulations Liposomal Vitamin C liquid: లిపోసోమాల్‌ విటమిన్‌ C రూపంలో లభిస్తుంది. లిక్విడ్‌ తరహాలో ఉంటుంది. ఇందులోని ఫ్యాట్‌ శరీరంలో విటమిన్‌ C అబ్సార్బ్‌ కావడానికి ఉపయోగపడుతుంది.

Solaray Timed Release Super Bio Vitamin C: చాలా త్వరగా దీన్ని శరీరం అబ్సార్బ్‌ చేసుకోగలదు. నిమ్మకాయల నుంచి తీసిన సిట్రస్‌ పెక్టిన్‌, బయోఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి.

Solgar Ester-C Plus 500 mg Vitamin C Vegetable Capsules: ఇది నాన్‌ ఎసిడిక్‌ రూపంలోని విటమిన్‌ C. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మెటబాలిస్మ్‌ను పెంచి వైట్‌ బ్లడ్‌సెల్స్‌ అబ్సార్బ్షన్‌కు సహకరిస్తుంది.

mindbodygreen immune support+: రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలకం. విటమిన్‌ C, విటమిన్‌ D3, జింక్‌ బిస్‌గ్లైసినేట్‌ ఉంటాయి.

Pure Synergy Pure Radiance C: 120 మిల్లీగ్రాముల డోసులలో అందుబాటులో ఉంది. ఆర్గానిక్‌ ఫ్రూట్స్‌ నుంచి విటమిన్‌ C తీసుకొంటారు.

CIBIL SCORE: సిబిల్‌ స్కోర్‌ అంటే ఏంటి..? లోన్లు పొందడంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది..?


Garden of Life Living Vitamin C Antioxidant Blend: ఇది కూడా ఆర్గానిక్‌ ఫ్రూట్స్‌ నుంచి తీసుకొన్న విటమిన్‌ Cతో తయారు చేశారు. లోయర్‌ డోసులలో లభిస్తుంది.

MegaFood Ultra C-400 mg: ఫ్రూట్స్‌, కూరగాయలు, తృణధాన్యాలు, హెర్బ్స్‌ నుంచి తీసుకొన్న విటమిన్‌ C ఇందులో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది.

అయితే అవసరమైన వారు మాత్రమే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి. వీటిని ఎంచుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

First published:

Tags: Explained, Health, Health benefits, Vitamin c

ఉత్తమ కథలు